టాప్ హీరోకి 'సన్' స్ట్రోక్
on May 23, 2016
అతనో అగ్ర కథానాయకుడు. ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు దాటింది. హీరోగా అందుకోని విజయాల్లేవు.. చేయని ప్రయోగాల్లేవు. కొత్త కథలకు, కొత్తతరం దర్శకులకు ఆయనే కేరాఫ్ అడ్రస్స్! ఇప్పటికీ... అదే జోష్ కనబడుతోంది. ఆయన వారసుడు కూడా సినిమాల్లో స్ట్రాంగ్ గానే పాతుకుపోయాడు. హీరోగా సెటిల్ అయ్యాడు. హిట్లూ కొట్టాడు... అలాంటి తనయుడ్ని చూసి ఏ తండ్రయినా పొంగిపోవాలి. కానీ.. ఇక్కడ అదేం జరడగం లేదు. కొడుకు ఎడమొహమైతే, తండ్రి పెడమొహం. ఇద్దరి మధ్య మాటల్లేవు. తనయుడికి పెళ్లీడు వచ్చింది. సంబంధాలూ వెదుకుతున్నారు. కానీ కొడుకు మాత్రం `నేను నువ్వు చూసిన పిల్లని పెళ్లి చేసుకోను` అని ఖరాఖండీగా చెప్పేశాడు. అక్కడితో ఆగాడా, అదీ లేదు... సినిమా ఇండ్రస్ట్రీలోనే ఓ అమ్మాయిని ప్రేమించి `తననే పెళ్లి చేసుకొంటా` అంటూ మనసులో మాట చెప్పేశాడు. దాంతో ఆ తండ్రి హృదయం బద్దలైంది. కొడుక్కి ఎంత సర్దిచెప్పినా.. తన నిర్ణయాన్ని మార్చుకొనేలా కనిపించడం లేదు. పోనీ లవ్ మ్యారేజీకి ఒప్పుకొందామా అంటే ఆ అమ్మాయి గతం భయపెడుతోంది. గతంలో ఆ హీరోయిన్ ఓ హీరోని ఇలానే ప్రేమించింది.. మధ్యలో వదిలేసి వచ్చేసింది. ఇప్పుడు ఓ దర్శకుడితో చాలా సన్నిహితంగా ఉంటోందని టాక్. ఇప్పుడు ఈ హీరోని తగులుకొంది. అలాంటి అమ్మాయికి చూసి చూసి ఎలా కట్టబెట్టాలో అర్థం కాక.. పాపం ఆ పెద్దాయన తల పట్టుకొంటున్నాడు. నో చెప్పినా, యస్ చెప్పినా కొడుకు చేయాల్సింది చేస్తాడు. కాబట్టి.. ఏమీ చేయలేని పరిస్థితి. వడ దెబ్బ ఎండాకాలంలోనే తగులుతుంది. ఇలాంటి కొడుకులుంటే ఆ తండ్రికి ఏ కాలంలోనైనా సన్‌స్ట్రోక్ తప్పదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
