సల్మాన్ ఖాన్ షూటింగ్ క్యాన్సిల్!
on Jul 23, 2016
"సుల్తాన్" సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సల్మాన్ ఖాన్ తనకు భజరంగీ భాయిజాన్ లాంటి మరో సూపర్ హిట్ ను ఇచ్చిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో "ట్యూబ్ లైట్" అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సరసన కత్రినా నటించాల్సి ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో జరిగిన మార్పుల పుణ్యమా అని కత్రినా ప్లేస్ లోకి జాక్వలిన్ వచ్చి చేరింది.
ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ను తొలుత కాశ్మీర్ లో ప్లాన్ చేశారు. అయితే.. తన మునుపటి చిత్రం "భజరంగీ భాయిజాన్"లో పాకిస్థాన్ ను కించపరిచేలా సన్నివేశాలు తెరకెక్కించిన కబీర్ ఖాన్ పై మొన్నామధ్య కొంతమంది దుండగులు ఎయిర్ పోర్ట్ లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు షూటింగ్ నిర్వహించినా అదే తరహా సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని గ్రహించిన చిత్ర యూనిట్ పాకిస్థాన్ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం అందుతోంది!