విదేశాల్లో పుట్టి దేశీ సినీ ప్రియుల్ని అలరిస్తోన్న అందాల భామలు!
on Sep 17, 2020
మన దేశీ చిత్రసీమలో తమదైన ముద్రవేసిన తారలు కొంతమంది విదేశాల్లో పుట్టినవాళ్లు కావడం ఆసక్తిని కలిగించే విషయం. వారిలో టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎక్కడో పుట్టిన వాళ్లు సినీ ప్రియులను తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంటూ అభిమానాన్ని సంపాదించుకోవడాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆ అందాల భామలెవరో చూద్దామా...
కత్రినా కైఫ్
హాంకాంగ్‌లో బ్రిటిష్ తల్లికీ, కశ్మీరీ తండ్రికి జన్మించిన కత్రినా, తర్వాత సినిమాల్లోకి రాకముందు చాలా కాలం పేరెంట్స్‌తో పాటు లండన్‌లో గడిపింది. 2003లో బూమ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ రేంజికి చేరింది. మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఆమె సన్నిహితమే.
దీపికా పడుకోనే
ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడైన ప్రకాశ్ పడుకోనే కూతురైన దీపిక పుట్టింది ఇండియాలో కాదు, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో. ఆ తర్వాత బెంగళూరులో పెరిగిన ఆమె, షారుఖ్ ఖాన్ మూవీ ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ఇవాళ నంబర్‌వన్ స్టార్‌గా రాణిస్తోంది. త్వరలో ప్రభాస్ సరసన నటించడం ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది.
సన్నీ లియోన్
కెనడాలో సిక్కు దంపతులకు పుట్టి, అక్కడే పెరిగిన సన్నీ లియోన్.. యు.ఎస్.లో పోర్న్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నాక బిగ్ బాస్ షోకు ఇండియాకు వచ్చి, బాలీవుడ్లో స్థిరపడడం ఒక థ్రిల్లర్‌ను గుర్తు చేస్తుంది. టాలీవుడ్‌లోనూ ఆమె కరెంట్ తీగ మూవీలో టీచర్‌గా మెరిసింది.
జాక్వలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంకలో పుట్టి, బహ్రెయిన్‌లో పెరిగిన జాక్వలిన్ 2009లో అలాదిన్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. సాహోలో ప్రభాస్‌తో ఓ పాటలో ఆమె అందాల ఆరబోతను మరచిపోగలమా!
నర్గీస్ ఫఖ్రి
న్యూయార్క్‌లో జెకొస్లేవియా మదర్కూ, పాకిస్తానీ ఫాదర్‌కు పుట్టిన నర్గీస్ ఫఖ్రి 2011లో రణబీర్ కపూర్ సరసన నటించిన రాక్‌స్టార్ మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టింది.
సారా జేన్ డయాస్
ఒమన్ దేశంలో పుట్టి పెరిగిన సారా జేన్ డయాస్ మొదట విశాల్ సొంత సినిమా తీరధ విలైయట్టు పిళ్లై మూవీతో తెరంగేట్రం చేసింది. టాలీవుడ్లో ఏకంగా పవన్ కల్యాణ్ మూవీ పంజాలో మెయిన్ హీరోయిన్ రోల్లో తొలిసారిగా నటించి ఆకట్టుకుంది.
ఎవలీన్ శర్మ
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జర్మనీ తల్లికి, ఇండియా తండ్రికీ పుట్టిన ఎవలీన్ ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. సాహో మూవీతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది.
Also Read