ఇరాన్ లో బ్లడ్ రెయిన్ కు  కారణమిదే 

ఇరాన్ లో ఇటీవలె బ్లడ్ రెయిన్ కురిసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు.  స్వచ్చమైన నీరు రంగు రుచి వాసన ఉండదు. ఈ మూడు లేనిదే స్వచ్చమైన నీరు అని  మనం అభివర్ణిస్తుంటాం.  కానీ ఇరాన్ లో బ్లడ్ రెయిన్ వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. సాధారణంగా వర్షపు నీరు స్వచ్చంగా ఉంటుంది.  కానీ ఇరాన్ లోని రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షం నీరు ఎర్రటి రంగులో ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త  టాప్ టెన్ లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధించారు. ఇరాన్ రెయిన్ బో ఐ ల్యాండ్ లో  కురిసిన వర్షానికి ఎలాంటి రంగులేదని పరిశోధకులు తేల్చేశారు. ప్రపంచంలోని ఏడో వింత అని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. తాజాగా రెయిన్ బో ఐ ల్యాండ్ లో కురిసిన వర్షాన్నిఅక్కడి జనం ఎంజాయ్ చేశారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ప్రపంచనలుమూలల నుంచి అక్కడికి చేరుకున్నారు. బ్లడ్ రెయిన్ వార్త తెలుసుకుని ఇరాన్ బీచ్ లో ప్రత్యక్ష మయ్యారు. ఇరాన్ లో రెయిన్ బో ఐల్యాండ్ లో  ఆకాశం నుంచి వర్షపు నీరు పడి జలపాతంలా క్రిందకు దూకడంతో అద్భుతమైన దృశ్యం పలువురిని ఆకర్షించింది. రెయిన్ బో ఐ ల్యాండ్ లో అగ్ని పర్వతం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పర్వతం బద్దలు కావడంతో ఆ ప్రాంతమంతా ఐరన్  ఆక్సైట్  కంటెంట్ తో నిండిపోయింది. వర్షం పడినప్పుడు చిలుముతో నిండిన ఐరన్ మీద వర్షపునీరు పడటంతో అది ఎర్రగా మారిపోయి ప్రవహించింది. ఎర్రటి రంగులో ఈ నీరు ప్రవహించడంతో బ్లడ్ రెయిన్ అనే ప్రచారం జరిగింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu