చైతూతో ఆ సినిమా రీమేక్..నిజమేనా..?
on May 23, 2016
ముప్ఫైయేళ్ల నాగార్జున కెరీర్లో మరిచిపోలేని సినిమాల్లో ఒకటి నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా తర్వాత నాగ్ కున్న రొమాంటిక్ ఇమేజ్ డబుల్ అయింది. ఫ్యామిలీ సినిమాగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను ఎలా తెరకెక్కించాలో చూపించిన క్లాసిక్. అయితే తాజాగా ఈ సినిమాను నాగచైతన్య రీమేక్ చేయబోతున్నాడంటూ వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని కూడా కృష్ణవంశీయే తెరకెక్కిస్తారని, హీరోయిన్ గా సమంతను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో పక్కన పెడితే, చైతూకు మాత్రం ఇలాంటి క్లాస్ కథలే బెస్ట్ అని చెప్పాలి. మాస్ యాంగిల్ లో తను చేసిన ప్రతీ సినిమా భారీ గా దెబ్బకొట్టింది. కెరీర్లో ఉన్న కొన్ని హిట్లూ చైతూకు క్లాస్ సినిమాలు ఇచ్చినవే. అందుకే ఇలా తండ్రి దారిలో తనను జనం ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నెక్స్ట్ రాబోతున్న ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు కూడా పూర్తి క్లాస్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్లే కావడం విశేషం. అయితే నిన్నే పెళ్లాడతా సినిమా మంచి క్లాసిక్ గా నిలిచిపోయింది. అలాంటి సినిమాను రీమేక్ చేయడం అవసరమా అంటూ భయపడుతున్నారు అభిమానులు.