అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
posted on Mar 17, 2025 3:11PM
.webp)
అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకుల పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవి దంపతుల కుమార్తె ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్, కుమార్తె అత్త సునీతలు ఈ ప్రమాదంలో మరణించారు. ప్రగతి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సంఘటనాస్థలంలోనే ప్రగతి రెడ్డి, హర్వీన్, సునీతా మరణించారు. కారు, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.
కాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గరు మృత్యువాత పడటం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన రోహిత్ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.