నాగ్ దర్శకుడు కనిపించుట లేదు!
on Apr 14, 2015
అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ మొదలెట్టి దర్శకుడిగా టర్నింగ్ ఇచ్చుకున్న వీరభద్రం చౌదరి ఏమయ్యాడు? అహనాపెళ్లంటతో దర్శకుడిగా అవతార మెత్తిన వీరభద్రం పూలరంగడుతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. రెండు సినిమాలు వరుసగా హిట్టవడంతో స్టార్ హీరోలంతా వీబీకి డేట్స్ ఇచ్చేందుకు మొగ్గుచూపారు. సాధారణంగా కొత్త దర్శకులని ప్రోత్సహించే నాగార్జున నేనున్నాను భాయ్ అన్నాడు. దీంతో ఒక్కసారిగా వీరభద్రం ఎక్కడికో వెళ్లిపోతాడని అంతా ఊహించారు. అదే సమయంలో అల్ల అర్జున్, గోపీచంద్, అల్లరి నరేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక వరుస చిత్రాలతో బిజీగా ఉంటాడనుకున్నారంతా. కానీ భాయ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. పైగా వీబి సినిమాలో నటించి తప్పుచేశా అని నాగ్ ప్రకటించాడు. దీంతో అప్పటివరకూ షేక్ హ్యాండ్ ఇచ్చినవారంతా హ్యాండిచ్చేశారు. ఆ దెబ్బనుంచి ఇంకా కోలుకోని వీరభద్రం ఇదిగో అదిగో అంటున్నాడే కానీ.... సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే రోజే దగ్గర్లో కనిపించడం లేదు. ఇండస్ట్రీ అన్నాక ఆటుపోట్లు సహజం. వీరభద్రం మరో ప్రయత్నం ఎంత తొందరగా చేస్తే అంత మంచిదనే సలహాఇస్తున్నారంతా.