LATEST NEWS
అజరుద్దీన్ మంత్రి పదవి.. అంతే సంగతులా? ఆయన ఎమ్మెల్సీ కాక పోవడంతో మరో నెల రోజుల్లో తన మంత్రి పదవిని కోల్పోవల్సి వస్తుందా? అజర్ భవితవ్యం ఏంటి? ఒక వేళ ఆయన మంత్రిత్వం కాపాడలేక పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని పరిశీలిస్తే ఆయనకా గండం ఉందనే చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం, ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆరు నెలల లోపు అసెంబ్లీకో, మండలికో ఎన్నికవ్వాలి. అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఈ నెలాఖరు లోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
అజర్ ఎమ్మెల్సీ ఎందుకు కాలేకపోయారు? ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది.
ఒక వేళ ఈ ప్రయత్నాలు వర్కవుట్ కాకుంటే అజర్ మంత్రి పదవి పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో అజారుద్దీన్ ఏకైక ముస్లిం మంత్రి. అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఆయన్ను క్యాబినేట్ లోకి తీసుకున్నారు. ఒక వేళ అజారుద్దీన్ మంత్రి పదవిని రేవంత్ నిలపలేకపోతే.. అదంతా ఆ టైంలో అంటూ జూబ్లీ ఉపఎన్నికలో అవసరానికి మైనార్టీ ఓట్ల కోసం వేసిన ఎరగా వారు భావించే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు రెండేళ్ల వరకు మంత్రిమండలిలో మైనార్టీ ప్రాతినిధ్యం లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. దాన్ని పూడ్చడానికే ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్‌ను మంత్రిని చేశారు.
ఇప్పుడు ఆయన పదవి కోల్పోతే, అది కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు విషయంలో రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎలాగైనా ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతానికి అజర్ భవితవ్యం గవర్నర్ నిర్ణయం, న్యాయపరమైన అంశాల చేతుల్లో ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు వీలు కాకపోతే, ఆయన రాజీనామా చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ గతంలో హరికృష్ణ విషయంలో జరిగినట్లుగా, ఒకసారి పదవి పోతే తిరిగి రావడం అంత సులభం కాకపోవచ్చు. మొత్తానికి, ఏప్రిల్ 30వ తేదీ అజారుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్‌లో ఒక క్రూషియల్ పీరియడ్ లాంటిది. ఆయన ఈ గడువును దాటుతారా లేదా? అనేది వచ్చే కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఎక్కువ విశ్లేషణలు ఒకే వాక్యంతో మొదలవుతాయి.. అదేమిటంటే, ముస్లిం ఓటు కన్‌సాలిడేషన్. అంటే, మైనారిటీ ఓటు 294 సీట్లలో 80–120 సీట్ల భవిష్యత్తు నిర్ణయిస్తుందనే వాదన. అయితే.. జనాభా గణాంకాలు, జిల్లా వారీ మ్యాప్ లు, గత ఎన్నికల మార్జిన్లు చూసినప్పుడు, ఈ కథనం అతిశయోక్తిగా కనిపిస్తుంది. వాస్తవంగా పశ్చిమ బెంగాల్ లో ముస్లింల జనాభా 27 అయినప్పటికీ.. 3 జిల్లాల్లోనే వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.
2011 జనగణన ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా 27శాతం. రాష్ట్రంలోని మొత్తం జిల్లాల్లో వారి జనాభా మెజారిటీగా ఉన్నది మూడు జిల్లాల్లోనే. అవి ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్ పూర్. వీటిలో ముర్షిదాబాద్ లో ముస్లింల జనాభా 66శాతంగా ఉంది. ఇక మాల్డా జిల్లాలో 51శాతం, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో 50శాతంగా ఉంది.
మిగతా 20 జిల్లాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ, 251 అసెంబ్లీ సీట్లలో.. స్పష్టంగా హిందువుల మెజారిటీ ఉంది. అంటే, రాష్ట్ర స్థాయిలో ముస్లింల జనాభా 27శాతం ఉన్నప్పటికీ.. భౌగోళికంగా అది కొన్ని బెల్ట్‌లలో కేంద్రీకృతమై ఉంది, మిగతా చోట్ల విస్తరించి, లేదా చీలిపోయిన రూపంలో ఉంది.
80 సీట్లు ముస్లిం నిర్ణయిస్తారు అన్న గణితం ఎక్కడ తప్పిందంటే.. ఏ జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం దాటితే.. ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను ముస్లిం ప్రభావిత సీట్లు గా లెక్కించడం. అలా లెక్కించడం వల్లే. ఇలా లెక్కిస్తే.. రాష్టరంలో 80కి పైగా సీట్లలో జయాపజయాలను ముస్లిం ఓటర్లు నిర్ణయిస్తారు.ఇదే.. ముస్లిం వీటో కథనానికి బేస్.
