చిరుని టెన్షన్ పెడుతున్న చరణ్
on Oct 28, 2015
ఈ మధ్య రామ్‌చరణ్ వ్యవహార శైలి చిరంజీవికి బొత్తిగా నచ్చడం లేదని, ఈ విషయంలో చరణ్‌పైచిరు చాలాసార్లు ఫైర్ అయ్యాడన్నది ఇన్ సైడ్ టాక్. బ్రూస్లీ విషయంలో రామ్‌చరణ్ తీసుకొన్న కొన్ని నిర్ణయాల పట్ల.. చిరు పూర్తిగా అసంతృప్తితో ఉన్నాడట. అంతేకాదు... తని ఒరువన్ రీమేక్ రైట్స్ కొనడం కూడా చిరుకి నచ్చలేదట. ఈ రీమేక్ రైట్స్ కోసం చరణ్ సొంత డబ్బులు పెట్టుబడిపై పెట్టడంతో చిరు ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది.
తని ఒరువన్ రీమేక్ రైట్స్ కోసం దాదాపుగా రూ.5 కోట్లు చేతి నుంచి చదివించుకొన్నాడట చరణ్. రీమేక్ కోసం అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేయాలన్నది చిరు పాయింట్. అంతగా రీమేక్ చేయాలంటే ఎవరో ఓ నిర్మాతను పట్టుకొని, తన చేత కొనిపించుకోవచ్చుగా అన్నాడట. ఈ విషయంలో ఇప్పటికీ చిరు, చరణ్‌ల మధ్య సీరియస్ గా చర్చ సాగుతూనే ఉందట. సురేందర్ రెడ్డిని దర్శకుడి గా ఎంచుకోవడం పట్ల చిరు కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నాడని టాక్. పైగా చరణ్ ఇప్పుడు పవన్ బాబాయ్ మంత్రం జపిస్తున్నాడు.
చరణ్ కోసమే.. పవన్ తో చిరు ఈ మాత్రం సఖ్యంగా ఉంటున్నాడని... లేదంటే మెగా బ్రదర్స్ మధ్య ఈమాత్రం రాజీ కూడా కుదిరేది కాదని టాక్. మొత్తానికి చరణ్ వ్యవహారాలు చిరుకి కాస్త తలనొప్సిగానే అనిపిస్తోంది. కానీ.. ఏం చేస్తాడు?? చరణ్ కి దూకుడెక్కువ. చిరుకి ఆలోచన ఎక్కువ. రెంటికీ పొంతన కుదరడం లేదంతే!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
