రామ్ చరణ్ త్రివిక్రమ్ మధ్యలో పవన్ !!
on Oct 29, 2015
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ప్రస్తుతం ఓ హిట్ ఎంతో అవసరం. గత రెండు సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ఆశించిన రెంజులో ఆడలేక చతికలబడ్డాయి. దీంతో రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడు. తనకి అర్జెంట్ గా హిట్ ఇచ్చే దర్శకుడి కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. అందుల్లో వినిపిస్తున్న మొదటి వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్. మెగా క్యాంప్ లో అందరి సినిమాలకు ఎంతో కొంత పని చేసాడు. అందుకే రామ్ చరణ్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని పట్టుబట్టి మరి వెళ్ళి బాబాయికి ఈ విషయం చెప్పాడట. త్రివిక్రమ్ తన స్నేహితుడే కావడంతో పవన్ కూడా వెంటనే ఓకే చెప్పి ..త్రివిక్రమ్ని ఒప్పించాడట. పైగా ఈ సినిమా కోసం పవన్ తను బ్యానర్ నే ఎంచుకున్నాడట. పవన్ నిర్మాత కావడంతో త్రివిక్రమ్ కూడా మాట ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నితిన్ సినిమాతో బిజీగా వున్న త్రివిక్రమ్ ..నెక్స్ట్ చరణ్ సినిమాపై ఫోకస్ చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.