LATEST NEWS
ఉన్న ఒక్క దారి కూడా మంటలతో మూసుకు పోవడంతో, మలేసియాలోని ఒక ముస్లిం స్కూల్ లో దాదాపు 24 మంచి చిన్నారులు అగ్నికి ఆహుతై ప్రాణాలు విడిచారు. ఆ గదికి రెండు దార్లు ఉన్నప్పటికీ ఒక దారిని గోడతో మూసేసారు. అగ్నిమాపక సిబ్బంది మరియు సాక్షులు చెప్పిన కథనం ప్రకారం, మొదట పిల్లలు సహాయం కోసం కిటికీలోంచి చేతులు బయటపెట్టి అర్ధించారు... కానీ, చుట్టుపక్కల వారు నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయారు. తర్వాత చిన్నారుల దేహాలు అగ్నికి దహింపబడి... మృతదేహాలు గదిలోని ఒక మూలలో పడి ఉండిపోయాయి. పాఠశాల ఉద్యోగి ఆరిఫ్ మవార్డి మొదట ఉరుము శబ్దంగా భావించి మేల్కొన్నానని... కానీ, అవి జనాల అరుపులని తర్వాత తెలుసుకున్నానని అన్నారు.  ప్రమాద విషయం తెలుసుకొని అగ్నిమాపక సిబ్బంది ఉదయం 5:41 గంటలకు అక్కడికి చేరుకున్నారు. మంటలార్పడానికి వారికి ఒక గంట సమయం పట్టినట్లు కౌలాలంపూర్ పోలీస్ చీఫ్ అమర్ సింగ్ చెప్పారు. అక్కడ కనీసం 24 మృతదేహాలు ఉన్నాయని, వాటిలో 13 నుండి 17 ఏళ్ళ మధ్య బాలురు 22 మంది మరియు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. మా ఊహ ప్రకారం, చిన్నారులంతా ఊపిరాడక చనిపోయారని వివరణ ఇచ్చారు. 14 ఇతర విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు రక్షించబడ్డారని, అందులో ఆరుగురు క్లిష్ట పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నారని సింగ్ అన్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వాళ్ళ ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనని దగ్గరి నుండి చూసిన వాళ్ళు తాము ఇంకా షాక్ నుండి తేరుకోలేక పోతున్నామని అన్నారు.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: రవితేజా, మెహ్రిన్ కౌర్, రాధిక, ప్రకాశ్ రాజ్, సంపత్, శ్రీనివాసరెడ్డి... దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాత: దిల్ రాజు తెలుగు మాస్ హీరోకి.. ‘అడవిరాముడు’ చెప్పిన సక్సెస్ ఫార్ములా ఏంటంటే... ‘మనం లాజిక్కులకు అందం... సో... మీరు అలా వెళ్లిపోండి’ అని. ఇక్కడ హీరో... వందమందిని ఒక్కడే కొడితే తప్పులేదు. ఇక్కడ పిస్టల్ లో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్.. హీరోని చూసి వెనక్కి వెళ్లిపోతే తప్పులేదు. ఇక్కడ హీరోకు కోపం వస్తే... ఆకాశం నుంచి పిడుగులు పడతాయ్. ఉరుములు ఉరిముతాయ్..  తప్పులేదు. ఏనుగులొచ్చి హీరోగారి మెడలో పూలమాలలేసి... జేజేలు కొడతాయ్.. తప్పులేదు. పంచభూతులు కూడా హీరో చెప్పినట్టు వింటాయ్.. తప్పులేదు. ఇక్కడ మాస్ హీరో అంటే... మనిషికి ఎక్కువ... దేవుడికి కా....స్త తక్కువ. ‘అడవి రాముడు’ తర్వాత జనాలు అలా ఫిక్సయిపోయారు. అయితే... ఇదంతా హీరో పాయింట్ ఆఫ్ యూలో మాత్రమేనండోయ్. కథలో, కథనంలో కాదు. వాటిల్లో మాత్రం కచ్చితం లాజిక్కు ఉండాలి.  లేకపోతే.. జనాల చేతుల్లో ఖర్సయిపోతాం. అంచేత చెప్పేదేంటంటే.. ఎలాంటి సినిమాకైనా... కథ, కథనాల విషయంలో గ్రౌండ్ వర్క్ అవసరమే. కాకపోతే.. మాస్ హీరో సినిమా అంటే.. హీరోగారి ఇమేజ్ మీద కూడా వర్కవుట్ చేయాలి. అదన్నమాట విషయం.  ఈ బుధవారం మన మాస్ మహరాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఇందులో రవితేజ అంధుడిగా నటించాడు. రవితేజ ఏంటీ... అంధునిగా నటించడం ఏంటి? కొంపదీసి ఇదేమన్నా ప్రయోగాత్మక, సందేశాత్మక, కరుణరసాత్మక చిత్రమా? అనే అనుమానాలు రావడం సహజం. కానీ.. అలాంటిదేం లేదండి. ఇది ఊర మాస్ సినిమా. ఇలాంటి కథలో రవితేజ అంధుడు అవ్వడమే ఇక్కడ వైరైటీ. అసలు రవితేజ బిరుదే.. ‘మాస్ మహారాజా’. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? అనిల్ రావిపూడి జనం మెచ్చేలా తీశాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ముందు కథలోకెళ్దాం.  కథ:- ఓ సిన్సియర్ పోలీస్ అధికారి. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఆ అమ్మయి అంటే... పోలీసాయనకు పంచప్రాణాలు. ఓ దుర్మార్గుడి కబంద హస్తాల్లో చిక్కుకొని ఉన్న ప్రమాదకరమైన ఊరుకు ఆ పెద్దాయన ట్రాన్సఫర్ అవుతాడు. చూసీచూడనట్టు వెళ్లమని సాటి అధికారులు చెప్పినా ఆయన వినడు. ముందు వాడి మనుషుల్ని... ఆ తర్వాత వాడి తమ్ముడ్ని ఎన్ కౌంటర్ చేస్తాడు. దాంతో పగబట్టిన ఆ దుర్మార్గుడు.. ఆ పోలీస్ అధికారి కూతుర్ని, అతనికి సపోర్ట్ చేసిన పోలీసుల్ని ఎత్తుకొస్తాడు. కూతురికోసం, సహచరులకోసం ఆ పెద్దాయన.. వాడి అడ్డాలోకెళ్తాడు. అక్కడే.. ఆ పోలీస్ అధికారినీ.. సహకరించిన పోలీసులను దారుణంగా చంపేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం పారిపోతుంది. ఆ అమ్మాయి కోసం విలన్ వెతుకుతుంటాడు. పోలీసులేమో.. ఆ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి తరుణంలో కథలోకి ‘ఒకడు’ ఎంటరవుతాడు. పైగా వాడు అంధుడు. వాడు ఆ అమ్మాయిని కాపాడతాడు. ఎలా కాపాడతాడు? అనేది సినిమా.  విశ్లేషణ:- ఇలాంటి కథలు కోకొల్లలు వచ్చాయ్. ఒక్కడు,  భద్ర, సరైనోడు... ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయ్. ఇది కూడా అలాంటి కథే. అయితే.. ఈ కథలో హీరో ఆంధుడు అవ్వడం వైరైటీ. జనాలకు కొత్త అనుభూతిని కలగించింది అదే. దేవుడు.. ఒకటి తీసుకుంటే.. తీసుకున్న దానికంటే పదింతలు శక్తిని ఇస్తాడంట. ఇందులో హీరో ప్రవర్తన అలాగే ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లున్నోళ్ల కన్నా.. అంధులే నయం అన్నట్టు చూపించాడు. అందులోంచి పుట్టుకొచ్చే కామెడీ... ఆ నేపథ్యంలో ఎస్టాబ్లీష్ అయ్యే... యాక్షన్ ఎలిమెంట్స్.. మాస్ కట్టిపడేస్తాయ్. కథ పాతదైనా.. అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యింది అక్కడే. కథలో భాగమైన సన్నివేశాలన్నీ బాగానే తీశాడు కానీ.. కథకు సంబంధంలేని ఓ బ్యాంక్ రాబరీ సీన్ ఉంది. దాంతో మాత్రం ప్రేక్షకులను ఇరేటేట్ చేశాడు. అంతేకాదు... ప్రీ క్లయిమాక్స్ లో లైట్లు తీసేసి విలన్ ని మాయ చేస్తాడు హీరో. ఆ సీన్ తో నిజానికి సినిమా అయిపోయింది. అక్కడే విలన్ ని చంపేయొచ్చు. కానీ.. రాధిక పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేదనుకున్నాడో ఏమో.. సినిమాను కాస్త సాగదీశాడు. రాధిక కోసం రెండు ఎమోషనల్ సీన్లు. రవితేజ హీరోయిజం పీక్స్ లో చూపించే మరో సీన్.. ఓ భారీ క్లయిమాక్స్ ఫైట్.. ఇవన్నీ పెట్టేశాడు. అయితే... అవన్నీ బావున్నాయ్. ఇక రవితేజ.. సినిమా కొంచెం బావుంటే.. తన నటనతో సినిమాకు ఇంకాస్త మైలేజ్ తీసుకొచ్చే నటుడు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. యావరేజ్ అనిపించే సినిమాను.. రవితేజ ఎనర్జీ సూపర్ హిట్ స్థాయిలో నిలబెట్టింది. అంధుడిగా అదరహో అనిపించేశాడు. కామెడీతో జనాలను పగలబడి నవ్వించాడు. హీరోయిజంతో మాస్ మహరాజా అనిపించేశాడు. హీరోయిన్ మెహ్రిన్ కౌర్ ది కథకు వెన్నెముక లాంటి పాత్ర. నటనకు అవకాశం ఉన్న రోల్. చాలాబాగా చేసింది. రాధిక గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. మిగిలిన వాళ్లందరూ చక్కగా చేశారు.  సాంకేతికంగా చెప్పుకుంటే.. సాయికార్తీక్ నేపథ్య సంగీతం బావుంది. పాటలు అస్సలు అర్థం కావు. తమ్మిరాజు ఎడిటింగ్, మోహనకృష్ణ కెమెరా బావున్నాయ్. నిర్మాత ఖర్చకు వెనకాడలేదు. లావిష్ గా తీశాడు.  టోటల్ గా... లాజిక్కులు పక్కనపెట్టి చూస్తే... అందరికీ నచ్చే సినిమా ఇది.  రేటింగ్:- 3/5
Cast: Ravi Teja, Mehreen Pirzada, Radhika, Vivan Bhatena, Rajendra Prasad, Prakash Raj, Sampath Raj etc. Direction: Anil Ravipudi Banner: Sri Venkateswara Creations Producer: Dil Raju Music: Sai Karthik Release Date: Oct 18, 2017 Ravi Teja who took long gap after Bengal Tiger pins many hopes on Raja The Great directed by successful director Anil Ravipudi and produced by ace producer Dil Raju. Will this movie provide a break for Ravi Teja? Story: Raja (Ravi Teja) is a visually challenged guy. However, he won't feel bad about his didability. On the other hand, an influential person Devraj (Vivan Bhatena) is willing to slay Lucky (Mehreen Pirzada) because of whom his brother was killed in the hands of police. Raja is appointed to save Lucky. How Raja utilizes the opportunity and guards Lucky from the baddies is rest of the story... Positives: 1. Ravi Teja 2. Anil Ravipudi Writing, Direction 3. Several Hilarious Episodes   Negatives: 1. Few Slow Moments In 2nd Half 2. Regular Story Analysis: Hero Ravi Teja and director Anil Ravipudi attempted a great experiment of protagonist with a disability. Apparently, director completely targeted mass audiences as he included excess number of mass and heroism elevating elements from start to end. Though protagonist in the film is a blind, we won’t find much difference as he does everything. Ravi Teja is shown as gifted with extremely good sensory capabilities. His scenes with Radhika, Srinivas Reddy and Rajendra Prasad in first half were hilarious. The episodes of Ravi Teja narrating his childhood story of how his father had left the home and how his mother takes the big responsibility was heart-touching and the training period was shown efficiently. The pre-interval action sequence was massy. Movie turns a bit racy after Ravi Teja and Mehreen go to the latter’s hometown. Posani Krishna Murali and batch provided some laughter. However, movie turns slow later ever since Ravi Teja challenges Vivan Bhatena. Last 15 to 20 minutes action scenes spoil the flow, though one section of audience may like them. Artists Performances: Ravi Teja steals the show with his unique comedy timing and exceptional energy in dialogue delivery. Apparently, he has worked hard to set his body language right. Playing the role of a visually challenged guy was a challenging task and Ravi Teja passed it with distention marks. He was equally good in hilarious as well as action sequences. Mehreen Pirzada was okay in the role of Lucky. As we all know Radhika is a great actor and she has shown has supremacy in playing the mother role. Rajendra Prasad was amusing. Vivan Bhatena was convincing as antagonist. Posani Krishna Murali was good. Other artists played their parts efficiently. Technical Aspect: Director Anil Ravipudi opted to a regular story. However, he