పాత చంద్రబాబును చూస్తారు.. చంద్రబాబు
posted on Aug 28, 2015 12:45PM
ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పనిచేసే వారే నాదగ్గర ఉంటారు పనిచేయని వారిని నేను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర విడిపోవడం వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా దెబ్బతింది.. ఈ నేపథ్యంలో ఏపీని అభివృద్ధి చేయడానికి నేను అహర్నిశలు కష్టపడుతున్నా అధికారుల నుండి సరైన సహకారాలు అందడంలేదని మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా ఉండేవాడిని నిర్లిప్తంగా ఉన్నా, నిరక్ష్యంగా వ్యవహరిస్తే గతంలో సహించేవాడిని కాదు.. ఇప్పుడు ఉద్యోగులు పనితీరు మార్చుకుంటే సరాసరి లేకపోతే మరో 3 నెలల్లో పాత చంద్రబాబును చూస్తారంటూ ఆయన హెచ్చరించారు.
గుంటూరు ఆస్పత్రి ఘటన, ఇంజక్షన్ల సైకో ఘటనపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరికి రోజుల పసికందు మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఆ డాక్టర్‌కు బుద్ధి లేదు' అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాక ఒక సైకో ఇంజక్షన్లు చేసి పారిపోతుంటే పోలీసులు వాడిని పట్టుకోవడానికి భయపడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోను పట్టుకోకపోవడంపై తాను డిజిపి నుంచి అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి వాయించి పారేశానన్నారు. పనిచేసే అధికారులే తన దగ్గర ఉంటారని, పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు.