రాశి మాట తప్పిందా?
on Mar 31, 2015
ఆపర్లు రానంతసేపూ దేనికైనా రెఢీ అంటూ ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇస్తారు. తీరా ఒక్క హిట్ పడితే చాలు మేటర్ మొత్తం మార్చేస్తారు. హే..నేనలా అన్నానా? ఇలా అన్నానా? అదే లేదే...అలా ఏం చెప్పలేదే? అంటారు.జిల్ మనిపించిన రాశి కన్నా ఇచ్చిన ఝలక్ ఇది. ఊహలుగుసగుసలాడే హిట్టైంది పైగా పిల్ల కూడా పావుబాజీలా బావుందని అఖిల్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగారట. వావ్ సూపర్బ్ ఛాన్స్...నేనెందుకు వదులుకుంటా అని ఎగరి గంతేసి మరీ ఓకే అనేసింది. కట్ చేస్తే గోపీచంద్ తో జిల్ లో రెచ్చిపోయింది. ట్రైలర్ లో చూసి వావ్ అనుకున్న కొందరు దర్శకనిర్మాతలు ఛాన్సిస్తాం అని ఫాలో అయ్యారట. ఇంకేముంది...స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అని ఫిక్సైపోయింది. పైగా జిల్ బాగానే ఉందనే టాక్ రావడంతో... ఆపర్స్ ఇస్తాం అని వచ్చిన వారితో కండిషన్స్ అప్లై అని బోర్డు పెట్టేసింది. ఈ గోలంతా సరే మరి అఖిల్ తో ఐటెం సాంగ్ సంగతేంటని అడిగితే నేనా ఐటం సాంగా? అని సంతూర్ మమ్మీ లా రివర్స్ క్వశ్చన్ చేసిందట. దీంతో రాశీ రూటు,మాట రెండూ మార్చిందే అని డిస్కస్ చేసుకుంటున్నారు. అయినా అఖిల్ కి ఐటెం పిల్లే దొరకదా ఏంటి?