తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫార్సులపై తిరుమలేశుని దర్శనం

తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసులపై తిరుమలేశుని దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలపై శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది.ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను ఆది, సోమవారాలలో మాత్రమే స్వీకరిస్తుంది.

ఆ లేఖలపై శ్రీవారి దర్శనాన్ని సోమ మంగళవారాలలో కల్పిస్తుంది. అలాగే రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించిన సిఫారసు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే టీటీడీ స్వీకరిస్తుంది. ఇక  ఒక ప్రజా ప్రతినిధికి ఒక సిఫారసు లేఖ మాత్రమే ఇవ్వాలనీ, అదీ ఒక లేఖపై ఆరుగురికి మించకుండా ఉండాలని టీటీడీ పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు,  భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణన‌లోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu