'బ్రూస్ లీ' పంచ్ బయ్యర్లకు పడింది..!!
on Oct 27, 2015
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'బ్రూస్ లీ' మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి మెగా ఎంట్రన్స్, శ్రీనువైట్ల, కోన వెంకట్ కాంబినేషన్ లో సినిమా కావడంతో బయ్యర్లు ఈ సినిమాని వెంటపడి మరి దక్కించుకున్నారు. మెగా రికార్డులను నెలకొల్పుతుందని అందరూ అనుకుంటే..రిలీజ్ తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
బాక్స్ ఆఫీస్ వద్ద మెగా బ్రూస్ లీ పంచ్ లకి కాసుల వర్షం కురుస్తుంది అనుకుంటే..ఆ పంచ్ లు రివర్స్ లో బయ్యర్లకు తగిలి ఎలా తట్టుకోవాలో తెలియక గింగిరాలు తీరుగుతున్నారు. బ్రూస్ లీ థియేట్రికల్ రైట్స్ ని అక్షరాలా 56 కోట్లకు విక్రయించారు. ఇప్పటికి ఈ మూవీ రిలీజై 10 రోజులైంది.
ఇప్పటి వరకూ ఈ సినిమా మొత్తం కలెక్ట్ చేసినది షేర్ 38.29 కోట్ల రూపాయలు. అంటే ఇంకా 18 కోట్లు రాబట్టాలి. చివరి మూడు రోజుల్లో బ్రూస్ లీ వచ్చింది మూడు కోట్లే. అంటే మహా అంటే ఇంకో మూడుతో బ్రూస్ లీ దుకాణం మూసుకోవచ్చు అనమాట. దసరా హాలిడేస్ కావడంతో బ్రూస్ లీ ఈ మాత్రం నెట్టుకొచ్చేశాడు. లేదంటే బ్రూస్ లీ పంచ్ లకు బయ్యర్లకు దిమ్మతిరిగేదని ఇండస్ట్రీ వర్గాల టాక్.