అయితే సమస్య ఎక్కడంటే.. అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్–పాస్ట్–ది–పోస్ట్ (ఎఫ్పిటీపీ) వ్యవస్థలో జరుగుతాయి. అంటే జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం ఉన్న.. ప్రతి నియోజకవర్గంలోనూ అదే స్థాయి కన్‌సాలిడేషన్ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా స్వతంత్రంగా నిర్ణయించే స్థాయి ప్రభావం రావాలంటే.. ఒక సీటులో ముస్లిం ఓటు శాతం సాధారణంగా 38 నుంచి 40 శాతం ఉండాలి. అప్పుడు మాత్రమే ఒకే బ్లాక్‌గా ఓటేస్తే, ఫలితాన్ని తిప్పే శక్తి వస్తుంది. అంటే, జిల్లా స్థాయి శాతాన్ని నేరుగా సీటు స్థాయి ప్రభావంగా గణించడం సరికాదు. .
జిల్లాల వారీగా ముస్లిం డిసెసివ్ సీట్లు ఏంటని చూస్తే.. ముర్షిదాబాద్ జిల్లాలో 22 స్థానాలు. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 66శాతం. ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉన్న సీట్లు 20. అలాగే మాల్డా జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ ముస్లిం జనాభా 51శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 12. ముస్లిం ఓటు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు 8. ఇక నార్త్ దినాజ్ పూర్ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 50శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 9. వీటిలో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు ఐదు.
అలాగే బీర్భూమ్. దక్షిణ 24 పరగణాలు, నదియా. ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో ముస్లిం కన్సాలిడేషన్ 38 నుంచి 40 శాతం వరకూ ఉంటుంది.
అవేంటని చూస్తే.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 33 సీట్లలో 5 నుంచి ఏడు స్థానాలలో, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని 31 స్థానాలలో 4 నుంచి 6 సీట్లలో ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉంటుంది. మొత్తంగా ఈ జిల్లాలన్నీ కలిపి చూసినా ముస్లిం ఓటు నిర్మాణాత్మకంగా ఉండే సీట్లు 47 నుంచి 54కు మించవు. అంటే రాష్ట్రంలోని మొదత్తం 294 నియోజకవర్గాలలో కేవలం 16 నుంచి 18 శాతం సీట్లలో మాత్రమే ముస్లిం వీటో కాదుకాదు హెడ్ స్టార్ట్ ఉంటుందన్న మాట.
ఇక్కడ ఒక తేడా ఉంది.. అదేంటంటే.. ఒక పార్టీకి ఒక కమ్యూనిటీ నుంచి భారీ కన్‌సాలిడేషన్ వస్తే, ఆ పార్టీకి ఆ సీట్లలో స్పష్టమైన ఆధిక్యం ఉంటుంది. అదే ఏ సీటులోనైనా ఏ కాంబినేషన్ వచ్చినా ఒక కమ్యూనిటీ అంగీకరించని పరిస్థితి ఉంటే ఎవరూ గెలవలేని స్థాయి ప్రభావం.. ఇదే వీటో. బెంగాల్ లో ముస్లిం ఓటు కొన్ని బెల్ట్‌లలో హెడ్ స్టార్ట్ ఇస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వీటో శక్తి ఇవ్వదు. ఇకపోతే వేస్టెడ్ ఓటు సమస్య ఒకటి ఉంది. దీని వల్ల భారీ మెజారిటీలు వస్తాయి కానీ రాజకీయంగా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు భగబంగోలా సీటులో తృణమూల్ కాంగ్రెస్ కు లక్షా ఆరు వేల మెజారిటీ వచ్చింది. అలాగే సుజాపూర్ లో లక్షా ముఫ్పై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది.
ఎఫ్పిటీపీ వ్యవస్థలో.. గెలవడానికి అవసరమైనది ఒక ఓటు ఎక్కువ మాత్రమే. దాని మించి వచ్చిన ఓట్లన్నీ సర్‌ప్లస్ మాత్రమే. అవేమీ ప్రాతినిథ్యాన్ని, ప్రతినిధిత్వాన్ని పెంచవు. అంటే, ముస్లిం ఓటు భారీగా కన్‌సాలిడేట్ అయిన సీట్లలో.. TMC వంటి పార్టీలు అత్యధిక మెజారిటీలతో గెలుస్తాయి. అంతే.. కానీ ఆ అదనపు లక్షల ఓట్లు ఇతర సీట్లలోకి బదిలీ అవ్వవు. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు, ఇది ఒక స్ట్రక్చరల్ వేస్ట్ అంతే.
ఇదే సమయంలో TMCకి అత్యంత కీలకమైన 13 సీట్లలో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ మూడు వేల ఓట్ల కంటే తక్కువే. ఇవేవీ ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు కావు. అంటే.. ఎలక్షన్‌ను తిప్పిన సీట్లు ముస్లిం బెల్ట్‌లో కాకుండా, మిక్స్‌డ్ లేదా హిందూడామినేటెడ్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
2021లో నిజంగా ఎక్కడ ఎన్నిక తేలింది? అంటే.. హౌరా, హూగ్లీ, మటువా బెల్ట్ లో ఇక్కడ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఇక్కడే రేజర్ థిన్ మార్చిన్లు వచ్చాయి. మొత్తం 7 జిల్లాల్లో టీఎమ్సీ 50,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది, మిగతా అన్ని సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. అంటే.. ఎలక్షన్ లెక్క మేరకు ముస్లిం బెల్ట్‌లో భారీ మెజారిటీలు సురక్షిత సీట్లు. కానీ వేస్ట్‌డ్ ఓట్లు. మిక్స్‌డ్ అండ్ హిందూ డామినెంట్ బెల్ట్‌లో చిన్న మార్జిన్లు. ఇవే అసలైన డిసెసివ్ బ్యాటిల్‌గ్రౌండ్స్.
91 లక్షల డిలీషన్, సీటుకు 31,000 ఓట్లు: 2026లో కొత్త ఫ్యాక్టర్
ఇక మరో కీలక అంశం ఏమిటంటే.. ఓట్ల తొలగింపు. వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది? ఏ సామాజిక సమూహం, ఏ పార్టీ సపోర్ట్ బేస్ ఎక్కువగా ప్రభావితమైంది? అన్నదే ఇప్పుడు 2026 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.
ముస్లిం కన్‌సాలిడేషన్ కంటే, ఓటర్ లిస్ట్‌లోని మార్పులు, మిక్స్‌డ్ బెల్ట్‌లలోని చిన్న మార్జిన్‌లు 2026లో ఎక్కువగా డిసెసివ్ అయ్యే అవకాశం ఉంది. ముస్లిం ఓటు వంద శాతం దగ్గరగా కన్‌సాలిడేట్ అయితే.. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ఒక పార్టీకి 50 నుంచి 60 సీట్లు సేఫ్ అవుతాయి. అదే సమయంలో మిగతా 234 సీట్లలో.. హిందూ ఓటు కూడా అదే స్థాయిలో కన్‌సాలిడేట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అప్పుడు మొత్తం రాష్ట్ర ఎన్నికల లెక్క పూర్తిగా మారిపోతుంది. అంటే.. పోలరైజేషన్ ఒకే సమాజానికి వీటో ఇవ్వదు. అది రెండువైపులా పదునున్న కత్తిలా పనిచేస్తుంది.ఇది కచ్చితంగా ప్రతి ప్రధాన ఆటగాడికి లాభం చేకూరుస్తుంది.
టీఎంసీ ముస్లిం ఓటు మా వెంట ఉంది. మేం సెక్యులరిజం కాపలాదారు అని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.కరెప్షన్, గవర్నెన్స్, స్థానిక అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కమ్యూనల్ థ్రెట్ లో కవర్ చేసుకోవచ్చు. ఇక బీజేపీ అయితే.. ముస్లిం బ్లాక్ ఓటు అంటూ హిందూ ఓటును మరింత కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది వీటో భయం, అపరాధ భావనను కలగలిపి పోలరైజేషన్ ను మరింత పెంచుతుంది. ఇక ఐఎస్ఎఫ్ వంటివి ముస్లిం ఓటు మాచేతిలో ఉందంటూ పొలిటికల్ టెజిటమసీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంటే, డేటా చెప్పేది ఒకటి, రాజకీయ కథనం చెప్పేది మరోటి అన్న మాట. అంతిమంగా తేలేదేంటంటే.. పశ్చిమ బెంగాల్ లో హెడ్ స్టార్ట్ ఉంది, వీటో లేదు. డేటా, మ్యాప్, జిల్లాల వారీ శాతం, సీటు వారీ మార్జిన్ అన్నీ కలిపి చూసినా అదే తేలుతుంది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ముస్లిం ఓటు ఒక పార్టీకి స్పష్టమైన హెడ్ స్టార్ట్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 294 సీట్లలో, ముస్లిం ఓటు 80–120 సీట్లను స్వతంత్రంగా నిర్ణయించే స్థాయి శక్తి కలిగి లేదు. వాస్తవ ఎన్నికల ఫలితాలు తేలేది.. మిక్స్‌డ్ బెల్ట్‌లలో, అలాగే.. చిన్న మార్జిన్ సీట్లలో. ఓటర్ లిస్ట్ మార్పులు, టర్నౌట్, లోకల్ ఇష్యూల కలయికలో.
పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికలో జిల్లాల వారీ డెమోగ్రఫీ, సీటు వారీ మార్జిన్, ఓటర్ లిస్ట్ మార్పులు, పోలరైజేషన్ రెండు వైపులా ఎలా పనిచేస్తుందో చూడాలి. అప్పుడు మాత్రమే, ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్న కంటే, ఎలా గెలుస్తారు? అనే లోతైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
సేకరణ, సంకలనం : సీతారాం కంఠంనేని
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా నిరాశాజనకంగా ఉందని, ఆ ప్రసంగంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఒక అధికారిక ప్రసంగాన్ని మోదీ రాజకీయ ప్రసంగంగా మార్చేశారని.. ప్రత్యర్థులపై బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాటలు ఉన్నాయని ఖర్గే దుమ్మెత్తిపోశారు.