provided good entertainment from start to end, though there were few dull moments here and there. What impressed more was his penning of uproarious and powerful dialogues. Music director Sai Karthik rightly exploited the opportunity to compose music for a mass star like Ravi Teja. Though songs were okay, his work on background score was imposing. Cinematography by Mohan Krishna was brilliant and Editor Tammi Raju should have chopped few boring sequences. Production values of Sri Venkateswara Creations are top notch. Verdict: Raja The Great would work well in mass centers. However, it needs to be seen how the movie will be received in class centers.  TeluguOne Perspective: Laughing Time In Theaters Rating: 3/5
బొద్దుగుమ్మ నమితకు అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి క్రేజ్ ఉండేది. సహజంగానే భారీ అందాలను ఇష్టపడే తమిళ తంబిలు నమితను అమితంగా ఇష్టపడ్డారు. ఏకంగా గుడినే కట్టేసే రేంజ్‌లో అభిమానులను సంపాదించుకొంది నమిత. అయితే కొత్త హీరోయిన్లు రావడంతో నమితకు రాను రాను అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అందరు మాజీ హీరోయిన్ల లాగానే నమిత కూడా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకొని సెటిలైపోవాలనుకుందట. అల్రెడి ఒకరి ప్రేమలో తడిసిముద్దవుతోందట. దీనిలో ఏ మాత్రం తప్పులేదు. అయితే నమిత పెళ్లీ విషయంలో తమిళ మీడియా రాతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని.. సహజీవనం చేస్తున్నారని.. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. 60 ఏళ్ల వయసున్న శరత్‌బాబుకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లతో పాటు ఇద్దరితో విడాకులు కూడా అయ్యాయి. అలాంటి వ్యక్తి మళ్లీ నమితను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురిచేశాయి. దీనిపై స్పందించిన శరత్‌బాబు.. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు.. తాను నమితను కలిసి 8 ఏళ్లు అయ్యింది. అలాంటప్పుడు తమ మధ్య ఇలాంటి వ్యవహారానికి ఆస్కారం లేదన్నారు. తనకు అసలు మళ్లీ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని.. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికి తెలియజేస్తానన్నారు. తాజాగా ఈ ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడింది నమిత. ఆయన వయసేంటి..? నా వయసేంటి..? ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు..? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో అందరిని ఆకట్టుకొన్న జగపతిబాబు హీరోగా తన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ మూవీలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు జగపతి. ఆ తర్వాత వరుసపెట్టి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకొని.. ఇప్పుడు సౌతిండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయాడు జగపతిబాబు. తాజాగా యాంగ్రీ యంగ్‌మెన్‌గా.. పవర్‌ఫుల్ పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకొన్న రాజశేఖర్‌‌కి అలాంటి లక్ తెచ్చిపెడతానంటున్నారు బాలయ్య. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బాలకృష్ణ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా కనిపించబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన "పీఎస్‌వీ గరుడవేగ" ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను బాలకృష్ణ గారి సినిమాతో విలన్‌గా మారుతున్నట్లు స్వయంగా ప్రకటించాడు రాజశేఖర్. బాలయ్య హీరోగా, రాజశేఖర్ విలన్‌గా ఓ స్టోరీలైన్‌ రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ స్టోరీ బేస్ బాలయ్యకు బాగా నచ్చిందట. ఈ ప్రాజెక్ట్‌తోనే ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇస్తాడట రాజశేఖర్. మరి ఈ సినిమా పట్టాలపైకి ఎక్కుతుందా లేదా అన్నది అతి త్వరలోనే తేలిపోనుంది.
మాస్ మహారాజ్ రవితేజను ప్రేక్షకులు ధియేటర్లలో చూసుకొని దాదాపు రెండేళ్లు దాటిపోయింది. ఆయనకు ఆరోగ్యం సరిలేదని.. మంచి కథలు రావడం లేదని.. నిర్మాతలతో బేరం సరిగా కుదరడం లేదంటూ రకరకాల ఊహాగానాలు.. కారణం ఏదైనా రవి రెండేళ్లు కాలం గడిపేశాడు. మరి ఇన్ని రోజుల తర్వాత మాస్ మహారాజ్ సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పక్కర్లేదు. దానికి తోడు సినిమా మొత్తం అంధుడిగా నటించడంతో.. మూవీపై క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పూర్తయి టాక్ బయటకు వస్తోంది. దీంతో సినిమాపై తమ అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు అభిమానులు. రవితేజ పుట్టుకతోనే అంధుడు.. అయితే తన కుమారుడిని పోలీస్‌గా చూడాలనుకుంటుంది తల్లి. కానీ గుడ్డివాడు కావడంతో పోలీస్ ఉద్యోగానికి అనర్హుడిగా మారతాడు. ఈ క్రమంలో హీరోయిన్ పరిచయం కావడం.. ఆమెకు ఉన్న సమస్యను రవితేజ ఎలా పరిష్కరించాడన్నదే కథ. ఫస్టాఫ్‌లో తల్లిగా రాధిక పర్ఫామెన్స్ అదిరిపోయిందట. అంధుడిగా రవితేజ పడిన కష్టం స్క్రీన్‌ మీద కనిపిస్తుందట. ఆయన కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీగా ఈ సినిమా మిగిలిపోతుందని ప్రేక్షకులు అంటున్నారు. పూర్తి రివ్యూ కోసం తెలుగువన్‌ని ఫాలో అవ్వండి.
ఢిల్లీ.. భారతదేశ రాజధాని.. చరిత్రలో ఎన్నో గొప్ప రాజవంశాల పాలనకు సజీవ సాక్ష్యం.. ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక చారిత్రక కట్టడం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. అందుకే భారతీయులు తన జీవితకాలంలో ఒక్కసారైనా రాజధానిని చూడాలనుకుంటారు. ఇంతటి ఘన వారసత్వానికి కేరాఫ్‌గా నిలిచే ఢిల్లీ ఇప్పుడు ఒక చెడ్డపేరు మూటకట్టుకుంది. మహిళలకు ఏమాత్రం భద్రత లేని నగరాల్లో హస్తినాపురం అగ్రస్థానంలో నిల్చుంది. లండన్‌కు చెందిన థామ్సన్ రాయిటర్స్ అనే సంస్థ ప్రపంచంలోని 19 మహా నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.   ఈ ఏడాది జూన్- జూలై నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో నగరం నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 380 మంది పాల్గొన్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఫలితాలను తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్న నగరాల జాబితాలో ఢిల్లీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ, సావోపౌలో ( ఢిల్లీ ) నగరాల్లో మగువలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. అత్యాచారాలతో పాటు లైంగిక హింస, వేధింపులు, భౌతిక దాడులు ఇలా మొత్తంగా చూస్తే అత్యంత ప్రమాదకరమైన నగరాల జాబితాతో ఈజిప్ట్ రాజధాని కైరో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మెక్సీకో సిటీ, తరువాతి స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచాయి.   ఇక మన రాజధాని నగరం ఢిల్లీ ఈ జాబితాలో నాలుగో స్ధానంలో నిలిచింది. ఢిల్లీ కంటే కూడా పాక్ వాణిజ్య నగరం కరాచీ మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బస్సులో వెళుతున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు కామాంధులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.   దీనిపై దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు రావాలని ప్రజలు పోరాటాలు చేశారు. అత్యాచార నిందితులకు కఠిన శిక్ష విధించేందుకు గానూ నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అత్యాచారాలు తగ్గాల్సిందిపోయి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 140 అత్యాచార ఘటనలు, 238 మంది మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 43 రేప్ కేసులు.. 133 మంది మహిళలపై వేధింపుల ఘటనలు పరిష్కారానికి నోచుకోలేదు. జనాభాకు సరిపడా పోలీసు సిబ్బంది లేకపోవడంతోనే నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మహిళలపై అత్యాచారాల ఘటనల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవడం సగటు భారతీయుడిని.. ముఖ్యంగా ఢిల్లీ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఎలాంటి బంధానికైనా నమ్మకం ప్రధానం.. అది భార్యభర్తలు కావొచ్చు, వ్యాపారంలో భాగస్వాములు కావొచ్చు.. స్నేహితులు కావొచ్చు.. అన్నాదమ్ములు కావొచ్చు.. ఇలా ఎలాంటి రిలేషనైనా నమ్మకం అనే అనే పునాదులపైనే అది నిలబడుతుంది. తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పన్నీర్ సెల్వం అని ఎవరిని అడిగినా చెబుతారు. దివంగత ముఖ్యమంత్రి జయ నమ్మిన బంటుగా ఎన్నో సంక్షోభాల్లో ఆమెను కాపాడారు. తానే ముఖ్యమంత్రి అయినప్పటికీ అమ్మ కూర్చీలో కూర్చోకుండా ఆమె ఫోటోను అక్కడ ఉంచి తన స్వామి భక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు.   అలాంటి పన్నీర్ సెల్వంపై ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామికి నమ్మకం సన్నగిల్లుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గతేడాది డిసెంబర్‌లో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో పొడచూపిన విభేదాలు, వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ తర్వాత చిన్నమ్మకే పన్నీర్‌ సీఎం పీఠాన్ని అప్పగిస్తారని అంతా అనుకొన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అనంతరం అమ్మ సమాధి సాక్షిగా దీక్షకు దిగడం, శశికళపై తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి.   దీంతో శశికళ వర్గం ఖంగుతింది. అప్పటి నుంచి తమిళనాట రాజకీయాల్లో అనేక కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, పళనిస్వామి సీఎం కావడం.. పన్నీర్ సెల్వంతో ఏకమవడం.. అదే సమయంలో దినకరన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎప్పటికీ కలవరని అనుకొన్న పన్నీర్ - పళని వర్గాలు ఒకటయ్యాయని ఆనందపడిన పార్టీ శ్రేణులకు ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగలేలా కనిపించడం లేదు. దీనింతటికి కారణం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లడమే. పన్నీర్ వెంట రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి తంగమణిని సీఎం పళనిస్వామి ఢిల్లీకి పంపారు.   ప్రధానితో సమావేశానికి మైత్రేయన్‌ను మాత్రమే తీసుకెళ్లిన పన్నీర్ .. తంగమణిని బయటే వదిలేశారని.. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు వ్యతిరేకంగా మోడీకి పలు విషయాలు చెప్పారని.. తంగమణి సహా ఇతర నాయకులు పళనిస్వామి చెవిలో ఊదినట్లు చెన్నై టాక్. దీనికి బలాన్ని చేకూర్చేలా.. రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తుందని ప్రకటన రావడం, ఆర్కేనగర్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడం జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటిని ఒక కంట కనిపెడుతున్న సీఎం పళనిస్వామి ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై నిఘా పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధిని వేదికగా చేసుకొని పన్నీర్ మరోసారి ధర్మయుద్ధానికి దిగుతారన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు.
12.10.2014 ఈ రోజు విశాఖప్రజలే కాదు ఏపీ వాసులకు జీవితాంతం గుర్తుంటుంది. సరిగ్గా ఇదే రోజున ప్రకృతి సాగర నగరం విశాఖ మీద కన్నెర్ర చేసి విలయతాండవం చేసింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఎక్కడ చూసినా కూలిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్, సెల్‌ఫోన్ టవర్లు, హోర్డింగ్‌లే దర్శనమిచ్చాయి. ప్రచండ గాలులు, వర్షపు తాకిడికి ఐదుగురు మరణించారు. తీర ప్రాంతం వెంట పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో వందలాది గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. తుఫానుకు ముందు పచ్చని చెట్లతో కళకళలాడిన విశాఖ కొద్దిగంటల్లోనే ఏడారిలా మారిపోయింది.   తిరిగి విశాఖ కోలుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనాలు.. ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా లేదంటూ ప్రతిపక్షం నుంచి వ్యంగ్యాస్త్రాలు. అయినా సవాళ్ల మీద స్వారీ చేయడాన్ని ఇష్టంగా మలుచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కవోని దీక్షకు కాలం సైతం తలవంచింది. అంతటి భారీ తుఫాను పూర్తిగా తగ్గకముందే హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరి.. రోజుల తరబడి బస్సునే తన ఇల్లు, ఆఫీసుగా చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించారు. దీంతో రికార్డు సమయంలోనే విశాఖ నిలదొక్కుకుంది.   ఎన్ని రోజులకు వస్తుందో అనుకొన్న విద్యుత్‌ కొన్ని గంటల్లోనే వచ్చింది. నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూసుకున్నారు. కూలిన ప్రతి చెట్టు స్థానంలో మొక్కలు నాటుకుంటూ వచ్చారు. హుధుద్ ఆనవాళ్లను చెరిపివేసేలా నగరం మొత్తం పచ్చదనం పరుచుకుంది.. దీని తర్వాత సీఎం విశాఖ అభివృద్ధి మీద దృష్టిపెట్టారు. పెద్ద పెద్ద సదస్సులను విశాఖలో ఏర్పాటు చేసి.. దానికి దేశవ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలను రప్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, బెస్ట్ బిజినెస్ పాలసీల ద్వారా ఐటీ కంపెనీలను ఉక్కు నగరం ముంగిట నిలబెట్టారు.   నాడు హుధుద్ వల్ల కూలిన చెట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని భావించిన సీఎం దీపావళి పండుగ జరుపుకొవద్దు అని పిలుపునిచ్చారు. నేడు హుధుద్ దెబ్బ నుంచి కోలుకోని దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ పరుగులు పెడుతుండటంతో మూడేళ్ల తర్వాత అదే దీపావళీని చేసుకోనున్నారు చంద్రబాబు. ఆర్కే బీచ్‌లో జరిగే వేడుకల్లో వీధి బాలలు, అనాధ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కలిసి సీఎం పండుగ జరుపుకుంటారు. 
  పాకిస్తాన్ అణు ఆయుధాలను నిల్వ చేయడానికి భూగర్భ సొరంగాలను నిర్మిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, అమృత్సర్ నుండి 350 కిలోమీటర్లు, భారత రాజధాని న్యూఢిల్లీ నుండి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్వాలీలో పాకిస్తాన్ భూగర్భ సొరంగాలను తవ్విస్తుంది. ఈ అనుసంధానిత సొరంగాల ఎత్తు 10 మీటర్లు మరియు వెడల్పు 10 మీటర్లు అని సమాచారం. ప్రతి సొరంగానికి ప్రత్యేక ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారములు ఉన్నాయట.   వైయాన్ అనే వార్తా సంస్థ నివేదిక ప్రకారం, అణు క్షిపణులను ప్రయోగించే ప్రదేశానికి సులువయిన రవాణా కోసం, పాకిస్తాన్ యొక్క భూగర్భ సొరంగాలు విస్తృత రహదారులకు అనుసంధించారట. అయితే, ఈ సొరంగ మార్గాలు నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రదేశం చుట్టూ భారీ కంచెలు నిర్మిస్తున్నారు. ప్రతి సొరంగం 12 నుండి 24 అణ్వాయుధాలను నిల్వ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటాయని తెలిసింది.   పాక్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ తమ దేశం ఢిల్లీలో 5 నిమిషాల్లో అణు దాడిని ప్రారంభించగలదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   ఇదిలా ఉంటే,  సెప్టెంబరులో జమ్మూ - కాశ్మీర్లోని ఆర్నీయా విభాగంలోకి, పాకిస్థాన్ వైపు నుండి వస్తున్న భూగర్భ సరిహద్దు సొరంగం బయటపడింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట శాంతి నెలకొల్పేందుకు సుచేట్గర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) మరియు పాకిస్తానీ రేంజర్స్ చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత ఈ సొరంగం బయట పాడడం విశేషం.   గత సంవత్సరం ఒక అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణు ఆయుధాల నిల్వలను మరియు క్షిపణి సరఫరా సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. పాకిస్తాన్ 140 అణ్వాయుధాల నిల్వలు కలిగి ఉందని ఆ సంస్థ నివేదించింది.   అయితే, పాకిస్తాన్ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ ముందు తన పప్పులు ఉడకవని. 1947, 1965, 1971, మరియు 1999 ల్లో జరిగిన యుద్దాల్ని, అప్పుడు తగిలిన గాయాల్ని అప్పుడే మరచిపోయినట్టున్నారుగా!
  బాలయ్య చెంపదెబ్బల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. అంతేకాదు... ప్రతిసారీ ఎవరో ఒకరిపై బాలయ్య చేయి చేసుకోవడం ప్రజల్లోనే కాదు రాజకీయ నేతల్లో కూడా చర్చనీయాంశమే అయ్యింది. కొందరు నెటిజన్లయితే... ఒకడుగు ముందుకేసి... రేపు రాబోతున్న ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ బాలయ్యకు ఇవ్వడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఈ దఫా సీఎం కుమారుడు లోకేష్ నిలబడనున్నట్లు వార్తలు కూడా రాసేశారు. బాలయ్యకు ఈ సారి రాజ్యసభే నట. అప్పుడే జోస్యం కూడా చెప్పేస్తున్నారు.  ఈ విషయంపై బాలయ్య అంతరంగికులు.. పూర్తి క్లారిటీ ఇచ్చారు. ‘బాలయ్య కొట్టారు.. కొట్టారూ.. అంటారు. అసలు ఎందుకు ఆయన చేయ్ చేసుకోవాల్సొస్తోందో ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం అభిమానుల కోసమే బాలయ్య మార్షల్స్ ని పెట్టుకోరు. అభిమానుల విషయంలో మార్షల్స్ దుకుడుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయ్. అందుకే... వాళ్లను దూరంగా పెడతారు. అంతపెద్ద స్టార్ అయ్యుండి నేరుగా జనాల్లోకి వెళ్లిపోతారు. వారేమో... బాలయ్యను చూడగానే.. అంతులేని ఆనందంతో కిందామీదా చూసుకోకుండా మీద పడిపోతుంటారు.   అలాంటి సందర్భాల్లో సహనం నశించి కొడతారే తప్ప.. అదేదో కావాలనో.. పోగరుతోనే కొట్టడం కాదు. హిందూపురంలో ఓ కార్యకర్తను బాలయ్య చేయ్ చేసుకున్న విషయానికే వస్తే.. ఆ కుర్రాడు నేరుగా బాలయ్య గన్ మేన్ మీదే పడ్డాడు. లోడెడ్ గన్ చేతిలో ఉంది. పొరపాటున మిస్ ఫైరింగ్ అయితే.. పరిస్థితి మరోలా ఉండేది. అందుకే.. ఆ కోపంలో ఓ దెబ్బ వేశారు. మరో విషయం ఏంటంటే.. ఆయన గట్టిగా కొట్టరు. ఏదో బెదిరించడానికి అన్నట్లు.. లైట్ గా చరుస్తారు... అంతే. దానికి ఎందుకీ రాద్ధాంతం. బాలయ్యగారి తోటి స్టార్లందరూ మార్షల్స్ తో జనాల మధ్యకొస్తారు. కానీ.. ఒక్క బాలయ్యే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జనాల్లోకొస్తాడు. అలా రావడానికి గట్స్ ఉండాలి’ అని చెప్పారు.   ‘సింహా’ చిత్రం ఆడియో వేడుకలో మార్షల్స్ కీ, బాలయ్య అభిమానులకీ మధ్య పెద్ద గొడవే జరిగింది. హైదరాబాద్ రాక్ హైట్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన గొడవను అదుపు చేయడం పోలీసుల వల్లే కాలేదు. అప్పట్నుంచే మార్షల్స్ ని దూరంగా ఉంచడం మొదలుపెట్టాడట బాలయ్య. పాపం.. ఆ వివరాలేం తేలీకుండా... బాలయ్యను టార్గెట్ చేయడం నిజంగా బాధాకరమే. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటిస్తే మంచిది కదా. 
