చరణ్‌కి లెక్కలు రావా?
on Sep 30, 2015
చిరంజీవి 150వ సినిమా బ్రూస్లీనే అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే.... మగధీర చిరు నటించిన 149వ చిత్రం. ఆ తరవాత చేస్తున్న సినిమా బ్రూస్లీ కాబట్టి.. చిరు 150వ సినిమా అదే అవుతుంది. అయితే.. రామ్‌చరణ్ మాటలు మాత్రం వేరేలా ఉన్నాయి. డాడీ నటించే 150వ చిత్రానికి ఇదో టీజర్‌లాంటిదేనని ఈమధ్య వ్యాఖ్యానించాడు. అంటే.. బ్రూస్లీని లెక్కలోనికి తీసుకోకూడదా?? బ్రూస్లీలో చిరు మూడు నిమిషాల పాత్రలో కనిపిస్తారని, చిరుపై తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ సీన్ ఈ చిత్రానికి కీలకమని, కథలో చిరు రాక ప్రధాన మలుపులకు కారణమవుతుందని... చిరు పాత్ర కోసం బోల్డన్ని బిల్డప్పులిచ్చేస్తోంది చిత్రబృందం.
మగధీరలో మెగాస్టార్ కనిపించాడు. అయితే అది అభిమానుల కోసం యాడ్ చేసిన పాత్ర మాత్రమే. దానికి మించి చిరు ఆ సినిమాలో చేసిందేం లేదు. అలాంటప్పుడు మగధీరని కౌంట్ చేసి, బ్రూస్లీలో చిరు పాత్రని లెక్కల్లోంచి ఎందుకు తీసేస్తున్నాడో మరి! చిరు నటించే 150వ సినిమా క్రేజ్ ఇటు బ్రూస్లీకీ, అటు చిరు నటించే తదుపరి చిత్రానికీ తీసుకురావాలన్నది చరణ్ తాపత్రయం కావొచ్చు. చిరు నటిస్తున్న 150వ సినిమా బ్రూస్లీనే కాబట్టి.. అభిమానులు ఈ సినిమాని వెరీ వెరీ స్పెషల్ చేస్తారు. మరోవైపు చిరు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చే సినిమాకీ ఇంతే హడావుడి సృష్టించాలన్నది చరణ్ ప్రయత్నం. అందుకే ఇలా... బ్రూస్లీని 149వ సినిమాగానే లెక్క వేస్తున్నాడు. చరణ్ మామూలోడు కాదు.