మహేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
on Jun 8, 2016
బ్రహ్మోత్సవం మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్. అయినా మహేష్ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం మహేష్ అభిమానులే కాక, నిర్మాతలు, దర్శకులు, సినీజనాలు కూడా ఒప్పుకునే మాట. అందుకే ఆయన రెమ్యునరేషన్ ఇంకా చుక్కల్లోనే ఉంది. నిజానికి ఈ సినిమా తర్వాత మహేష్ రెమ్యునరేషన్ తగ్గే అవకాశం ఉందని భావించారందరూ. అయితే అలా అనుకున్నవాళ్లకు షాక్ ఇస్తూ, 23 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను ముట్ట చెప్పింది మహేష్ మురుగదాస్ సినిమా తెరకెక్కిస్తున్న సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. ముందు సినిమాను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను బాగా తగ్గిస్తున్నారని వచ్చిన వార్తలు కూడా దీని బట్టి అవాస్తవమేనని అనుకోవచ్చు. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న మహేష్, రాగానే షూటింగ్ పై దృష్టి పెట్టబోతున్నాడట. ఓ పక్క మురుగదాస్ టెక్నికల్ డిటెయిల్స్ పై దృష్టి పెట్టాడని సమాచారం. బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను కూడా మూవీలోకి తీసుకున్న నేపథ్యంలో, ఆమెకు ఎంత ఇచ్చి ఉంటారన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. హారిస్ జయరాజ్, మురుగదాస్ ల పేమెంట్ కూడా దృష్టిలో పెట్టుకుంటే, మూవీ బడ్జెట్ ఈజీగా 100 కోట్లు దాటేస్తుందని అంచనా.