మెడలో మిర్చి దండలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
posted on Mar 17, 2025 12:46PM

తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ మెడలో మిర్చి దండలు వేసుకుని నిరసనకు దిగారు. వెంటనే మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలనీ, మిర్చికి పాతివేలు గిట్టుబాటు ధర చెల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు జరిగిందనీ, అయితే గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ సీజన్ లో మిర్చి సాగు 2లక్షల 40 వేల ఎకరాలకు పడిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చికి కనీసం క్వింటాల్ కు పాతిక వేలు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే మిర్చిని సుగంధ ద్రవ్యాల జాబితా నుంచి ఆహార ధాన్యాల జాబితాలోకి మార్చాలని కోరారు.