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి నిజంగా ఉంటే, 2023లోనే ఆమోదం పొందిన చట్టాన్ని ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దాన్ని నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం మహిళా లోకాన్ని మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని తన ప్రసంగంలో మహిళల సంక్షేమం గురించి కాకుండా, కాంగ్రెస్ ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారన్న ఖర్గే.. మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 59 సార్లు ప్రస్తావించారని చెప్పారు. మహిళల గురించి మాట్లాడింది చాలా తక్కువ అని చెప్పారు. దీన్ని బట్టి ప్రధానికి మహిళల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని అవగతమౌతోందన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ విపక్షాలపై ప్రధాని విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖర్గే పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి ప్రచారం చేయడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూసిందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఆయన హీరోగా విఘ్నేష్ రాజా (Vignesh Raja) దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటించాల్సి ఉందని ఆ మధ్య వార్తలు బలంగా వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా దర్శకుడు విఘ్నేష్ రాజా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పృథ్వీరాజ్ నో చెప్పడానికి కారణం?
'కర' సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తాను సంప్రదించిన మాట వాస్తవమేనని దర్శకుడు విఘ్నేష్ రాజా తెలిపారు. అయితే అది హీరో పాత్ర కోసం కాదని, ఇందులోని మరో కీలక పాత్ర కోసమని స్పష్టం చేశారు.
"నా గత చిత్రం 'పొర్ తమిళ్' చూసిన తర్వాత పృథ్వీరాజ్ నన్ను అభినందించారు. ఆ పరిచయంతోనే 'కర' స్క్రిప్ట్‌లోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయన్ని కలిశాను. కథ విన్న పృథ్వీరాజ్, కంటెంట్ చాలా బాగుందని, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెచ్చుకున్నారు. కానీ, ఆ పాత్ర రెండు విభిన్న కోణాల్లో సాగుతుందని, అది తనకు సెట్ కాదని భావించి సున్నితంగా తిరస్కరించారు" అని విఘ్నేష్ వివరించారు.
పాత్రలో మార్పులు.. సూరజ్ ఎంట్రీ:
పృథ్వీరాజ్ మాత్రమే కాకుండా, మరికొందరు నటులు కూడా అదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో విఘ్నేష్ రాజా ఆ పాత్రపై తిరిగి కసరత్తు చేశారు. క్యారెక్టరైజేషన్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడును సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రంలో సూరజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. 1991 నాటి నేపథ్యంతో సాగే ఈ కథలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ధనుష్ మార్క్ యాక్షన్, విఘ్నేష్ రాజా మేకింగ్ స్టైల్ తోడవ్వడంతో 'కర'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఏప్రిల్ 30న తెలుగులోనూ విడుదల కానుంది.
కేరళ ముఖ్యమంత్రిపై లైంగిక ఆరోపణలు వస్తే? దాని వెనుక ఉన్న నిజానిజాలను బయటపెట్టడానికి సీఎం కొడుకు రంగంలోకి దిగితే? ఇదే పాయింట్ తో మలయాళంలో ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. అదే 'ప్రతిఛాయ' (Prathichaya).
మలయాళ హీరో, 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ తెలుగు ప్రేక్షకులను కూడా సుపరిచితమే. గతేడాది 'సర్వం మాయ' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'బేబీ గర్ల్'తో ప్రేక్షకులను పలకరించిన నివిన్.. మార్చి 26న 'ప్రతిఛాయ' అనే సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు.
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్, పొలిటికల్ థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అక్కడి కథల్లో ఉండే వాస్తవికత, ఉత్కంఠభరితమైన మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'ప్రతిఛాయ' కూడా అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో వచ్చింది.
కేరళ ముఖ్యమంత్రి వర్గీస్(బాలచంద్ర మీనన్) నిజాయితీగల నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ యువ నాయకుడిగా గుర్తింపు సంపాదిస్తాడు. మరో కొడుకు జాన్ (నివిన్ పౌలీ) మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే సీఎం వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. దీని వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో తెలిసిన నిజాలేంటి? ఆసక్తి లేకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.
అధికారం కోసం ఎవరైనా ఎంతటి స్థాయికైనా దిగజారుతారనే అంశాన్ని దర్శకుడు ఉన్నికృష్ణన్ సహజంగా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆవిష్కరించాడు. అయితే ఈ తరహా కథలు ఇప్పటికే చాలా రావడంతో 'ప్రతిఛాయ' సినిమాకి థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించలేదు. అందుకే నాలుగు వారాలకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
'ప్రతిఛాయ' ఓటీటీ రైట్స్ ను జియో హాట్‌స్టార్ (Jio Hotstar) కైవసం చేసుకుంది. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో వచ్చే అవకాశముంది. పొలిటికల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.
టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్‌ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జగర్లమూడి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను కేంద్రీకరించి, వాలీబాల్ క్రీడలోని తీవ్ర పోటీ, భావోద్వేగాలు, మానవ సంబంధాల్ని ప్రతిబింబిస్తుంది.
