ఇంత రచ్చ చేస్తే మగధీర కాలి గోటికి కూడా రాలేదు
on Jun 10, 2017

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన సినిమా మగధీరని రాబ్త దర్శక నిర్మాతలు కాపీ చేసారని కోర్ట్ లో కేసు వేయడం, తర్వాత కోర్ట్ బయటే మేటర్ సెటిల్ చేసుకోవడం మనకు తెలిసిందే. సినిమా విడుదలకి ఇబ్బంది కలిగించ కూడదు అన్న మంచి ఉద్దేశ్యంతో కోర్ట్ బయటే మాట్లాడుకున్నాం అని అల్లు అరవింద్ చెప్పగా, తాము కేసు గెలిచామని మగధీర నిర్మాత కేసు ఉపసంహరణ చేసుకున్నారని రాబ్త దర్శకుడు చెప్పడం జరిగింది. అయితే ఇంత రచ్చ చేస్తే, నిన్న విడుదలయిన రాబ్త, మగధీర కాలి గోటికి కూడా సరిపోనంత నాసి రకంగా వచ్చిందని టాక్ వచ్చింది. క్రిటిక్స్ సినిమాని విపరీతంగా విమర్శిస్తే, ప్రేక్షకులు కూడా దాదాపు అదే ఒపీనియన్ వ్యక్తపరిచారు. లీడ్ ఆక్టర్స్ సుశాంత్ సింగ్ రాజపుట్, కృతి సనాన్ ల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ తప్ప ఇంకా ఏ అంశం కూడా అంతగా పండలేదు అని తెలిసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



