ENGLISH | TELUGU  

రివ్యూ: మాస్‌ని అలరించే ‘గంగ’

on May 2, 2015

రాఘవ (లారెన్స్‌) పడిపోయిన తమ ఛానల్‌ టీఆర్పీ రేటింగ్స్‌ పెంచడానికి ప్లాన్‌ చేసిన ఫేక్‌ హారర్‌ షోకి కెమెరామెన్‌గా వెళతాడు. ఆ షోకి డైరెక్టర్‌ నందిని (తాప్సీ). ఒక బీచ్‌ హౌస్‌లో ఈ షోని ప్లాన్‌ చేస్తారు. అయితే వారు ఊహించని విధంగా నిజంగానే కొన్ని ఆత్మలు వారిని వెంటాడడం మొదలవుతుంది. నందినిని ఒక ఆత్మ ఆవహించడంతో రాఘవ, అతని తల్లి (కోవై సరళ) ఇబ్బందుల్లో పడతారు. నందినిని ఆవహించిన ఆత్మ ఎవరిది, దాని కథేంటి?

కాంచన’ సీక్వెల్‌గా ‘గంగ’ నుంచి ఏమి ఆశిస్తామో అవన్నీ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా కామెడీని బాగా వాడుకుంటాడు లారెన్స్. హీరోనే అత్యంత పిరికివాడిగా చూపించడంలోనే అతడి కామెడీ రహస్యం దాగుంది. గంగలో ఈ క్యారెక్టర్‌ను మరింత బాగా వాడుకుని నవ్వులు పండించాడు.  ప్రథమార్థంలో నవ్వులకు ఢోకా లేకుండా చూసుకున్న లారెన్స్.. ఇంటర్వెల్‌కు ముందు ఫియర్ ఫ్యాక్టర్ మీద దృష్టిపెట్టాడు. తాళితో ముడిపడిన సన్నివేశాలు..స్వామీజీ సీన్స్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు ముప్పయ్‌ నిముషాలు సినిమాకి హైలైట్‌గా చెప్పుకోవాలి. మొత్తానికి ప్రథమార్ధంలో కామెడీకి తోడు, హార్రర్ కూడా పండటంతో ద్వితీయార్ధం మీద అంచనాలు పెరుగుతాయి.

ఐతే సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశ పరుస్తుంది. కోవై సరళతో చేసే బాదుడు కామెడీ బాగానే పేలింది కానీ.. ఆ తర్వాత సినిమా గాడి తప్పింది. లారెన్స్ దయ్యం అవతారాలు మార్చే పాటలో డోస్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ముసలావిడగా.. చిన్నపాపగా.. లారెన్స్ అవతారాలు థ్రిల్ కలిగిస్తాయి. ఆ పాటలో లారెన్స్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా అదరగొట్టాడు. ఐతే ఫ్లాష్ బ్యాక్‌ కొంచెం లెంగ్తీ అయిపోవడం.. వయొలెన్స్ మోతాదు పెరిగిపోవడం..గ్రాఫిక్స్ మోతాదు పెరిగిపోయి.. వీడియో గేమ్‌లాగా ఉండే క్లైమాక్స్ సినిమా గ్రాఫ్‌ను కొంచెం కిందికి దించాయి.

ఫ్లాష్ బ్యాక్‌లో నిత్యామీనన్ క్యారెక్టర్ జనాలకు షాకిస్తుంది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. తాప్సి దయ్యం పాత్రలో ఆశ్చర్యపరిచేలా నటించింది. నిత్యామీనన్ లాంటి నటిని కూడా డామినేట్ చేసేలా దయ్యం క్యారెక్టర్లో చెలరేగిపోయింది తాప్సి. లారెన్స్ తన టిపికల్ డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు.  విలన్‌ జయప్రకాష్‌తో పాటు కామెడీ రోల్స్‌లో కోవై సరళ, శ్రీమాన్‌, మనోబాల తమ పాత్రలకు న్యాయం చేశారు.

నలుగురు సంగీత దర్శకులు కలిసి అందించిన సంగీతం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మరీ లౌడ్‌గా అనిపిస్తుంది. కెమెరా యాంగిల్స్‌ కొన్ని చోట్ల మరీ టూమచ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో కొన్నిచోట్ల వేగం ఎక్కువైైంది. కొన్ని చోట్ల లాగ్ పెరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే ముందే చెప్పినట్టు ఈ చిత్రాన్ని మెచ్చే ప్రేక్షకులకి అలాంటి అంశాల గురించిన చింత ఉండదు. వారు ఎంటర్‌టైన్‌ అయినంత సేపు సినిమా క్వాలిటీ ఎంత, ఖర్చెంత, లొకేషన్స్‌ ఏంటి వగైరా వాటి గురించి అస్సలు ఆలోచించరు.  కాంచన మాదిరిగానే ‘గంగ’ కూడా బాక్సాఫీస్‌ని ఒక ఊపు ఊపేసి పోతుందనిపిస్తుంది. సెకండాఫ్‌ని సరిగ్గా హ్యాండిల్‌ చేసినట్టయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌కి సంచనలాలకి తెర తీసి ఉండేది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.