శ్రద్ధాకపూర్ సైడ్ బిజినెస్?
on Mar 31, 2015
నిన్నగాక మొన్నొచ్చింది....అప్పుడే సైడ్ బిజినెస్ మొదలెట్టేసింది. అప్పుడే అంత అవసరమా అంటే..ఏం చేస్తాం కాలంమీదున్నప్పుడే కాస్త సంపాదించుకోవాలి అందట. అక్కడితో ఆగక... ఏ హీరోయిన్ అయినా చివరికి ఈ రూట్లోకి రావాల్సిందే కదా అని చెప్పిందట. శ్రద్ధాకపూర్ మాట విని బీటౌన్ జనాలకు నోట మాట రాలేదట. అప్పుడే ఇంత ముదిరిపోయావా అంటే అయ్యో మీరు ఎక్కడికో వెళ్లిపోకండి...ఫ్యాషన్ డిజైనర్ అవతారమెత్తానంతే అని క్లారిటీ ఇచ్చిందట. పైగా అప్పుడే తాను డిజైన్ చేసిన దుస్తులను ఓ వెబ్ సైట్లో కూడా అమ్మకానికి కూడా పెట్టేసిందట. దీంతో శ్రద్ధ చాలా ఫాస్ట్ గురూ అంటున్నారంతా. అయినా హీరోయిన్స్ అంతా కెరీర్ క్లోజ్ అయ్యాక ఏం చేయాలో అర్థంకాక వ్యాపారం మొదలెట్టారు. కానీ శ్రద్ధకు చాలా ముందు చూపున్నట్టుందే అని పొగిడేస్తున్నారు. సైడ్ బిజినెస్ చేస్తే చేశావ్ కానీ అసలు బిజినెస్ లో లాస్ రాకుండా చూసుకోమ్మా అని సలహా ఇస్తున్నారంతా. ఓ వైపు నటనలోనూ, మరోవైపు బిజినెస్ లోనూ పోటీగా దిగిన శ్రద్ధా ఎన్నాళ్లు బండి లాగిస్తుందో వెయిట్ అండ్ సీ.