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ భర్త ఎం నటరాజన్‌కు కొంతకాలం క్రితం ఆరోగ్యం విషమించింది. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో ఆయన గత కొద్దిరోజులుగా చెన్నైలోని గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అవయవాలు మార్పిడి చేయాలని లేకపోతే మనిషి దక్కడం కష్టమని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో 74 ఏళ్ల నటరాజన్‌కు ఆ వయసులో ఎంతో క్లిష్టమైన కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఇక్కడే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 20 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రికి రావడం, బ్రెయిన్‌డెడ్ అయిన అతన్నుంచి ఆర్గాన్స్‌ సేకరించి..నటరాజన్‌కు అమర్చడంపై వివాదం రేగింది. ఈ క్రమంలో అందరి వేళ్లు మన్నార్ గుడి మాఫియా మీదకే వెళ్తున్నాయి.   శశికళ స్వగ్రామం మన్నార్ గుడి. ముగ్గురు సోదరులతో కలసి నివసించే చిన్నమ్మది ఉమ్మడి కుటుంబం.. ఆ వూళ్లోనే పెద్ద కుటుంబం. ఎప్పుడైతే శశి.. జయలలితకు దగ్గరైందో మన్నార్‌గుడిలో ఉండే ఆమె కుటుంబసభ్యులతో పాటు సమీప బంధువులంతా కట్టకట్టుకొని పోయెస్ గార్డెన్‌లో వాలిపోయారు. అమ్మ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరంతా పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సంపాదించారు. బదిలీలు, పైరవీలు, లైసెన్సులు ఇలా ఏం కావాలన్నా ఈ మాఫీయా చేసి పెట్టగలదు. అంతేందుకు ఏకంగా ఐఏఎస్‌లను సైతం బదిలీ చేయగల పవర్ వీరికి ఉండేదట.   ఈ మాఫియా కమాండర్ శశికళ భర్త ఎం. నటరాజన్. అయితే మన్నార్‌గుడి మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరుగుతుండటంతో జయలలిత కన్నెర్ర చేశారు. వీరిలో కొంతమందిని జైలుకు సైతం పంపించారు. మధ్యలో మళ్లీ రాజీ కుదిరినా, మన్నార్ గుడి మాఫియాను పూర్తిగా ఆమె క్షమించలేక పోయారు.  2011లో శశికళ మంది మార్బలాన్ని మొత్తం తరిమేశారు. అయితే, కొంతకాలం తర్వాత శశికళను తిరిగి దగ్గరికి చేర్చుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో జయ అపోలో ఆస్పత్రిలో చేరడం.. 74 రోజుల పాటు చికిత్స జరిగినా.. ఆ సమయంలో శశికళ తప్ప మరో వ్యక్తికి అమ్మ దగ్గరికి అనుమతి లభించకపోవడం తావివ్వడం... తర్వాత అమ్మ మరణించడం ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు.. ఈ వ్యవహారంలో తెర వెనుక మన్నార్ గుడి మాఫియా ఉందనేది ఎంతో మంది వాదన. జయ మరణం తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు మన్నార్ గుడి గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. వీరి కుట్రలను త్వరగానే అర్థం చేసుకున్న అన్నాడీఎంకే నేతలు ఈ గ్యాంగ్‌ను బయటకు పంపేశారు.   సరే ఈ సంగతి పక్కనబెట్టి నటరాజన్ సర్జరీ విషయానికి వస్తే. కీరమంగళం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తీక్ అనే యువకుడిని చికిత్స నిమిత్తం తంజావూరు నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలో నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే కార్తీక్ అప్పటికే బ్రెయిన్ డెడ్‌ అయినట్లు ప్రకటించిన వైద్యులు అనంతరం అవయవ దానం గురించి తెలుపగా... అందుకు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. దీనిలో భాగంగా అతని గుండె, కిడ్నీలు, లివర్, ఉపిరితిత్తులను సేకరించిన వైద్యులు లివర్, కిడ్నీలను 74 ఏళ్ల వ్యక్తికి, గుండెను 43 ఏళ్ల వ్యక్తికి, ఉపిరితిత్తులను 62 ఏళ్ల వ్యక్తికి కేటాయించారు.   వీరిలో 74 ఏళ్ల వ్యక్తి నటరాజనే అనేది అందరి అభిప్రాయం. అయితే కార్తీక్‌ను గ్లెనెగిల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించిన తీరుపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పేద యువకుడి కుటుంబం ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుని, గ్లెనెగిల్స్ ఆసుపత్రికే ఎందుకు తీసుకువెళ్లాలని భావించింది..? ఎయిర్ అంబులెన్స్‌కు ఖర్చులను ఎవరు భరించారు..? ఆర్గాన్ షేరింగ్ నెట్‌వర్క్‌ నిబంధనల ప్రకారం ఆర్గాన్ షేరింగ్ రిజిస్ట్రీలో అందరికన్నా పైన నటరాజన్ పేరు ఎలా వచ్చింది..? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలకు.. సమాధానం ఒక్క మన్నార్ గుడి మాఫియానే అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. లేదంటే ఈ సర్జరీ కూడా జయకు జరిగిన రహస్య చికిత్సలాగానే ఇది కూడా ఒక మిస్టరీలాగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
  ఒక కొత్త అధ్యయనం ప్రకారం, నిద్రలేమి వలన గర్భిణీ స్త్రీలకి గెస్టేషనల్ (గర్భధారణ సమయంలో) మధుమేహం  వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గడచిన 20 ఏళ్ళలో దాదాపుగా పావు శాతం స్త్రీలు మరియు 16 శాతం పురుషులు నిద్ర లేమితో బాధపడుతున్నారు.   గర్భిణీ స్త్రీలు తరచుగా గర్భధారణ మధుమేహంతో బాధపడుతుంటారు. సాధారణంగా ఇది రెండవ లేదా మూడవ త్రైమాసికంలో సంభవిస్తుంది. గర్భిణీ స్త్రీలు 24 నుండి 28 వారాల గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు జరుపుకుంటున్నారు. ఒకవేళ, షుగర్ లెవెల్స్ మోతాదు కన్నా ఎక్కువ ఉంటే గర్భధారణ మధుమేహం (గెస్టేషనల్ డయాబెటిస్) వచ్చే ప్రమాదం ఉంది.   సాధారణంగా, శిశువు జన్మించిన తర్వాత తల్లికి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అమ్మకి గర్భధారణ మధుమేహం ఉన్నట్లయితే, జన్మించిన శిశువులు అధిక బరువు కలిగి ఉంటారు. అమ్మలకి తర్వాత టైప్ -2 మధుమేహం వచ్చే అవకాశాలుంటే, పిల్లలకి కూడా మధుమేహంతో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.   సగటున 6 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నట్లయితే, గర్భధారణ మధుమేహం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతుంది. కాబట్టి, గర్భిణులు రోజుకి ఖచ్చితంగా 6 గంటలు పైగా నిద్రపోయేలా ప్రణాళిక చేసుకోవాలి లేదా వారికి వారి పిల్లలకి షుగర్ తో పాటు ఊబకాయం కొని తెచ్చుకున్నట్లే!
  ఎక్కువకాలం చదువుకునేవారు, మరియు కొత్త అనుభవాల కోసం ఉవ్విల్లూరేవారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. దీర్ఘాయువు కోసం జన్యువుల మీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం, విద్యను సుదీర్ఘ కాలం అభ్యసిస్తే, పాఠశాల చదువు దాటి ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని ఏళ్ళ ఆయుష్షు పెరుగుతుందట.   అధిక బరువు ఉన్న వ్యక్తులు ప్రతి అదనపు కిలోగ్రాము బరువుకు రెండు నెలల ఆయుష్షు తగ్గుతుందని ఆ అధ్యయనం సూచించింది. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు తమ తల్లిదండ్రుల జీవితకాల రికార్డులతో పాటు 600,000 మందికి పైగా ఇతర వ్యక్తుల నుండి జన్యు సమాచారాన్ని విశ్లేషించారు.   మన జీవనశైలి:- ఉదాహరణకు మద్యం సేవించడం, సిగరెట్ తాగడం లేదా వీటికి బానిస అవ్వడం DNA పైన విపరీతమయిన ప్రభావితం చూపిస్తుంది. సిగరెట్ అలవాటు ఉన్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తద్వారా వారి జీవితకాలం తగ్గుతుందని వారు కనుగొన్నారు.    ఒక రోజుకి సగటున ఒక సిగెరెట్ ప్యాకెట్ తాగితే, జీవితకాలంలో ఏడు సంవత్సరాలు తగ్గుతుందని వారు లెక్కించారు. అయితే, పొగత్రాగేవారు ఆ అలవాటు మధ్యలో మానుకుంటే అలవాటు లేని వారు ఎంత కాలం బ్రతుకుతారో వీళ్ళు అంతే కాలం బ్రతుకుతారు. శరీరంలో కొవ్వు మరియు మధుమేహం తెచ్చే ఇతర కారకాలు కూడా జీవితకాలం పైన ప్రభావం చూపిస్తాయి.   మొత్తంగా ఈ అధ్యయనం చెప్పేది ఏంటంటే, మనం ఎన్నేళ్లు చదువు మీద శ్రద్ధ ఉంచాం, మనకు ఎన్ని మంచి లేదా చెడు అలవాట్లు ఉన్నాయి, మన శరీరంలో ఎంత కొవ్వు ఉంది లాంటి కారకాలు మనం ఎన్నేళ్లు జీవిస్తామో నిర్ణయిస్తుంది.    
ఆన్ లైన్ షాపింగ్ కొందరికి నచ్చితే, చాలా మందికి నచ్చదు. ఇక బట్టల విషయంలో అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ భయానికి గల అసలు కారణం ఏంటంటే ఆన్ లైన్ షాపింగ్ లో పొరపాటున నచ్చని వస్తువు కొన్నా, లేదంటే వస్తువు అనుకున్నట్లుగా లేకపోయినా వాపసు చేయడం ఎలాగా అని? అలాంటి వారి కోసమే ఈ 4 సలహాలు: 1 . మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేస్కోండి: ఒక వస్తువుని కొనేప్పుడు మనం చేసే ప్రథమ తప్పిదం ఏంటంటే మెజర్మెంట్స్ బాక్స్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం. ఒక చొక్కానో, లేక ప్యాంటు కొనేప్పుడు మెజర్మెంట్స్ బాక్స్ లో అన్ని వివరాలు సరిగ్గా గమనిస్తే అది మన సైజు కి సరిపోతుందా లేదా అనే విషయంలో సరయిన అవగాహన వస్తుంది. 2 . డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి: ప్రతి పోర్టల్ కి ఒక డిజైనర్ ఉంటారు. వాళ్ళు తాము చేసే దుస్తులు వీలయినంత వరకు అందంగా కనిపించేలా చూసుకుంటారు. కావున, మనం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మీరు ఇష్టపడిన దుస్తులు ఒక సాధారణ వ్యక్తిపై చాలా భిన్నంగా కనిపించొచ్చు. ఒక్కోసారి వాటికి బెల్ట్ కానీ వేరే ఇతర వస్తువు తగిలించి కనిపించొచ్చు. అయితే అది మనం తీసుకునే వస్తువుతో జత చేయబడి ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ శ్రద్ధగా చదవండి, మీకు అన్ని విషయాల్లో సరయిన అవగాహన వస్తుంది. 3 . సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం: ఏదయినా వస్తువు కొనాలనుకున్నప్పుడు, మీరు ఇంతకు ముందు దానిని చూడని సందర్భంలో, ఆ వెబ్ సైట్ యొక్క ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో ఒక లుక్కేయడం ఉత్తమం. ఎందుకంటే, మీకు ఆ వస్తువును రకరకాల కోణాల్లో చూసే అవకాశం ఉంది. చెప్పలేం, మీకు తెలిసిన వారెవరయినా అది ఇంతకు ముందు ధరించి ఉండవచ్చు కూడా. ఇలా చేయడం వల్ల మీకు ఆ దుస్తులపైన సరైన అవగాహన వచ్చి, మీరు కొనొచ్చో లేదో నిర్ణయం తీసుకోవచ్చు. 4 . ఫాబ్రిక్ విషయంలో జాగ్రత్త వహించండి: ఎల్లప్పుడూ, మీరు కొనే ఫాబ్రిక్ నాణ్యత, సౌకర్యం విషయంలో మీకు ఇంతకు మునుపు ఉన్న బట్టలతో పోల్చి చూడండి. చాలా సందర్భాల్లో మీరు కొనే దుస్తులు మెటీరియల్ వల్ల కానీ లేదా మీకు ఎంత సౌకర్యవంతంగా ఉంది అనే దాని బట్టి ఇష్టం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఓ ఫాబ్రిక్ నిపుణులవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ దగ్గర ఇంతకు ముందు ఉన్న దుస్తుల ఫాబ్రిక్ లో ఏది సౌకర్యవంతంగా ఉందో అదే ఫాబ్రిక్ దుస్తులు తీసుకుంటే మంచిది.  ఈ 4 చిట్కాలను అనుసరించండి ఆన్లైన్ షాపింగ్ నిపుణులు అవ్వండి. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులు మీకు ఇష్టం లేనందున నిరాశ చెందే పని ఉండదు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం శంషాబాద్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గోనేందుకు అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రారంభోత్సవం జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్సందించిన ఎమ్మెల్యే అనుచరులు ప్రకాశ్‌గౌడ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు నిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకొన్న మంత్రి మహేందర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.
ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇద్దరు నటీనటులు కలుసుకున్నా ఒకటే టాపిక్.. హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపుల గురించే. వర్థమాన నటులుగా ఉన్నప్పుడు తమను వెయిన్‌స్టీన్ లైంగికంగా వేధించాడని ప్రముఖ నటీనటులు ఏంజెలినా జోలీ, గ్వైనెత్ పాల్ట్రో ఆరోపించడం సంచలనం సృష్టించింది. వీరితో పాటు మెరిల్ స్ట్రీప్, జెన్నిఫర్ లారెన్స్, కేట్ విన్‌స్లెట్ వంటి నటీమణులు కూడా బయటకు వచ్చి.. వెయిన్‌స్టీన్ తమను ఎలా వేధించింది చెప్పడంతో అతని చీకటి కోణం ప్రపంచానికి తెలిసింది. దీంతో అతన్ని సొంత కంపెనీ నుంచే బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలో అందాల రాశి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ కూడా అతని బారిన పడేదట.. కానీ అదృష్టం బాగుండి కాస్తలో తప్పించుకుందట. దీనికి ఐశ్వర్య మాజీ అంతర్జాతీయ మేనేజర్ కారణమట. ఈ విషయాన్ని ఆ మేనేజర్ స్వయంగా తెలిపింది. అనేక మంది కొత్త హీరోయిన్లను హోటల్ గదికి పిలిపించుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించిన వెయిన్‌స్టీన్.. ఐశ్వర్యరాయ్‌ను ఒంటరిగా కలవాలని కోరాడట.. కానీ తాను సమయస్పూర్తితో వ్యవహరించి వారి మధ్య అలా జరగకుండా చూశానని తెలిపింది. మేం ముగ్గురం మాత్రమే ఉన్నప్పుడు ఐశ్వర్యను ఒంటరిగా వదిలేసేందుకు ఎంత కావాలి అని అడిగాడు.. నేను తిరస్కరించానని చెప్పింది.
దీపావళి పర్వదినాన్ని ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయనకు సైనికులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని జవాన్లకు మిఠాయిలు అందించారు. సుమారు రెండు గంటలపాటు వారితో గడిపిన మోడీ సైనికుల్లో స్పూర్తిని నింపారు. మీతో గడపటం తనకు నూతన శక్తిని ఇచ్చిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతీకూల వాతావరణంలోనూ దేశ భద్రత కోసం జవాన్లు నిర్వర్తించే బాధ్యత ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైనికులతో దీపావళి జరుపుకోవడం ఇది నాలుగోసారి.
ఇటీవలి కాలంలో డయాబెటిస్ అనేది కామన్‌గా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాఢపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే చాలు.. లైఫ్ లాంగ్ మనల్ని విడిచిపెట్టదు. అందుకే డయాబెటిస్ అంటే చాలు జనం హడలిపోతారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వం, వయసు, స్థూలకాయం, స్మోకింగ్ తదితర కారణాలు షుగర్ రావడానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన తర్వాత అది తినకూడదు. ఇది తినకూడదు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారు నిపుణులు. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయవచ్చట. అలాంటి ఫుడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
బరువు పెరగడం సులభమే.. కానీ దాన్ని తగ్గించుకోవడమే బహు కష్టం.. చాలా మంది స్థూలకాయులు అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా తంటాలు పడుతుంటారు. ఇలా అనుకోకుండా పెరిగిపోయి.. నలుగురిలోకి వెళ్లడానికి కాస్త గిల్టిగా ఫీలవుతుంటారు కొందరు. అందుకే వీరు వెయిట్ లాస్ కోసం చేయని ప్రయత్నాలు ఉండవు.. కొందరైతే ఏకంగా లైపో సక్షన్ అనే కొవ్వును కరిగించుకునే ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.. ఇంకొందరు డైటింగ్‌, జిమ్, వెయిల్ లాస్ ఎక్సరసైజుల పేరిట బోలెడంత డబ్బు తగలేస్తుంటారు. కానీ మనం నిత్యం వాడే కొబ్బరి నూనెతో వెయిట్ లాస్ అవ్వొచ్చని తెలుసా..? అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  
  క్యాన్సర్.. ఈ పేరు వింటేనే జనం భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే పరిస్థితి.. కానీ ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేజారిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రాణాంతకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాంటి వాటిలో ప్రధానమైనది దానిమ్మ. మన రోజువారి ఆహారంలో దానిమ్మను చేర్చడం వల్ల క్యాన్సర్‌ దరిచేరకుండా చేయవచ్చు. ఇది ఒక్కటే కాకుండా దానిమ్మ వల్ల ఉపయోగాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.