Home » ఈపేజీ మీకోసం » ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా!Facebook Twitter Google
ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా!

 

ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా!

 

 

పుర్రెకో బుద్ధి అంటుంటారు పెద్దలు. ఆ మాట ప్రతి రంగానికీ వర్తిస్తుంది. కొందరు రచయితలు శ్రద్ధగా, బుద్ధిగా పుస్తకాలు రాస్తారు. తను రాసిన పుస్తకానికి ఓ ప్రయోజనం ఉండాలనీ, పది మందికీ ఉపయోగపడాలనీ అనుకుంటారు. మరికొందరు ఉంటారు! పుస్తకం రాయాలన్న తపనేకానీ, అది నవ్వులపాలవుతుందేమో అన్న ఆలోచన ఉండదు. అలా చరిత్రలో మిగిలిపోయిన కొన్ని చిత్రమైన పుస్తకాలు ఇవిగో...

Crafting with Cat Hair – పాశ్చత్యదేశాలలో పిల్లుల్ని పెంచుకునే అలవాటు ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే వాటి నుంచి విడిపోయే వెంట్రుకలు ఇల్లంతా చిందరవందరగా పడుతుందటాయి. అవి ఊపిరితిత్తులలోకి చేరితే ప్రమాదం అని కూడా వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ Kaori Tsutaya అనే రచయిత్రికి ఈ వెంట్రుకలతో అందమైన బొమ్మలు ఎందుకు చేసుకోకూడదు అనిపించిందట. ఇంట్లో పడ్డ పిల్లి బొచ్చుని సేకరించి, దాంతో అందమైన కుచ్చు బొమ్మలు చేయవచ్చంటూ ఏకంగా ఒక పుస్తకమే రాశారు.

TEACH YOUR WIFE TO BE A WIDOW – తను పోయిన తర్వాత భార్య ఈ లోకంలో ఎలా నెట్టుకొస్తుందో అన్న అనుమానం ఎవరికైనా కలగక మానదు. కాకపోతే ఏకంగా ‘నేను పోయాక నువ్వు ఏం చేయాలంటే...’ అంటూ ఆమెకి క్లాస్ పీకితే అసలుకే మోసం రాక మానదు. కానీ డొనాల్డ్ రోజర్స్ అనే రచయిత 1953లోనే భార్యలకి ఇలాంటి క్లాసులు పీకడం ఎలా? అనే విషయం మీద ఓ పుస్తకాన్ని రాశారు.

Bombproof Your Horse – గుర్రపు స్వారీ గురించి పుస్తకాలు చూశాం, వాటి పెంపకం గురించి పుస్తకాలు చూశాం. కానీ గుర్రాలు ఎలాంటి ప్రమాదాన్నయినా తట్టుకునేలా తర్ఫీదు ఇవ్వడం ఎలా? దెబ్బల్ని ఓర్చుకోవడం, గాయాలని తట్టుకోవడం ఎలాగో గుర్రాలకు అలవాటు చేయడం ఎలా? లాంటి వివరాలతో ఈ పుస్తకం నిండిపోయి ఉంది.

How to Poo on a Date – ఓ ప్రేమజంట అలా సరదాగా షికారుకని బయల్దేరారు. ఇంతలో ఆ ప్రియుడికి అకస్మాత్తుగా బాత్రూంకి వెళ్లాల్సిన పని పడింది. ఆ విషయం బయటకి చెప్పాలంటే నామోషి, దాచుకునేందుకు అసాధ్యం! తరతరాలుగా యుగయుగాలుగా ఈ కష్టాన్ని అనుభవించాల్సిందేనా? అంటూ ఓ ఇద్దరు రచయితలు కలం కదిపారు. అభాసుపాలుకాకుండా ‘ఆ’ పని ముగించుకోవడం ఎలా? అన్న సమస్య మీద 144 పేజీల పుస్తకం రాశారు.

How to live with an idiot – ఈ లోకంలో చాలామంది మూర్ఖులతో కలిసి జీవించక తప్పదన్నది జాన్ హోవర్ అనే రచయిత అభిప్రాయం. అలాంటివారందరితో ఎలా మెలగాలి అనేందుకు ఆయన ఏకంగా ఈ పుస్తకమే రాశారు. జీవితభాగస్వామి, బంధువు, ఆఫీసరు... ఇలా తప్పించుకోలేని మూర్ఖులతో ఎలా ప్రవర్తించాలో ఈ పుస్తకంలో బోలెడు చిట్కాలు సూచించారు.

చిత్రమైన పుస్తకాల జాబితాలో ఇవి కొన్ని మాత్రమే! నలుగురిలో తల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా తోచే పుస్తకాల పేర్లు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. కావల్సినంతసేపు నవ్వుకోవచ్చు.

- నిర్జర.

 

 


నిజం చెప్పనా
May 31, 2019
జీవితంలో ఏ పోటీ అయినా పరుగు పందెంలా సాగాలి!
Apr 16, 2019
ఆనందీ గోపాల్  జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన  మొట్టమొదటి భారతీయ మహిళావైద్యురాలు..
Mar 30, 2019
మన భారతదేశంలో  శాస్త్రీయ నృత్యాలు... ఎనిమిది రకాలు... అవేమిటంటే.....
Mar 22, 2019
ఫిబ్రవరి 21 వ తేదీ ప్రపంచ మాత్రుభాషాదినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా సాంస్క్రుతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు అవగాహన పొందేందుకు ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా.....
Feb 20, 2019
బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా మా ఇంటికి రావమ్మ మురియెంగా...
Oct 15, 2018
మునిగిన జలమును నీవు కరిగి  పవిత్రముగ జేసి నీ గుర్తుగా...
Sep 19, 2018
ఒక చిన్న కథ. ఓ వ్యాపారవేత్త పనిమీద బయల్దేరతాడు...
Sep 5, 2018
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ లేదు. కాలం ఎంత మారినా కూడా...
Sep 3, 2018
తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని
Feb 12, 2018
TeluguOne For Your Business
About TeluguOne