పూరి.. కూలమ్మా.. కూల్..
on Sep 30, 2015
ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవిపై పూరి జగన్నాథ్ అలిగిన విషయం తెలిసిందే. కథ నచ్చలేదన్న సంగతి నాకు చెప్పొచ్చుగా, చెబితే మార్పులు చేసుండేవాడ్ని కదా - అంటూ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్కయ్యాయి. పూరి చిరుపై అలిగాడని, తన అసహనాన్ని... మీడియా ముందు కావాలనే వెళ్లగక్కాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరి వ్యాఖ్యలు చిరంజీవికీ ఇబ్బంది కలిగించాయని టాక్. అందుకే.. పూరిని కూల్ చేయడానికి రామ్‌చరణ్ ని రంగంలోకి దింపాడట.
పూరికి బర్త్‌డే విషెష్ చెప్పడానికి చరణ్ స్వయంగా పూరి దగ్గరకు వెళ్లాడని, మాటల మధ్యలో పూరి కామెంట్ల గురించి ప్రస్తావించాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. డాడీ తో సినిమా చేసే దర్శకుల రేసులో ఇంకా నువ్వే ఉన్నావ్.. అలాంటప్పుడు ఇలాంటి కామెంట్లు చేయడం మంచిది కాదు అంటూ పూరిని సముదాయిస్తూనే కాస్త వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేశాడని వినికిడి.
మొత్తానికి పూరి కామెంట్లు గట్టిగానే ప్రభావితం చేశాయి. ''తప్పులుంటే సరిద్దుకొంటా'' అని పూరి ఇచ్చిన హింట్ మెగా కాంపౌండ్‌కి చేరింది. ''కథలో మార్పులు చేసుకురా..'' అంటూ చిరు నుంచి సంకేతం వెళ్లడమే ఆలస్యం. మరి చిరు తనకు తాను ఎప్పుడు స్పందిస్తాడో మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
