బాహుబలి టీంలో కొత్త హీరోయిన్
on Jun 24, 2014
బాహుబలి చిత్రం షూటింగ్ కొంత విరామం తర్వాత మరలా ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సారి షూటింగ్ సన్నివేశాలలో తమన్న పాల్గొంటోంది. హిందీలో ఆమె నటించిన హమ్‌షకల్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నేరుగా హైదరాబాద్ చేరుకున్న తమన్న బాహుబలి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ చిత్రంలో ఆమె పేరు అవంతిక అని తెలుస్తోంది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన రిహార్సల్ కార్యక్రమాలు మొదలయ్యాయని దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఈ చిత్రంలో తొలిసారి వైవిధ్యమైన తరహా పాత్రలో నటిస్తున్నందుకు తమన్నా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన వేషధారణ తమన్నాకు తెగనచ్చేసిందట. ఆమె ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలిలో ప్రభాస్ డ్యుయల్ రోల్స్ చేస్తుండగా, అందులో ఒక పాత్రకు తమన్న నాయికగా నటిస్తోంది.