'అసుర' ట్రైలర్ లో అదిరిన డైలాగ్స్
on May 15, 2015
అసుర ట్రయిలర్ చూస్తే నారా రోహిత్ నుంచి మరో వైవిధ్యమైన సినిమా రాబోతున్నట్లుగా అనిపిస్తోంది. ట్రయిలర్ చూస్తుంటే కథ వైనం తెలియచేయకుండానే, సినిమాను చూడాలనే తహతహను పెంచేస్తోంది. ఈ ట్రైలర్ లో డైలాగులు కూడా బాగానే పేలాయి. - రేయ్ నా టైమింగ్ మామూలుగా ఉండదు.. నీకు అర్థమయ్యేలోపలే అంతా అయిపోద్ది. - నోటితో చెప్పే మాట కన్నా చేత్తో చెప్పే మాటే ఎక్కువ గుర్తుంటుంది సార్ - నీకు లాఠీలు అక్కర్లేదు బాబు.. మాటలతోనే కొట్టేస్తావ్ - మా వాళ్లంతా యావరేజ్‌గా ఉన్నారు కదా... నేనే బాగున్నాను కదా - నేరం, పాపం ఒకటేరా ఒకసారి చేస్తే చచ్చేంత వరకు నీ వెనకే వస్తాయి - ఇప్పటి నుంచి నేను నీకు కనిపించను...నేను మొదలు పెట్టిన ఆట మాత్రమే కనిపిస్తుంది - సమస్య నాది కానప్పుడే నేను మనిషిని కాను..అదే సమస్య నాదైతే - రాక్షసులా వాళ్లు ఎప్పుడైనా గెలిచారా..... ఇటీవలి కాలంలో వచ్చిన ఇంట్రస్టింగ్ ట్రయిలర్ ఇదే అని చెప్పుకోవాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
