లైట్ తీసుకున్న సమ్మూ
on Apr 15, 2015
ఎంత పొగిడినా పొంగిపోయే తారలు ఒక్క విమర్శను కూడా తట్టుకోలేరు. అలాంటిది..క్యూట్ గాళ్ సమంత నెగిటివ్ కామెంట్స్ ను కూడా లైట్ తీసుకుందట. పైగా ఓ ఝలక్ కూడా ఇచ్చిందట. సహజంగా నోటి దురుసు చూపించే అలీ సన్నాఫ్ సత్యమూర్తి ఆడియోలో సమంత నడుముపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కదా! బ్యూటీ నడుము బెజవాడ బెంజిసర్కిల్ లా ఉందంటూ హాట్ హాట్ సెటైర్స్ వేశాడు. అప్పటినుండి అలీపై సమ్మూ రుసరుసలాడుతోందని తెగ హడావుడి చేసేశారు. కానీ అంతసీన్ లేదంటోంది. పైగా అలీ తనకు ఫ్రెండ్ అని....ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశాడో తనకు తెలుసని అమ్మాయిగారు సెలవిచ్చారు. మరో అడుగు ముందుకేసి.....తన నెక్ట్స్ మూవీలోనూ అలీ ఉండాలందట. దీంతో సమ్మూ సూపర్ అంటూనే.....నిప్పులేకుండానే పొగ సృష్టించిన వాళ్లంతా సైలెంటయ్యారట.