అద్దంలో చూసుకుని వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్.. ఎందుకంటే?
on Oct 28, 2020
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అవికా గోర్. అప్పటికే ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో బుల్లితెర వీక్షకులను పలకరించింది. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కొన్ని చిత్రాలు చేసింది. నటిగా పేరు, డబ్బు సంపాదించిన ఈ అమ్మాయి... గతేడాది ఓ రాత్రి వెక్కి వెక్కి ఏడ్చిందట. దానికి కారణం ఏంటో తెలుసా? అధిక బరువు.
హీరోయిన్గా పరిచయమైనప్పటికీ, గతేడాదికి అవికా గోర్ శరీరాకృతిలో చాలా మార్పు వచ్చింది. ఆమె బాగా బరువు పెరిగారు. మళ్లీ ఇప్పుడు చూస్తే చాలా తగ్గారు. బరువు తగ్గడానికి గల కారణాలను అవికా గోర్ వివరిస్తూ... ‘‘నాకింకా గుర్తుంది! గతేడాది ఓ రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. పెద్ద చేతులు, కాళ్లు... బాగా పెరిగిన పొట్ట... నాకు నేను నచ్చలేదు. థైయిరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యల వలన అయితే అంత బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే... అవి నా కంట్రోల్లో ఉండవు కాబట్టి. కానీ, అసలు సమస్య అది కాదు. ఇష్టం వచ్చినట్టు తిని, వర్కవుట్ చేయకపోవడం వలన బరువు పెరిగా. అందుకని, నాకు నేను నచ్చలేదు. నాకిష్టమైన డ్యాన్స్ చేయడాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయా. నేను బ్యాడ్‌గా ఫీలయ్యేలా ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని అనుకున్నా. మంచి ఫుడ్ తీసుకుంటూ వర్కవుట్లు చేశా. ఇబ్బంది అయినా ఆపలేదు. నా చుట్టూ ఉన్న మనుషులు కూడా నన్ను గైడ్ చేశారు. బరువు తగ్గాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు అద్దంలో చూసుకుంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని అనిపించిందని అవికా గోర్ తెలిపారు. తనకు తాను అందంగా కనిపించానని చెప్పుకొచ్చారు. మనం చేయలేని విషయాల గురించి బాధపడటం ఆపేసి... మన కంట్రోల్లో ఉండే విషయాల గురించి ఆలోచిద్దామని ఆమె అన్నారు.
Also Read