బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం రాత్రి బెంగుళూరు నుండి హైదరాబాద్ బయలుదేరిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి మండలం, కొత్తపేట వద్దకు రాగానే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరి మంటలను అదుపుచేశారు. పోలీసులు బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.