బిగ్ బాస్ బ్యూటీ వేలికి ఉంగరం... కథేంటో మరి?
on Oct 28, 2020
"రెండు రోజులు వెయిట్ చేయండి పూర్తి వివరాలు చెబుతాను" అని హీరోయిన్, బిగ్ బాస్ పునర్నవి భూపాలం అంటున్నారు. ఆమె పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది. "ఫైనల్లీ... ఇట్స్ హ్యాపెనింగ్" అని బుధవారం సాయంత్రం పునర్నవి సోషల్ మీడియా లో ఒక పోస్టు చేశారు. అందులో ఆమె చేతికి ఉంగరం ఉంది. దీన్నిబట్టి ఎవరైనా ప్రపోజ్ చేయడమో లేదా నిశ్చితార్థం జరిగి ఉండడమో అవుతుంది అందరూ ఊహిస్తున్నారు. ఈ నెల 30 వరకు వెయిట్ చేయమని సస్పెన్స్ మరింత పెంచారు.
బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగింది. షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ప్రేమను ధృవీకరించలేదు. అలాగని ఖండించలేదు. కానీ తాము స్నేహితులమనే చెప్పుకొచ్చారు. ఇటీవల ఈ టీవీ వారు నిర్వహించిన ఒక షోలో మళ్లీ తమ మధ్య ప్రేమ ఉంది అన్నట్టు వ్యవహరించారు. పునర్నవి కోసం రాహుల్ ఒక పాట కూడా పాడారు.
అసలు ఈ నెల 30న పునర్నవి ప్రేమ లేదా పెళ్లికి సంబంధించిన విషయం చెబుతారా? లేదంటే తాను నటిస్తున్న వెబ్ సిరీస్ గురించి ఏదైనా అనౌన్స్మెంట్ ఇస్తారా అనేది చూడాలి.
Also Read