మాస్ ఇమేజీ కావాలా నాయనా..
on Mar 30, 2015
ఈ యంగ్ హీరోలున్నారే.. అస్సలు మారరు. ఒకట్రెండు సినిమాలు చేస్తారో లేదో... అర్జెంటుగా మాస్ ఇమేజీ తెచ్చేసుకోవాలని, లేదంటే నిద్రపోయేది లేదన్నట్టు భీష్మించుకొని కూర్చుంటారు. కొన్నాళ్లు లవర్ బోయ్ పాత్రలు చేయండ్రా అంటే వినరే. నితిన్, నాగచైతన్యలకు ప్రేమకథలు చక్కగా సూటవుతాయి. కానీ.. మాస్ కథలంటూ ఎగబడి కొన్ని ఫ్లాపులను కోరి తెచ్చుకొన్నారు. ఇప్పుడు నాగశౌర్య కూడా మాస్ మాస్ అంటూ మాస్ మంత్రం జపిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలతో పక్కింటబ్బాయి పాత్రలో కనిపించాడు. రెండు సినిమాలకే లవర్‌బోయ్ పాత్రలు బోర్ కొట్టేసినట్టు ఇక మాస్ పాత్రల్లోకి దూరిపోదామనుకొంటున్నాడు. నాగశౌర్య తాజా చిత్రం జాదూగాడు మాస్ కథే. ఈ సినిమాలో కుర్రాడు ఫైట్లు, ఫీట్లు కూడా చేశాడట. రవితేజ లెవిల్లో డైలాగులు చెప్పేశాడట. ఓటు హక్కు నిన్నో మొన్నో వచ్చినట్టుండే నాగశౌర్య నోటి నుంచి ఊర మాస్ డైలాగులు వినగలమా అన్నదే పెద్ద డౌటు. ఈ సినిమా హిట్టయితే ఫర్వాలేదు... అదే బాల్చీ తన్నేస్తే అటు ప్రేమకథలకూ నాగశౌర్య దూరమయ్యే ప్రమాదముంది. కాస్త చూస్కో నాయినా..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
