కాజల్ కన్ఫర్మ్ అయ్యింది!
on Jul 23, 2016
బాలీవుడ్ మొదలుకొని కోలీవుడ్, సాండల్ వుడ్ ఇలా అన్నీ వుడ్ లు పరిశీలించిన తర్వాత చివరాఖరికి మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ ను ఫైనల్ చేశారట. మెగా 150వ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో చోటు చేసుకొన్న సందిగ్ధానికి దాదాపుగా తెరపడినట్లేనని తెలుస్తోంది. అనుష్క, నయనతార, నర్గీస్ ఫక్రి, జాక్వాలిన్ వంటి భామ పేర్లు వినిపించినప్పటికీ.. చివరాఖరికి చిరంజీవి అభీష్టం మేరకు కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది. నిన్న ఢిల్లీ వెళ్లబోయే ముందు కాజల్ అగర్వాల్ ను మెగాస్టార్ కలిశాడని టాక్.
ఇకపోతే.. రామ్ చరణ్ తో మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో ఒక సినిమా, పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాలో నటించిన కాజల్ ఇప్పుడు మెగాస్టార్ తోనూ నటించే అవకాశం సొంతం చేసుకోవడంతో కాజల్ ఇప్పుడు కంప్లీట్ మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. అయితే.. మెగా 150వ చిత్రానికి నిర్మాత అయిన రామ్ చరణ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది!