LATEST NEWS
సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. ఆ పేరు తలుచుకోగానే  ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవ నవోన్మేష చైతన్య స్వరూపం . ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ  రంగంలోనూ అనితరసాధ్యమైన కీర్తి బావుటాను ఎగరేసిన ప్రతిభామూర్తి ఎన్టీఆర్.  వెండితెరపై   అగ్రగామిగా నిలిచిన ఆయన రాజకీయాలలో కూడా తనకు తానే సాటి అని రుజువు చేసుకున్నారు.  నాయకుడిగా, మహానాయకుడిగా, ముఖ్యమంత్రిగా,  ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజా జీవితం సాగింది. పేదవాడి అన్నం గిన్నెగా, ఆడబడుచుల అన్నగా ఆయన ప్రజలలో మమేకమయ్యారు. అసలు అయన రాజకీయ ప్రవేశమే ఒక ప్రభంజనం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకూ రాష్ట్రంలో ఓటమి అనేదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, తిరుగులేని ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సరిగ్గా 42 ఏళ్ల కిందట (1983 జనవరి 9) ఇదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  1983 జనవరి 9 తెలుగు కీర్తిపతాక ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడిన రోజు.  రాజకీయం జనం చెంతకు చేరిన రోజు.   తెలుగువాడి  తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అప్రతిహాత కాంగ్రెస్  అధికార పెత్తనానికి, తెలుగువారిని చిన్న చూపు చూసిన కాంగ్రస్ పాలనకు చరమగీతం పాడిన రోజు. ఔను సరిగ్గా 41 ఏళ్ల కిందట నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు.   పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రజల మనిషి. అందుకే ఆయన రాజభవన్ ఇరుకు గోడల మధ్య కాకుండా, ప్రజా సమక్షంలో  లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రజల సమక్షంలో బహిరంగ మైదానంలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అదే ప్రథమం. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు.  హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంది. అప్పటి గవర్నర్   కె.సి. అబ్రహం   ఏపీలో తొలి కాంగ్రెసేతర  ముఖ్యమంత్రి గా రామారావు  చేత  స్వీకార ప్రమాణ స్వీకారం చేయించారు. అచ్చ తెలుగులో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మకం.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ ప్రజల కోసమే పని చేస్తానని చాటారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. ప్రజాసేవే తన అభిమతమని చాటారు.  అన్నట్లుగానే అవిశ్రాంతంగా  ప్రజాసంక్షేమం కోసమే పాటుపడ్డారు. అప్పటి దాకా అధికారమంటే  విలాసం, పెత్తనం అని భావించిన నేతలకు అధికారం అంటే బాధ్యత అని తెలిసొచ్చేలా చేశారు.  తనను సినీరంగంలో మకుటం లేని మహారాజుగా నిలబెట్టిన క్రమశిక్షణ,క్రమవర్తన,సమయపాలనలను ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనూ కొనసాగించారు.  నిరాడంబరతకు ఆయన నిలువెత్తు రూపు. ముఖ్యమంత్రిగా అత్యంత విలాసవంతమైన భవనంలోకి మారే అవకాశం ఉన్నా, అందుకు ఆయన అంగీకరించలేదు. ఆబిడ్స్ లోని తన నివాసంలోనే ఉన్నారు. సీఎంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు.  ఖరీదైన కార్ల జోలికి పోలేదు. అంబాసిడర్ కారునే ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ వినియోగించారు. ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నో సౌకర్యాలను ఆయన తృణప్రాయంగా వద్దనేశారు.  అయితే ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. కిలో రెండు రూపాయలకే బియ్యం ఆయన ప్రారంభించిన పథకమే. ఇప్పుడు అదే పథకం దేశం మొత్తం ఆచరణలోకి వచ్చింది. బడుగుబలహీన వర్గాలకు పాలనలో, అధకారంలో భాగస్వామ్యం కల్పించిన ఎన్టీఆర్ వల్లే సామాన్యులలో సైతం రాజకీయ చైతన్యం వచ్చింది. ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల సంక్షేమం,  మహిళల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్  అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అందుకే ఎన్టీఆర్ తెలగు కీర్తి, తెలుగుఠీవి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఎప్పటికీ జనం గుండెల్లో కొలువై ఉంటారు. 
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు  సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నేరుగా ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి  తిరుపతి కిమ్స్, రుమా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 38 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు చెరో 25 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం పరామర్శించనున్నట్లు సమాచారం. 
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌, కాలిఫోర్నియా ప్రాంతాలను కార్చిచ్చు కాల్చేస్తున్నది. దక్షిణ కాలిఫో ర్నియాలోని అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు లాస్ ఏంజిల్స్‌ నగరానికి విస్తరించాయి. ఈ దావాలనం నివాస ప్రాంతాలకూ వ్యపించడంతో  ఐదుగురు ఆహుతయ్యారు.  వెయ్యికి పైగా భవంతులు దగ్ధమయ్యాయి.   10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బడబాలనం హాలీవుడ్‌ నటులు, ప్రముఖులు నివాసం ఉండే పసిఫిక్‌ సాలేడ్స్‌నూ చుట్టుముట్టింది.    7500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు.  హెలికాప్టర్ల ద్వారా నీటిని పంప్ చేస్తున్నారు.  అగ్ని ప్రమాదం నేపథ్యంలో లాస్ ఏంజిలిస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డిస్నీ, యూనివర్సల్ స్టూడియోస్‌లో షూటింగ్‌లను రద్దు చేశారు. వేగంగా విస్తరిస్తున్న మంటల కారణంగా  అతి వేగంగా వ్యాపించిన మంటల కారణంగా హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రముఖ నటుడు బిల్లీ క్రిస్టల్ కు చెందిన ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యింది. అలాగే  మాండీ మూర్, పారిస్ హిల్టన్, కేరీ ఎల్వెస్ వంటి ప్రముఖుల నివాసాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి.  భారీ ఆస్తినష్టం వాటిల్లింది. 
టాలీవుడ్ ఒత్తిడికి రేవంత్ సర్కార్ తలొగ్గింది. తాను అధికారంలో ఉన్నంత వరకూ కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ప్రశక్తే ఉండదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చేదే లేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మాట మీద నిలబడటంలో విఫలమయ్యారు. శుక్రవారం (జనవరి 10)న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ సినిమాకు అదనపు షోలు, టికెట్ల ధరల పెంపునకు ఓకే అన్నారు.  గేమ్ ఛేంజర్ సినిమా అదనపు షోలు,  టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ రేవంత్ సర్కార్  బుధవారం (జనవరి 8) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  సినిమా విడుదల అయిన రోజు ఏకంగా ఆరు షో లు...అదనపు రేట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విడుదల తరువాత రోజు నుంచీ అంటే శనివారం (జనవరి 11) నుంచి  తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షో లకు అనుమతి ఇచ్చింది.  సినిమా రిలీజ్ రోజున మల్టీప్లెక్స్ ల్లో 150 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో 100 రూపాయల మేర అదనపు రేట్లకు ఆమోదం తెలిపింది.  మిగిలిన తొమ్మిది రోజుల్లో మల్టీప్లెక్స్ ల్లో వంద రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో ఏభై రూపాయల మేర టికెట్ల ధర పెంచుకునేందుకు ఓకే చెప్పింది.  
ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్  గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల  ఎదుట  విచారణకు హాజరయ్యారు.  ఆర్ బిఐ అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు బదిలీచేసినట్టు అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి కెటీఆర్ సూచనమేరకు తాను నిధులు బదిలీ చేసినట్ట అరవింద్  కుమార్  ఈడీ అధికారుల ఎదుట అంగీకరించారు.  పురపాలకశాఖమంత్రి కెటీఆర్ సూచనమేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో అరవింద్ కుమార్ ఈ నిధులను బదిలీ చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఈ ఐఏఎస్ అధికారి ముఖ్యభూమిక వహించారు. మూడో పర్యాయం కూడా బిఆర్ ఎస్ వస్తుందని కెటీఆర్ తనతో అన్నట్టు అరవింద్ కుమార్ ఈడీ అధికారుల ఎదుట అన్నట్టు తెలుస్తోంది. 
ALSO ON TELUGUONE N E W S
  మూవీ: నీలిమేఘశ్యామ నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ, తనికెళ్ళ భరణి తదితరులు ఎడిటింగ్: బాలాజీ విబీజే సినిమాటోగ్రఫీ: సునీల్ రెడ్డి మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్ నిర్మాతలు: కార్తీక్ సత్య దర్శకత్వం: రవి ఎస్ వర్మ ఓటీటీ: ఆహా కథ: హైదరాబాద్ లో శ్యామ్ అనే అతను ఓ యాడ్ ఏజన్సీ రన్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అయితే శ్యామ్ రాత్రి రెండింటి దాకా తాగడం, పొద్దున్నే పదకొండు అయినా లేవడు.  దాంతో వాళ్ళ నాన్న ఎందుకు పనికిరావు.. కాస్త జ్ఞానం పెంచుకోమంటూ, పైకి ఎదుగూ అంటూ తిడుతుంటాడు. ఇక దానిని సీరియస్ గా తీసుకున్న శ్యామ్ బుద్దునికి జ్ఞానోదయం అయిన హిమాలయాలకి వెళ్తాడు. మనాలికి ట్రెక్కింగ్ వెళ్లిన శ్యామ్ కి కో ట్రెక్కర్ గా మేఘ పరిచయమవుతుంది. ఇక వారిద్దరి పరిచయంలో ఎన్నో మలుపులు తిరుగుతాయి. అయితే ఒకానొక సందర్భంలో శ్యామ్ ని మేఘ ప్రేమిస్తుంది. కానీ ఓ పొరపాటు వల్ల శ్యామ్ ని తిట్టి వచ్చేస్తుంది మేఘ. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? మేఘ, శ్యామ్ ల ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: కథ హైదరాబాద్ లో మొదలైన ఎక్కువ భాగం మనాలిలో జరుగుతుంది. శ్యామ్, మేఘల ప్రేమకథ ఆడియన్స్ కి నచ్చుతుందా అంటే కొంతవరకు ఓకే కొంతవరకు బోరింగ్ అని చెప్పాలి.  కథలో కాస్త కామెడీ ఉంది కానీ అంతగా కనెక్ట్ కాలేదు. మనాలిలోలైనా ఎక్కడైనా ప్రేమకథ కాస్త ఎంగేజింగ్ అండ్ కాస్త థ్రిల్ ఉంటే జనాలు కనెక్ట్ అవుతారు. అయితే ఈ సినిమాలో అలాంటి ఎంగేజింగ్ సీన్లు లేకపోవడం పెద్ద మైనస్‌. కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు‌. సినిమాకి ఒకే ఒక్క ప్లస్ ఏంటంటే నిడివి.. గంటా యాభై నిమిషాలు మాత్రమే. మంచుకొండల్లోని పరిసరాలని సినిమాటోగ్రాఫర్ చక్కగా బంధించిన దానికి సరైన స్టోరీ ఉంటే బాగుండేది. అడల్ట్ సీన్లు లేవు. ఆశ్లీల పదాలు వాడలేదు. చిన్న కథే కానీ స్లోగా సాగుతుంది. అది చాలా వరకు కథని డిస్టబ్ చేసింది. హీరోకి ఓ ఫ్యామిలీ, హీరోయిన్ కి ఓ ఫ్యామిలీ కానీ వారిని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ లో ఇంకొన్ని డైలాగ్స్ రాస్తే బాగుండేది. ప్రేమకథలో డెప్త్ లేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు. పార్ట్ లు పార్ట్ లుగా వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సీన్లలో బిజిఎమ్ ఉంటే బాగుండేది. ముఖ్యంగా మంచుకొండల్లో హీరో , హీరోయిన్ మధ్య రాత్రి చలిమంట కాచుకునే సీన్లో కాస్త ఎలివేట్ చేయొచ్చు. భిన్నమైన కథలని ఇష్టపడేవారికి, స్లోగా సాగే కథలని ఇష్టపడేవారికి ఈ నీలిమేఘశ్యామ నచ్చొచ్చు. హై డోస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూసేవారికి ఇది నచ్చదు. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఒకే. బాలాజీ విబీజే ఎడిటింగ్ పర్వాలేదు. సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: శ్యామ్  పాత్రలో విశ్వదేవ్ రాచకొండ ఒదిగిపోయాడు. మేఘ పాత్రలో పాయల్ రాధాకృష్ణ ఆకట్టుకుంది. శ్యామ్ కి నాన్న పాత్రలో తనికెళ్ళ భరణి నటన బాగుంది‌. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : జస్ట్ వన్ టైమ్ వాచెబుల్.  రేటింగ్: 2.5 / 5 ✍️. దాసరి మల్లేశ్
  మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.221 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.   'గేమ్ ఛేంజర్' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.122 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.43.50 కోట్లు, సీడెడ్ లో రూ.23 కోట్లు, ఆంధ్రాలో రూ.55.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.14.50 కోట్లు, తమిళనాడులో రూ.15 కోట్లు, కేరళలో రూ.2 కోట్లు, హిందీ+రెస్టాఫ్ ఇండియా రూ.42.50 కోట్లు, ఓవర్సీస్ రూ.25 కోట్లు కలిపి.. ఓవరాల్ గా రూ.221 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.221 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. గ్రాస్ పరంగా చూస్తే రూ.450 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.   సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఇదే అత్యధిక బిజినెస్. రూ.90 కోట్లతో 'వినయ విధేయ రామ' ఇప్పటివరకు టాప్ లో ఉంది. చరణ్ నటించిన మల్టీస్టారర్ సినిమాలను గమనిస్తే.. ఆర్ఆర్ఆర్ రూ.450 కోట్లు, ఆచార్య రూ.130 కోట్లు బిజినెస్ చేశాయి.  
సంక్రాంతి పండుగకి సినిమా పండుగ అని కూడా పేరు.అసలు పండుగ రోజున కొత్త సినిమా చూడలేదంటే పండుగ పూర్తి కానట్టే అనే నానుడి కూడా తెలుగు ప్రజల్లో చాలా బలంగా ఉంది.అందుకే బడా హీరోలు,బడా నిర్మాతలు తమ కొత్త సినిమాని సంక్రాంతి పండుగకి తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతుంటారు.అందుకు తగ్గట్టే ఈ సంక్రాంతికి రామ్ చరణ్(Ram Charan)నటించిన గేమ్ చేంజర్(Game Changer)బాలకృష్ణ(Balakrishna)డాకు మహారాజ్(Daku Maharaj)వెంకటేష్(Venkatesth)సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) లాంటి భారీ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.ఈ మూడు సినిమాల సెన్సార్ రిపోర్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. గేమ్ చేంజర్ మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఒక రేంజ్ లో ఉంది.మూవీ మొత్తానికి కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ నే బలం.  ఇంటర్వెల్ బ్యాంగ్ ని చూసీ మెగా ఫ్యాన్స్,ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ముఖ్యంగా సెకండాఫ్ అదిరిపోయింది.యాక్ష‌న్ సీన్స్ అయితే వింటేజ్ శంక‌ర్(Shankar)స్థాయిలో ఉన్నాయి.సాంగ్స్ ద్వారా ప్రేక్షకులకి విజువ‌ల్ ట్రీట్ ఉండబోతుంది.శ్రీ‌కాంత్ క్యారెక్ట‌ర్ కూడా చాలా స‌ర్‌ప్రైజింగ్ గా ఉండబోతుంది.'డాకు మహారాజ్'  లో దర్శకుడు బాబీ(bobby)'డాకూ ఎపిసోడ్  డిజైన్ చేసిన తీరుకి నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారు.పాప పాత్ర‌కు సంబంధించిన ట్విస్టే సినిమాకి కీలకంగా మారబోతుంది.ఆ ట్విస్ట్ ని ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకొంటార‌న్న‌దాన్ని బ‌ట్టి  డాకూ హిట్ రేంజ్ ఆధార‌ప‌డి ఉంటుంది.'ద‌బిడి దిబిడి' సాంగ్ థియేట‌ర్లో మోతమోగిపోనుంది. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని వెంకీ మార్క్ కామెడీతో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil ravipudi)ని డిజైన్ చేసాడు.మూవీలో వచ్చే కామెడి సీన్స్ ని  నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్ తో చూస్తే అభిమానులకి,ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఖాయం.ఫ‌స్టాఫ్ హిలేరియ‌స్‌గా ఉంటూ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది.క్లైమాక్స్ కూడా వెంకీ స్టైల్ ఆఫ్ మాన‌రిజంతో పాస్ అయిపోయింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో ఉంది.అదే ఈ సినిమాకి అందాన్ని ఇచ్చింది.ఈ విధంగా మూడు సినిమాలు కూడా సంక్రాంతి ప్రేక్షకులని అలరించనున్నాయనే సెన్సార్ రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.గేమ్ చేంజర్ 10 న,డాకు మహారాజ్ 12 ,సంక్రాంతికి వస్తున్నాం 14 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.    
Dhanashree Verma, wife of Indian cricketer Yuzvendra Chahal and choreographer, dancer, has reacted amidst divorce rumors. Chahal remained silent about all the speculations but trolls have targeted Dhanashree Verma with several old videos spreading on social media.  Now, she reacted and posted an open note on Instagram story. She wrote, "The past few days have been incredibly tough for my family and me. What's truly upsetting is the baseless writing, devoid of fact- checking, and the character assassination of my reputation by faceless trolls spreading hate."    Dhanashree Verma continued to state, "I've worked hard for years to build my name and integrity. My silence is not a sign of weakness; but of strength. While negativity spreads easily online, it takes courage and compassion to uplift others."    Finally, she stated that she doesn't have to give any justification and she is true to her values. "I choose to focus on my truth and move forward, holding onto my values. The truth stands tall without the need for justification," wrote the choreographer before concluding the note.  After Shikhar Dhawan and Hardik Pandya's divorces, now, Yuzvendra Chahal also going through a separation has got more social media buzz than anticipated. As it is a personal issue between a married couple, it is better to let them go through the emotional turmoil at privacy. 
నాచురల్ స్టార్ నాని(Nani)హీరోగా గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri)దర్శకత్వంలో వచ్చిన 'జెర్సీ' మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన కన్నడ భామ శ్రద్ద శ్రీనాధ్(shraddha Srinath)ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల,జోడి,సైంధవ్ వంటి చిత్రాలతో పాటు, రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'మెకానిక్ రాకీ' లో కూడా నటించింది.ఇప్పుడు బాలకృష్ణ(Balakrishna)అప్ కమింగ్ మూవీ 'డాకు మహారాజ్'(Daku Maharaj)లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ నెల 12 న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా శ్రద్ద శ్రీనాద్ మీడియాతో మాట్లాడుతు బాలయ్య గారి పక్కన నటించడం గొప్ప అనుభవం.సీనియర్ హీరోని అనే  గర్వం ఆయనకి ఏ మాత్రం ఉండదు.సెట్ లో అందర్నీ నవ్విస్తూ  చాలా సరదాగా ఉంటారు.కానీ  డైరెక్టర్ షాట్ ఒకే చెప్పగానే పూర్తి ఏకాగ్రతతో క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేస్తారు.'సర్' అని పిలిస్తే 'బాల'అని పిలవమని అంటారు.ఆ పేరుతో పిలిస్తేనే ఆయనకి ఇష్టం.ఇంత వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు.బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' మరో ఎత్తు. ఎందుకంటే  బాలయ్య గారి సినిమా అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది.కాబట్టి నేను అందరికి మరింతగా తెలిసే అవకాశం ఉంది.దర్శకుడు బాబీ(Bobby)కూడా చాలా బాగా సినిమాని తెరకెక్కించాడు.కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది.నూటికి నూరుశాతం మా డాకు మహారాజ్ ఘన విజయాన్ని అందుకుంటుంది.ఇక ఈ సినిమాని తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థలో దర్శకుడు త్రివిక్రమ్(Trivikram)ఒక భాగమని తెలుసు.జెర్సీ మూవీ టైంలో ఆయన్ని కలిసాను తప్ప మళ్ళీ కలవలేదు.ఈ సారి కలిస్తే  ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాను.ఆయన సినిమాల్లో నటించాలని చాలా బలమైన కోరికని చెప్పుకొచ్చింది.   
  తెలుగు నాట స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ స్టార్ హీరో ఈవెంట్ జరిగినా.. అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో హాజరై, అందరూ ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ల విషయంలో నందమూరి అభిమానులకు మాత్రం వరుసగా నిరాశే ఎదురవుతోంది.   జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన 'దేవర' (Devara) చిత్రం గతేడాది సెప్టెంబర్ లో విడుదలై, భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా, అది చివరి నిమిషంలో రద్దయింది. వేదిక కెపాసిటీకి మించి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. దీంతో అప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఎంతో డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వారికి అలాంటి నిరాశే ఎదురైంది.   నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అనంతపురంలో జనవరి 9 సాయంత్రం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుకకు బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. దీంతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. కానీ తిరుమలలో తొక్కిసలాట జరిగి కొందరు భక్తులు మరణించడంతో.. ఈ సమయంలో సినిమా వేడుక జరపడం కరెక్ట్ కాదని భావించి, వేడుకను రద్దు చేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది.    వరుసగా రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు క్యాన్సిల్ కావడంతో.. నందమూరి ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. 'డాకు మహారాజ్' విడుదలకు ముందు, బాలకృష్ణ ఒక ప్రెస్ మీట్ అయినా నిర్వహిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.  
At Tirumala Tirupathi Vishnu Nivasam complex, an unfortunate stampede has occurred with humungous rush for offline darshan tickets. Many people got hurt in this incident and death toll is being increased as well. Hence, NBK's Daaku Maharaaj team has decided to cancel their pre-release event in Ananthapuram.  Going into the details, Sithara Entertainments, the production house of Daaku Maharaaj, has been slammed for the lack of high promotional activity till date. As the team started promoting it with press interactions and interviews, fans have been eager to see their idol speak at length about Daaku Maharaaj at Ananthapuram.  Now, due to this Tirupathi Stampede, the team has decided to cancel the event. "In light of the recent events in Tirupati, our team is deeply affected by the tragic incident that has occurred. It is heart-wrenching to see such an incident occur at the Lord Venkateswara temple - a place of devotion, hope for millions and a cherished part of our families' traditions. Given the circumstances we feel it is not appropriate to proceed with Daaku Maharaaj Pre Release Event as planned. With a heavy heart and utmost respect for the devotion and sentiments of the people, we have decided to call off today’s event. We hope for your understanding and support during this difficult time," stated the team.  Well, Nandamuri fans are disappointed with this turn around as NTR's Devara event had also been called off in the last moment. So, they are expecting a NBK to hit it big with great word of mouth post release. The trolls on Urvashi Rautela song, did help with social media buzz but they are asking for more on-ground promotions from the producers. Let's see how they will proceed forward. 
  నందమూరి బాలకృష్ణ(Balakrishna)వన్ మాన్ షో 'డాకు మహారాజ్'(Daku Maharaj)సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిరంజీవి(Chiranjeevi)తో వాల్తేరు వీరయ్య ని  తెరకెక్కించి మంచి హిట్ అని అందుకున్న బాబీ(Bobby)ఈ మూవీకి దర్శకుడు కావడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా 'డాకు మహారాజ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal)శ్రద్ధ శ్రీనాధ్(Shraddha Srinath)లు జత కట్టారు.  ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం అనంతపురంలో జరగాల్సి ఉంది.ముఖ్య అతిధిగా ఐటి శాఖా మంత్రి మంగళగిరి ఎంఎల్ఏ నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరు అవుతున్నారని అధికారకంగా ప్రకటించారు.పైగా బాలయ్యకి ఎన్నికల అనంతరం అనంత‌పురంలో నిర్వహిస్తున్న తొలి సినిమా ఈవెంట్‌ కావడంతో మూవీని నిర్మిస్తున్న సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్,ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ లు అనంతపురం లో భారీగా ఏర్పాట్లు కూడా చేసారు.కానీ నిన్న తిరుపతి లో స్వామి వారి దర్శనం చేసుకోవడానికి టోకెన్ల కోసం వేచి ఉన్న భక్తుల మధ్య తొక్కి సలాట జరిగి పది మంది దాకా మరణించడంతో పాటు మరికొంత మంది గాయాలపాలవ్వడంతో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కాన్సిల్ చేస్తున్నట్టు  మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,శంకర్,కాంబోలో  తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ .సంక్రాంతి కానుకగా ఈనెల 10 న విడుదల కాబోతుండగా రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ,అంజలి హీరోయిన్లుగా నటించారు.  చరణ్ కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఈ మూవీకి  దిల్ రాజు నిర్మాత.పైగా దిల్ రాజు కి   50 వ చిత్రం కూడాను.దీంతో  ఎంటైర్ తన కెరిరీలోనే ఫస్ట్ టైం మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో నిర్మించాడు.ఇప్పుడు ఈ మూవీ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.కాకపోతే అర్థ రాత్రి బెనిఫిట్ షో కి మాత్రం అనుమతి ఇవ్వలేదు.పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల  షో నుంచి  6 షోస్ కు  అనుమతి.మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150రూపాయలు పెంపు.సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100రూపాయలు పెంపు.జనవరి 11 నుంచి మాత్రం 5 షోస్ కు అనుమతి.అదే విధంగా  మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు అనుమతి.సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు ఉండేలా ప్రత్యేక జీవో జారీ చేసింది.                                                  ఇక ఈ మూవీకి ఇప్పటికే  టికెట్ రేట్స్ పెంపుకి అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక జీవో జారీచేసిన విషయం తెలిసిందే.కాకపోతే కోర్టు ఉత్తర్వులు ప్రకారం మొదటి పది రోజులు మాత్రమే ధరల ప్రకారం టికెట్ రేట్స్ ఉంటాయి.బెనిఫిట్ షో యధావిధిగా ఒంటి గంటకి ఉండనుంది.
  ఈ మధ్య కాల్యంలో ప్రోగ్రామ్స్ కి హోస్ట్ చేస్తున్న వాళ్ళు చాలా తప్పులు మాట్లాడేస్తున్నారు. కానీ తప్పు జరిగిపోయాక క్షమాపణలు వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు. శ్రీముఖి విషయంలో కూడా జరిగింది. యాంకర్ శ్రీముఖి ఇటీవల హోస్ట్ చేసిన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ ఈవెంట్‌లో రామలక్ష్మణుల పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శ్రీముఖి క్షమాపణలు కోరుతూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. "ఇటీవల నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్‌లో రామలక్షణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేనూ ఒక హిందువునే.. నేను రాముడిని అమితంగా నమ్మేదానిని.  నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకెప్పుడూ ఈ పొరపాట్లు  జరగకుండా  జాగ్రత్త పడతాననని మీ అందరికీ మాట ఇస్తూ, మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్ " అంటూ శ్రీముఖి చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి క్షమాపణలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది శ్రీముఖి తప్పు తెలుసుకోవడం మంచిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఎప్పుడైనా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అంటూ సూచిస్తున్నారు. "ఉద్దేశపూర్వకంగా ఎవరు అనరు..ఏదో  తెలియక అన్నావు అని..చిన్నపిల్ల ఐనా  క్షమాపణ అడుగుతున్నావు... శ్రీముఖి ఇది చాలు.. నువ్వెంటో తెలియటానికి...మీరైనా తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగారు..అందరిలాగా ఇగోకి పోకుండా..జై శ్రీరామ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని,  నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అనే గేయాలను చదువుకుంటూ పెరిగినవాళ్లం. దీనికి తగ్గట్టు కొందరు మాతృదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటారు.  అలాంటి వారిలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద నుండి చాలామంది ప్రముఖులు  ఉన్నారు.  ఈ జాబితాలో ప్రవాస భారతీయుల పాత్ర చాలా ఉంది. ఈ రోజుల్లో పొట్ట కూటి కోసం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు కొందరైతే, తమ చదువుకి, ప్రతిభకి తగిన అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నవాళ్లు కొందరున్నారు. ఉన్నత విద్య అభ్యసించడానికో.. ఉన్నత విద్య ద్వారా వచ్చిన ఉద్యోగ అవకాశాల కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్టే విదేశాలలో భారతీయుల హవా సాగుతోంది.     మన భారతదేశం నుంచి ప్రపంచ నలుమూలలకి వెళ్ళిన మన వాళ్ళు భారతీయతను చాటి చెప్పటానికి మన దేశ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు.  అలాంటి  ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు దేశ అభివృద్ధిలో చేసిన, చేస్తున్న సేవలకి గుర్తింపుగా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే దీనికి ముఖ్యమైన మూలం మహాత్మా గాంధీ..   మహాత్మా గాంధీ విద్యాభ్యాసం కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి  నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజునే ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటున్నారు.   2003 సంవత్సరం నుంచి  ప్రతీ ఏటా జనవరి 9వ తేదీన   ప్రవాస భారతీయుల  దినోత్సవం( ఎన్‌ఆర్‌ఐ డే)  జరుపుకుంటున్నాము. ప్రవాస భారతీయుల దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంటే.. 2025 లో జరగబోయే 18వ ఎన్‌ఆర్‌ఐ డే  ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో జనవరి 8 నుండి 10 వతేదీ వరకు  జరగనుంది. ప్రవాస భారతీయ దినోత్సవం.. మన భారతదేశం  ప్రపంచంలోనే  ఎక్కువ ప్రవాస భారతీయులు ఉన్న దేశంగా పేరుపొందింది. ఈ ప్రవాస భారతీయులు తమ   ఆర్థిక సహకారాలు, పెట్టుబడులు ద్వారా దేశ అభివృద్ధిలో, గ్లోబల్‌గా మన దేశ గుర్తింపుని  పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద కంపెనీల సి‌ఈ‌ఓలు, రాజకీయ నాయకులు ఇలా చాలామంది మన దేశం వారు లేదా మన దేశ మూలాలున్న వారు విదేశాలలో  ఉన్నారు.  అందుకే ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  వ్యాపారం, విద్య, కళలు, శాస్త్రం, సాంకేతికత వంటి రంగాలలో  ప్రవాస భారతీయుల విజయాలను గుర్తించి, ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయంగా  భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. మన దేశంతో వారి సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి,  భారతీయ మూలాలున్న వ్యక్తులు,  భారతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించటానికి ,  అలాగే ఎన్‌ఆర్‌ఐ లను  ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలపై చర్చించటానికి ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  ఒక వేదికగా  నిలుస్తుంది. భవిష్యత్తులో వివిధ రంగాలలో భారతదేశ అభివృద్ధికి వనరులను, నైపుణ్యాలను, సాయాన్ని  సమీకరించడం కోసం ప్రవాస భారతీయుల సహకారం చాలా అవసరం అవుతుంది.  దీనికి గానూ వారు ఎలా సహకరించగలరో చర్చించేందుకు ఒక  ప్రవాస భారతీయుల దినోత్సవం ఒక వేదిక అవుతుంది. ప్రవాసీయుల సహకారం.. భారతదేశ కలకు సాకారం.. ఏదైనా ఒక దినోత్సవం జరపడం మొదలుపెడితే ప్రతి ఏడాది ఒక విశేషమైన అంశాన్ని ఎంచుకుని ఆ అంశం దిశగా కృషి చేయడం, లక్ష్యాలు సాధించడం జరుగుతుంది.  ప్రవాస భారతీయుల దినోత్సవానికి అలాంటి అంశాల ఎంపిక ఉంది.  ఈ ఏడాది..     “అభివృద్ధి చెందిన భారతదేశపు సంకల్పంలో  ప్రవాస భారతీయుల సహకారం”  అనే అంశాన్ని  ఎంపిక చేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశ జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశ జాబితాలో మన దేశం చేరేందుకు గానూ  విదేశాలలో ఉండే భారతీయుల  పాత్రని  ఈ అంశం ప్రతిబింబిస్తుంది.    సేవ..  గుర్తింపు.. ఈ ఎన్‌ఆర్‌ఐ దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా అందరిని ఆకట్టుకునే ప్రధాన విషయం.. సేవలను గుర్తించడం. ఇవే..  ‘ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు’. ఇవి భారతీయ ఎన్‌ఆర్‌ఐ లు  చేసిన అసాధారణ సేవలను గుర్తించి సత్కరించేందుకు ఇచ్చే పురస్కారాలు. ఈ అవార్డులు భారత రాష్ట్రపతి చేతులు మీదుగా అందజేయబడతాయి. ఈ గుర్తింపు  భవిష్యత్తులో భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకి  మధ్య మరింత సహకారం పెరిగేలా చేస్తుంది. ఈ సారి ప్రవాస భారతీయుల దినోత్సవానికి  వేదిక అయిన భువనేశ్వర్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయులను హృదయపూర్వకంగా స్వాగతించనుంది. ఈ సంవత్సరం కార్యక్రమానికి ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగం ఇవ్వబోతున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  మొదటి రోజు యూత్ ప్రవాస భారతీయ దివస్‌కు కేటాయించబడింది. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించనున్నారు. ఇది యువ నాయకత్వం,  సాధికారతపై దృష్టి సారిస్తుంది. ప్రసిద్ధి చెందిన డెవ్ ప్రగాద్ (సి‌ఈ‌ఓ, న్యూస్వీక్) వంటి ప్రసంగకర్తలు ఇందులో పాల్గొంటారు. ఈ సంధర్బంగా మన దేశ యువత కూడా తమ ప్రతిభా నైపుణ్యాలని సరిగా ఉపయోగించుకుని, దేశం వీడినా దేశ సేవ చేస్తున్న  ప్రముఖ ప్రవాస భారతీయులను ఆదర్శంగా తీసుకుని  తమ జీవితాలని మెరుగుపర్చుకోవటమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా భాగం అయితే భారతదేశం అభివృద్ది చెందిన దేశం అవుతుంది.                                                 *రూపశ్రీ.
  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.
  వైకల్యం.. మనిషి కొనితెచ్చుకునే సమస్య కాదు. కొందరు పుట్టుకతో వైకల్యంతో పుడతారు.  మరికొందరు ప్రమాదవశాత్తు వైకల్యానికి లోనవుతారు.  అయితే వైకల్యం ఉంది కదా మన వల్ల ఏం అవుతుందిలే అని కొందరు జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు.  ఏదో ఒక విధంగా జీవితాన్ని అలా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తమ వైకల్యం తమ లక్ష్యాలకు అడ్డు కాదని భావిస్తారు.  జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఫలితంగా ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.  అలాంటి వారిలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.  కేవలం ఒకే ఒక కదలికతో ఏకంగా విశ్వాన్ని శోధించిన ఘనుడు ఆయన.  జనవరి 8వ తేదీ స్టీఫెన్ హాకింగ్ జననం.  ఈ సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటే జీవితానికి కావలసినంత చైతన్యం లభిస్తుంది. స్టీఫన్ విలియం హాకింగ్..  1942, జనవరి 8వ తేదీన జన్మించారు.  ఈయన ప్రసిద్ధ బ్రిటీష్ సైద్దాంతిక శాస్త్రవేత్త. ముఖ్యంగా విశ్వనిర్మాణ శాస్త్రవేత్త.  ఈయన మరణించే సమయానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు. వైకల్యం.. విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది.  ఆడుతూ పాడుతూ సాగుతున్న సాఫీ జీవితంలో పెద్ద సునామీలా సమస్యలు విరుచుకుపడేలా చేస్తుంది.  స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కూడా అంతే.. ఆయనకు 21ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది.  ఇది కాలంతో పాటు పెరుగుతూ పోయింది. క్రమంగా స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ప్రతి అవయవాన్ని కబళించింది.  ఆయన శరీరం చచ్చుబడిపోయేలా చేసింది. స్టీఫెన్ హాకింగ్ తన 20 ఏళ్ల వయసులో కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్ళాడు. అక్కడి వెళ్ళిన తరువాతే ఆయన జీవితం మలుపు  తిరిగింది.  భోజనం చెయ్యాలన్నా, బూట్లు లేసులు వేసుకోవాలన్నా, ఇతర పనులు చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పరిస్థితి ఆయన కుటుంబం ఆందోళన చెందింది.  వైద్య పరీక్షలు నిర్వహించగా మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకరమైన జబ్బు ఉన్నట్టు తేలింది. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగానే తొందరలోనే ఆయన శరీరం చచ్చుబడిపోయింది. అయితే ఆయన మెదడు మాత్రం అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు ఆయన ముఖంలో ఒక దవడ ఎముక మాత్రం కదిలేది. ఆ ఒక్క దవడ ఎముక కదలికలే.. స్టీఫెన్ హాకింగ్ ప్రయోగానికి  మూలాధారం.  ఆ దవడ ఎముకకు ఒక పరికరాన్ని అమర్చారు. స్టీఫెన్ హాకింగ్  ఆలోచనలు అన్నింటిని ఆ పరికరం సంభాషణ రూపంలో వ్యక్తం చేసేది.  ఇలా ఆయన శరీరం కదలని స్థితిలో కూడా విశ్వాన్నిశోధిస్తూ తన పరిశోధనలు సాగించాడు. అలాంటి స్థితిలోనే కృష్ణబిలాలకు సంబంధించిన అనేక విషయాలు కనుగొన్నాడు.  1985లో ఆయనకు నిమోనియా వచ్చింది.అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.  తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో  ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించేవాడు. చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో తెరపై ప్రదర్శిస్తుంది. ఆయన కృషికి కొందరు మిత్రుల సహకారం కూడా తోడైంది.  కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ ఆయన ఆలోచనను మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది.  స్టీఫెన్ హకింగ్ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన గొంతునే  సింథసైజర్ కు అమర్చారు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ నేరుగా మాట్లాడినట్టే ఉండేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా.. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.                                           *రూపశ్రీ. 
