అక్కినేని అఖిల్ తో కరణ్ జోహార్ పాన్ ఇండియా ఫిల్మ్
on Mar 8, 2022

తాను హీరోగా నటించిన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో మొదటి విజయాన్ని అందుకున్నాడు అక్కినేని అఖిల్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అఖిల్ ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫర్ దక్కించుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
'బాహుబలి' సమయం నుంచి టాలీవుడ్ కి, బాలీవుడ్ కి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నాడు కరణ్ జోహార్. ఇక్కడి సినిమాలను హిందీలో, హిందీ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ తో ఓ పాన్ ఇండియా మూవీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వరుస సినిమాలు నిర్మిస్తున్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. అఖిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఓ బాలీవుడ్ డైరెక్టర్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అదే జరిగితే అఖిల్ గోల్డెన్ ఛాన్స్ పెట్టినట్లే అని చెప్పొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



