"పైసా వసూల్" అంటోన్న బాలయ్య
on Jun 9, 2017
గౌతమీపుత్ర శాతకర్ణి విజయం తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య తన 101వ సినిమాను ఎవరితో చేస్తాడా అంతా ఎదురుచూశారు. ఎంతోమంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ చివరకు పూరి జగన్నాథ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. షూటింగ్ మొదలుపెట్టడం దానిని ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయింది. అంతా బాగానే ఉంది కానీ సినిమా టైటిల్ ఏంటన్నది మాత్రం బయటకు చెప్పలేదు పూరి. నాలుగైదు టైటిళ్లు పరిశీలించినప్పటికీ దేనిని ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యంలో రేపు నటసింహం పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. సినిమా పేరు పైసా వసూల్. ఇందులో కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.