English | Telugu

పూజాకి హాట్ ట్రిక్ పడితే... బన్నీ పని అవుట్

on Jun 19, 2017

నాగ చైతన్య ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, తన రెండవ చిత్రం ముకుందలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన చేసింది. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయినా, విషయం లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. కానీ, పూజా హెగ్డే ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు. అచ్చ తెలుగు అమ్మాయిలా భలే చేసింది అని ఆ అమ్మాయిని కొనియాడారు. ఈ మధ్యలో హృతిక్ రోషన్ సరసన మొహెంజో దారో అనే సినిమా చేసింది. అనుకున్న స్థాయిలో లేకపోవడంతో మొహెంజో దారో బాలీవుడ్ లో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇన్ని ఫ్లాపులు వచ్చినా పూజాకి ఆఫర్లు మాత్రం తగ్గలేదు.

అందులో ఒకటే, అల్లు అర్జున్ హీరోగా త్వరలో రానున్న దువ్వాడ జగన్నాధం. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ లో పూజా చాలా అందంగా కనిపిస్తుంది. డీజే ఆడియో లాంచ్ ఫంక్షన్లో కూడా అందరు అమ్మాయిని ప్రశంసించారు. అయితే, కెరీర్ మొత్తంలో ఒక్క హిట్ కూడా కొట్టని పూజా డీజే పైనే అన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయిందా ఓకే... లేదా హాట్ ట్రిక్ ప్లాప్స్ లిస్ట్ లో చేరిందా ఇంక అంతే సంగతులు... వరుస హిట్లతో దూసుకు పోతున్న అల్లు అర్జున్ కి పెద్ద బ్రేక్ పడ్డట్టు అవుతుంది. పూజా హెగ్డే పేరు మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాకి పరిశీలనలో ఉందని అంటున్నారు. అయితే, అది డీజే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here