నిద్ర దివ్యౌషధం అంటారు.  ఆరోగ్యకరమైన నిద్ర శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  ప్రతి వ్యక్తికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర  కచ్చితంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే హాయిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుందట. అతిగా నిద్రపోవడం వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. ఊబకాయం.. అతిగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది.  ఎక్కువ సేపు నిద్రపోయే వారు శారీరక కష్టం ఏమీ చేయని వారై ఉంటారు.  ఎందుకంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు వృత్తి కార్యకలాపాలు నిర్వర్తించడం, చిన్న పనులు చేయడాన్నే పెద్దగా ఫీలైపోతారు.  శారీరక శ్రమ,   వ్యాయామం,  ఇతర విషయాలు, పనులను కూడా వాయిదా వేస్తుంటారు. దీనివల్ల దీర్షకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవక్రియ.. ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో జీవక్రియ మందగిస్తుంది.  బరువు  పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.  శరీరంలో కేలరీలను బర్న్ చేసే అవకాశం ఉండదు.  జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. గుండె.. ఎక్కువ సేపు నిద్రపోవడం గుండెకు ప్రమాదం అని వైద్యులు అంటున్నారు.  ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది రక్తప్రసరణను నెమ్మదిస్తుంది.  ఈ కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గి గుండె జబ్బులు,  హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు.. రోజుకు 7 గంటల నిద్రపోవడం ఆరోగ్యకరం.  7 గంటల కంటే ఎక్కువ అయినా 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యమే.. కానీ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా 9 గంటలు నిద్రపోయే వారిలో 46శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనలలో తేలింది. థైరాయిడ్.. అధిక నిద్ర కారణంగా థైరాయిడ్ సమస్యలు,  అతిగా తినడం అనే సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట.  వీటి కారణంగా అధిక బరువు,  ఊబకాయం,  డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                       *రూపశ్రీ.
  నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు.  మంచి నిద్ర ఉంటే  శరీర ఆరోగ్యం చాలా వరకు సాఫీగా ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రవ్వగానే హాయిగా నిద్రపోవాలని అనుకుని, పడుకుని నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కాలయాపన చేసేవారు.. నిద్రరాక గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలలో గడిపేవారు చాలా మంది ఉంటున్నారు. కొందరైతే నిద్ర  బాగా రావాలని పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు కూడా తాగుతుంటారు. అయితే ఇలా నిద్ర రాకపోవడం అనేది సాధారణంగా కొట్టే పడేయాల్సిన విషయం కాదట. ఇలా నిద్ర రాకపోవడం అనేది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అంటున్నారు.   నిద్రలేమి వివిధ కారణాల వల్ల సంభవించినా.. దీర్ఘకాలం ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే మాత్రం అది కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల జరుగుతుంది. నిద్ర లేమి అనేది చాలా వరకు డిప్రెషన్ తో బాధపడేవారికి ఎదురయ్యే సమస్య.  డిప్రెషన్ కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చాలామంది ఈ కాలంలో అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి.   కొందరిలో స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటుంది.  ఇది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే వ్యాధి.  దీని వల్ల శ్వాస సరిగా ఆడక మళ్లీ మళ్లీ నిద్ర మధ్యలో మేల్కొంటు ఉంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీర వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య కలుగజేస్తుంది. ఆర్థరైటిస్,  మైగ్రేన్ లేదా ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా సరిగా నిద్ర పోలేరు. ఈ వ్యాధుల కారణంగా  నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది.  ఈ సమస్యలు ఉన్నవారిలో నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి. అధికంగా ఆల్కహాల్,  కెఫీన్ పానీయాలు తీసుకునే వారు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు.                                           *రూపశ్రీ.
  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం సరిపడినంత తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహారం నుండే శరీరానికి కావలసిన పోషకాలు,  విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలకు ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని గుండెకు మేలు చేస్తాయి.  కొన్ని కండరాలకు మేలు చేస్తాయి.  కొన్ని కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇలా మేలు  చేసే ఆహారాలలో మెదడుకు మేలు చేసే ఆహారాలు ముఖ్యమైనవి.  మెదడు పనితీరు బాగుండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మెదడు లేదా అని ఆంటుంటారు. అంటే.. మంచి ఆలోచనలకు,  జ్ఞాపకశక్తికి, శరీర కార్యకలాపాలకు మెదడు శక్తివంతంగా ఉండటం అవసరం. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు పనితీరు బావుండాలన్నా మెదడుకు  శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. మెదడుకు అమృతంతో సమానమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకంటే.. వాల్ నట్,  బాదం.. వాల్ నట్, బాదం పప్పులు మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.  వాల్ నట్ లలోనూ,  బాదం లోనూ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానసికంగా బలహీనంగా ఉన్నా,  జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నా,  ఆలోచనా పనితీరు, మెదడు చురుగ్గా ఉండాలన్నా వాల్ నట్ లు, బాదం పప్పులు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదట. వాల్ నట్ లు బాదం పప్పులలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.  ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో నరాల పనితీరు బాగుండాలంటే నాడీ వ్యవస్థ బాగుండాలి. నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలి.  నాడీ కణాలకు పోషణ ఇవ్వడం ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో వాల్ నట్స్, బాదం పప్పులు సహాయపడతాయి. వాల్ నట్స్,  బాదం పప్పులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి వయసుతో పాటు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా  అవసరం.  నిద్రను మెరుగుపరచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, బాదం పప్పులో ఉండే పొటాషియం మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.                                                  *రూపశ్రీ.