బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ మహేష్ పై పడింది..!
on May 24, 2016
ఒక భారీ సినిమా డిజాస్టర్ అయితే, ఆ ప్రభావం ఎంత మంది మీద పడుతుందో చూపించడానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది బ్రహ్మోత్సవం. ఇప్పటికే ప్రొడ్యూసర్ సినిమా నిర్మాణరంగం నుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తుండగా, శ్రీకాంత్ అడ్డాల కెరీర్లో తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. తాజాగా ఈ ఎఫెక్ట్ మహేష్ తర్వాతి ప్రాజెక్ట్ పైనా పడటం విచిత్రం. నిజానికి మురుగదాస్ మహేష్ కాంబోలోని భారీ యాక్షన్ సినిమాగా 100 కోట్ల ప్రాజెక్ట్ లా తెరకెక్కిద్దామనుకున్నారు. అయితే తన లేటెస్ట్ సినిమా ఇచ్చిన షాక్ కు, సినిమా బడ్జెట్ ను సగానికి సగం తగ్గించేసి కేవలం 50 కోట్ల ప్రాజెక్ట్ గా తెరకెక్కించమని క్లియర్ గా చెప్పేశాడట మహేష్. అంతేకాక, ద్విభాషా చిత్రంగా ముందు నుంచీ అనుకుంటున్నా, ఇప్పుడు కేవలం తెలుగు లోనే తెరకెక్కించాలనుకుంటున్నారని సమాచారం. సినిమా ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకుంటే, ఆ తర్వాత డబ్ చేసి తమిళంలో రిలీజ్ చేద్దామని మహేష్ అనుకుంటున్నాడట. బ్రహ్మోత్సవం విషయానికొస్తే డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టిన దాంట్లో 50 శాతం కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సినిమాను తమిళంలో రిలీజ్ చేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానమే.