గుణశేఖర్ స్కెచ్ మార్చిండూ...
on Nov 2, 2015
రుద్రమదేవిని విడుదల చేయడంలో ఉక్కిరిబిక్కిరి అయిన గుణశేఖర్... ఆ సినిమా ఊహించినట్టుగానే `ఓ మాదిరిగా` మిగిలిపోవడంతో భారీ నష్టాల బాట పట్టాల్సివచ్చింది. మెల్లిమెల్లిగా కనీసం 50 శాతం పెట్టుబడిని తిరిగి దక్కించుకోగలిగాడు. రుద్రమదేవి తరవాత.. సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు తీస్తానని అప్పట్లోనే ప్రకటించాడు గుణ. దానికి దిల్‌రాజు కూడా `సై` అన్నాడు. స్ర్కిప్టు రెడీ చేస్తే నిర్మించడానికి నేను రెడీ అన్నాడు. అయితే ఇంతలోనే గుణశేఖర్ స్కెచ్ మారింది.
ప్రతాపరుద్రుడు కథని పక్కన పెట్టి మరో స్టోరీ రెడీ చేశాడట. అదు... వీరాభిమన్యు. ఈ టైటిల్‌ని గుణ ఫిల్మ్‌ఛాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించేశాడు. దాంతో.. ప్రతాపరుద్రుడ్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు అయ్యింది. వీరాభిమన్యు కూడా... భారీ బడ్జెట్ చిత్రమే. అయితే అందులో కమర్‌షియల్ అంశాలెక్కువట. అందుకే వీరాభిమన్యువైపు గుణశేఖర్ మొగ్గు చూపించాడని తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో హీరోగా నటించేదెవరు? గుణనే ఈ సినిమాని నిర్మిస్తాడా? లేదంటే దిల్‌రాజు ఆ బాధ్యత తీసుకొంటాడా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.