ఈ చిత్రంతో రోనిత్ జీఆర్‌జీ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇదే చిత్రంతో పరిచయం కాబోతున్న నిపుణ్ సత్య, ఓ కీలక పాత్రను చేస్తున్నాడు. అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తోంది. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వరణాసి, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలను దిలీప్ కె. మనుకొండ, పవన్ కె. విప్పర్తి సంయుక్తంగా రచించారు.
ఔరానోవా స్టూడియోస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అరుణ్ విజేకే , ఎడిటర్ గా రవితేజ గిరిజాల వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ మరియు పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
టైటిల్ రివీల్‌తో పాటు మోషన్ పోస్టర్‌కు లభిస్తున్న మంచి స్పందనతో ‘వాలీ’ శక్తివంతమైన స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు శనివారం సాయంత్రం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరిగిందని అధికారికంగా తెలియడంతో.. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు రెట్టింపు ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే మళ్ళీ ప్రజా సేవలోకి రావాలని ఆశిస్తున్నాను" అని తారక్ రాసుకొచ్చారు.
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. పలు ఈవెంట్స్ లో ఇద్దరూ కలిసి సందడి చేశారు. ఒకరి సినిమా కార్యక్రమాల్లో మరొకరు పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ తాజా ట్వీట్ వీరి మధ్య బాండింగ్ ను తెలియజేస్తోంది.
https://x.com/tarak9999/status/2045748836812132483
హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'మహావతార్ నరసింహ' అనే యానిమేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు గ్రాస్ రాబట్టి సత్తా చాటింది.
'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా వస్తున్న తదుపరి చిత్రం "మహావతార్ పరశురామ్" (Mahavatar Parshuram). పరశురామ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
పౌరాణిక గాథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి కథాంశంతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ క్రమంలోనే "మహావతార్ పరశురామ్" సినిమాపై అందరి దృష్టి పడింది. "ధర్మం క్షీణించినప్పుడు.. పరశు(యుద్ధ గొడ్డలి) ఉదయిస్తుంది" అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యంత శక్తివంతంగా ఉంది. ఇందులో పరశురాముడు చేతిలో గొడ్డలి పట్టుకుని యుద్ధభూమిలో శత్రు సంహారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గొడ్డలి నుండి రక్తం కారుతుండటం, చుట్టూ సైన్యం ఉండటం చూస్తుంటే.. ఇది కేవలం పౌరాణిక సినిమా మాత్రమే కాకుండా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. పరశురాముడు కేవలం ఒక ముని మాత్రమే కాదు, అధర్మాన్ని ఎదిరించే ఒక మహాశక్తి అని పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్ 2027లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
యానిమేషన్ ఫార్మాట్ లో పరశురాముడి వీరగాథను వెండితెరపై చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, అశ్విన్ కుమార్ మేకింగ్ స్టైల్ తోడైతే "మహావతార్ పరశురామ్" బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా, మంచి విద్యార్థులుగా, మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే చిన్న మార్పులు పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మాట్లాడటం..
నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ప్రశ్నలకు సమాధానాలు..
పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ టైం..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం. పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి.
ఎంకరేజ్..
ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
తమ పని తాము చేసుకోవడం..
పిల్లలకు వారి బ్యాగ్ వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం.
పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.
*రూపశ్రీ.
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ జబ్బు గురించి, ఈ జబ్బు లక్షణాల గురించి, ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే..
హీమోఫిలియా లక్షణాలు..
గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం, కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు.
ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం.
థీమ్ ఇదే..
వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స, సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం.
హీమోఫిలియా..
శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది. రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి, నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి.
ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.
*రూపశ్రీ.
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు. అయితే అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల బంధం బాగుంటుంది. ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది. అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
మద్దతు..
అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు. అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే.. ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు.
గౌరవం, మర్యాద..
అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే, గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా, నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది.
బాధ్యత..
ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది. ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి, బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట.
ప్రేమ, అనుబంధం..
అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది, తెలియకుండానే కోడలి పట్ల ఆమెకు చాలా ఇష్టం ఏర్పడుతుంది.
మనసు విప్పి మాట్లాడటం..
ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.
*రూపశ్రీ.
అజరుద్దీన్ మంత్రి పదవి.. అంతే సంగతులా? ఆయన ఎమ్మెల్సీ కాక పోవడంతో మరో నెల రోజుల్లో తన మంత్రి పదవిని కోల్పోవల్సి వస్తుందా? అజర్ భవితవ్యం ఏంటి? ఒక వేళ ఆయన మంత్రిత్వం కాపాడలేక పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని పరిశీలిస్తే ఆయనకా గండం ఉందనే చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం, ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆరు నెలల లోపు అసెంబ్లీకో, మండలికో ఎన్నికవ్వాలి. అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఈ నెలాఖరు లోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
అజర్ ఎమ్మెల్సీ ఎందుకు కాలేకపోయారు? ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది.
ఒక వేళ ఈ ప్రయత్నాలు వర్కవుట్ కాకుంటే అజర్ మంత్రి పదవి పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో అజారుద్దీన్ ఏకైక ముస్లిం మంత్రి. అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఆయన్ను క్యాబినేట్ లోకి తీసుకున్నారు. ఒక వేళ అజారుద్దీన్ మంత్రి పదవిని రేవంత్ నిలపలేకపోతే.. అదంతా ఆ టైంలో అంటూ జూబ్లీ ఉపఎన్నికలో అవసరానికి మైనార్టీ ఓట్ల కోసం వేసిన ఎరగా వారు భావించే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు రెండేళ్ల వరకు మంత్రిమండలిలో మైనార్టీ ప్రాతినిధ్యం లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. దాన్ని పూడ్చడానికే ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్‌ను మంత్రిని చేశారు.
ఇప్పుడు ఆయన పదవి కోల్పోతే, అది కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు విషయంలో రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎలాగైనా ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతానికి అజర్ భవితవ్యం గవర్నర్ నిర్ణయం, న్యాయపరమైన అంశాల చేతుల్లో ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు వీలు కాకపోతే, ఆయన రాజీనామా చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ గతంలో హరికృష్ణ విషయంలో జరిగినట్లుగా, ఒకసారి పదవి పోతే తిరిగి రావడం అంత సులభం కాకపోవచ్చు. మొత్తానికి, ఏప్రిల్ 30వ తేదీ అజారుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్‌లో ఒక క్రూషియల్ పీరియడ్ లాంటిది. ఆయన ఈ గడువును దాటుతారా లేదా? అనేది వచ్చే కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఎక్కువ విశ్లేషణలు ఒకే వాక్యంతో మొదలవుతాయి.. అదేమిటంటే, ముస్లిం ఓటు కన్‌సాలిడేషన్. అంటే, మైనారిటీ ఓటు 294 సీట్లలో 80–120 సీట్ల భవిష్యత్తు నిర్ణయిస్తుందనే వాదన. అయితే.. జనాభా గణాంకాలు, జిల్లా వారీ మ్యాప్ లు, గత ఎన్నికల మార్జిన్లు చూసినప్పుడు, ఈ కథనం అతిశయోక్తిగా కనిపిస్తుంది. వాస్తవంగా పశ్చిమ బెంగాల్ లో ముస్లింల జనాభా 27 అయినప్పటికీ.. 3 జిల్లాల్లోనే వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.
2011 జనగణన ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా 27శాతం. రాష్ట్రంలోని మొత్తం జిల్లాల్లో వారి జనాభా మెజారిటీగా ఉన్నది మూడు జిల్లాల్లోనే. అవి ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్ పూర్. వీటిలో ముర్షిదాబాద్ లో ముస్లింల జనాభా 66శాతంగా ఉంది. ఇక మాల్డా జిల్లాలో 51శాతం, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో 50శాతంగా ఉంది.
మిగతా 20 జిల్లాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ, 251 అసెంబ్లీ సీట్లలో.. స్పష్టంగా హిందువుల మెజారిటీ ఉంది. అంటే, రాష్ట్ర స్థాయిలో ముస్లింల జనాభా 27శాతం ఉన్నప్పటికీ.. భౌగోళికంగా అది కొన్ని బెల్ట్‌లలో కేంద్రీకృతమై ఉంది, మిగతా చోట్ల విస్తరించి, లేదా చీలిపోయిన రూపంలో ఉంది.
80 సీట్లు ముస్లిం నిర్ణయిస్తారు అన్న గణితం ఎక్కడ తప్పిందంటే.. ఏ జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం దాటితే.. ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను ముస్లిం ప్రభావిత సీట్లు గా లెక్కించడం. అలా లెక్కించడం వల్లే. ఇలా లెక్కిస్తే.. రాష్టరంలో 80కి పైగా సీట్లలో జయాపజయాలను ముస్లిం ఓటర్లు నిర్ణయిస్తారు.ఇదే.. ముస్లిం వీటో కథనానికి బేస్.
అయితే సమస్య ఎక్కడంటే.. అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్–పాస్ట్–ది–పోస్ట్ (ఎఫ్పిటీపీ) వ్యవస్థలో జరుగుతాయి. అంటే జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం ఉన్న.. ప్రతి నియోజకవర్గంలోనూ అదే స్థాయి కన్‌సాలిడేషన్ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా స్వతంత్రంగా నిర్ణయించే స్థాయి ప్రభావం రావాలంటే.. ఒక సీటులో ముస్లిం ఓటు శాతం సాధారణంగా 38 నుంచి 40 శాతం ఉండాలి. అప్పుడు మాత్రమే ఒకే బ్లాక్‌గా ఓటేస్తే, ఫలితాన్ని తిప్పే శక్తి వస్తుంది. అంటే, జిల్లా స్థాయి శాతాన్ని నేరుగా సీటు స్థాయి ప్రభావంగా గణించడం సరికాదు. .
జిల్లాల వారీగా ముస్లిం డిసెసివ్ సీట్లు ఏంటని చూస్తే.. ముర్షిదాబాద్ జిల్లాలో 22 స్థానాలు. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 66శాతం. ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉన్న సీట్లు 20. అలాగే మాల్డా జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ ముస్లిం జనాభా 51శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 12. ముస్లిం ఓటు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు 8. ఇక నార్త్ దినాజ్ పూర్ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 50శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 9. వీటిలో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు ఐదు.
అలాగే బీర్భూమ్. దక్షిణ 24 పరగణాలు, నదియా. ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో ముస్లిం కన్సాలిడేషన్ 38 నుంచి 40 శాతం వరకూ ఉంటుంది.
అవేంటని చూస్తే.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 33 సీట్లలో 5 నుంచి ఏడు స్థానాలలో, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని 31 స్థానాలలో 4 నుంచి 6 సీట్లలో ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉంటుంది. మొత్తంగా ఈ జిల్లాలన్నీ కలిపి చూసినా ముస్లిం ఓటు నిర్మాణాత్మకంగా ఉండే సీట్లు 47 నుంచి 54కు మించవు. అంటే రాష్ట్రంలోని మొదత్తం 294 నియోజకవర్గాలలో కేవలం 16 నుంచి 18 శాతం సీట్లలో మాత్రమే ముస్లిం వీటో కాదుకాదు హెడ్ స్టార్ట్ ఉంటుందన్న మాట.
ఇక్కడ ఒక తేడా ఉంది.. అదేంటంటే.. ఒక పార్టీకి ఒక కమ్యూనిటీ నుంచి భారీ కన్‌సాలిడేషన్ వస్తే, ఆ పార్టీకి ఆ సీట్లలో స్పష్టమైన ఆధిక్యం ఉంటుంది. అదే ఏ సీటులోనైనా ఏ కాంబినేషన్ వచ్చినా ఒక కమ్యూనిటీ అంగీకరించని పరిస్థితి ఉంటే ఎవరూ గెలవలేని స్థాయి ప్రభావం.. ఇదే వీటో. బెంగాల్ లో ముస్లిం ఓటు కొన్ని బెల్ట్‌లలో హెడ్ స్టార్ట్ ఇస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వీటో శక్తి ఇవ్వదు. ఇకపోతే వేస్టెడ్ ఓటు సమస్య ఒకటి ఉంది. దీని వల్ల భారీ మెజారిటీలు వస్తాయి కానీ రాజకీయంగా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు భగబంగోలా సీటులో తృణమూల్ కాంగ్రెస్ కు లక్షా ఆరు వేల మెజారిటీ వచ్చింది. అలాగే సుజాపూర్ లో లక్షా ముఫ్పై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది.
ఎఫ్పిటీపీ వ్యవస్థలో.. గెలవడానికి అవసరమైనది ఒక ఓటు ఎక్కువ మాత్రమే. దాని మించి వచ్చిన ఓట్లన్నీ సర్‌ప్లస్ మాత్రమే. అవేమీ ప్రాతినిథ్యాన్ని, ప్రతినిధిత్వాన్ని పెంచవు. అంటే, ముస్లిం ఓటు భారీగా కన్‌సాలిడేట్ అయిన సీట్లలో.. TMC వంటి పార్టీలు అత్యధిక మెజారిటీలతో గెలుస్తాయి. అంతే.. కానీ ఆ అదనపు లక్షల ఓట్లు ఇతర సీట్లలోకి బదిలీ అవ్వవు. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు, ఇది ఒక స్ట్రక్చరల్ వేస్ట్ అంతే.
ఇదే సమయంలో TMCకి అత్యంత కీలకమైన 13 సీట్లలో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ మూడు వేల ఓట్ల కంటే తక్కువే. ఇవేవీ ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు కావు. అంటే.. ఎలక్షన్‌ను తిప్పిన సీట్లు ముస్లిం బెల్ట్‌లో కాకుండా, మిక్స్‌డ్ లేదా హిందూడామినేటెడ్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
2021లో నిజంగా ఎక్కడ ఎన్నిక తేలింది? అంటే.. హౌరా, హూగ్లీ, మటువా బెల్ట్ లో ఇక్కడ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఇక్కడే రేజర్ థిన్ మార్చిన్లు వచ్చాయి. మొత్తం 7 జిల్లాల్లో టీఎమ్సీ 50,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది, మిగతా అన్ని సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. అంటే.. ఎలక్షన్ లెక్క మేరకు ముస్లిం బెల్ట్‌లో భారీ మెజారిటీలు సురక్షిత సీట్లు. కానీ వేస్ట్‌డ్ ఓట్లు. మిక్స్‌డ్ అండ్ హిందూ డామినెంట్ బెల్ట్‌లో చిన్న మార్జిన్లు. ఇవే అసలైన డిసెసివ్ బ్యాటిల్‌గ్రౌండ్స్.
91 లక్షల డిలీషన్, సీటుకు 31,000 ఓట్లు: 2026లో కొత్త ఫ్యాక్టర్
ఇక మరో కీలక అంశం ఏమిటంటే.. ఓట్ల తొలగింపు. వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది? ఏ సామాజిక సమూహం, ఏ పార్టీ సపోర్ట్ బేస్ ఎక్కువగా ప్రభావితమైంది? అన్నదే ఇప్పుడు 2026 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.
ముస్లిం కన్‌సాలిడేషన్ కంటే, ఓటర్ లిస్ట్‌లోని మార్పులు, మిక్స్‌డ్ బెల్ట్‌లలోని చిన్న మార్జిన్‌లు 2026లో ఎక్కువగా డిసెసివ్ అయ్యే అవకాశం ఉంది. ముస్లిం ఓటు వంద శాతం దగ్గరగా కన్‌సాలిడేట్ అయితే.. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ఒక పార్టీకి 50 నుంచి 60 సీట్లు సేఫ్ అవుతాయి. అదే సమయంలో మిగతా 234 సీట్లలో.. హిందూ ఓటు కూడా అదే స్థాయిలో కన్‌సాలిడేట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అప్పుడు మొత్తం రాష్ట్ర ఎన్నికల లెక్క పూర్తిగా మారిపోతుంది. అంటే.. పోలరైజేషన్ ఒకే సమాజానికి వీటో ఇవ్వదు. అది రెండువైపులా పదునున్న కత్తిలా పనిచేస్తుంది.ఇది కచ్చితంగా ప్రతి ప్రధాన ఆటగాడికి లాభం చేకూరుస్తుంది.
టీఎంసీ ముస్లిం ఓటు మా వెంట ఉంది. మేం సెక్యులరిజం కాపలాదారు అని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.కరెప్షన్, గవర్నెన్స్, స్థానిక అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కమ్యూనల్ థ్రెట్ లో కవర్ చేసుకోవచ్చు. ఇక బీజేపీ అయితే.. ముస్లిం బ్లాక్ ఓటు అంటూ హిందూ ఓటును మరింత కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది వీటో భయం, అపరాధ భావనను కలగలిపి పోలరైజేషన్ ను మరింత పెంచుతుంది. ఇక ఐఎస్ఎఫ్ వంటివి ముస్లిం ఓటు మాచేతిలో ఉందంటూ పొలిటికల్ టెజిటమసీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంటే, డేటా చెప్పేది ఒకటి, రాజకీయ కథనం చెప్పేది మరోటి అన్న మాట. అంతిమంగా తేలేదేంటంటే.. పశ్చిమ బెంగాల్ లో హెడ్ స్టార్ట్ ఉంది, వీటో లేదు. డేటా, మ్యాప్, జిల్లాల వారీ శాతం, సీటు వారీ మార్జిన్ అన్నీ కలిపి చూసినా అదే తేలుతుంది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ముస్లిం ఓటు ఒక పార్టీకి స్పష్టమైన హెడ్ స్టార్ట్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 294 సీట్లలో, ముస్లిం ఓటు 80–120 సీట్లను స్వతంత్రంగా నిర్ణయించే స్థాయి శక్తి కలిగి లేదు. వాస్తవ ఎన్నికల ఫలితాలు తేలేది.. మిక్స్‌డ్ బెల్ట్‌లలో, అలాగే.. చిన్న మార్జిన్ సీట్లలో. ఓటర్ లిస్ట్ మార్పులు, టర్నౌట్, లోకల్ ఇష్యూల కలయికలో.
పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికలో జిల్లాల వారీ డెమోగ్రఫీ, సీటు వారీ మార్జిన్, ఓటర్ లిస్ట్ మార్పులు, పోలరైజేషన్ రెండు వైపులా ఎలా పనిచేస్తుందో చూడాలి. అప్పుడు మాత్రమే, ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్న కంటే, ఎలా గెలుస్తారు? అనే లోతైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
సేకరణ, సంకలనం : సీతారాం కంఠంనేని
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా నిరాశాజనకంగా ఉందని, ఆ ప్రసంగంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఒక అధికారిక ప్రసంగాన్ని మోదీ రాజకీయ ప్రసంగంగా మార్చేశారని.. ప్రత్యర్థులపై బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాటలు ఉన్నాయని ఖర్గే దుమ్మెత్తిపోశారు.
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి నిజంగా ఉంటే, 2023లోనే ఆమోదం పొందిన చట్టాన్ని ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దాన్ని నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం మహిళా లోకాన్ని మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాని తన ప్రసంగంలో మహిళల సంక్షేమం గురించి కాకుండా, కాంగ్రెస్ ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారన్న ఖర్గే.. మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 59 సార్లు ప్రస్తావించారని చెప్పారు. మహిళల గురించి మాట్లాడింది చాలా తక్కువ అని చెప్పారు. దీన్ని బట్టి ప్రధానికి మహిళల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని అవగతమౌతోందన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ విపక్షాలపై ప్రధాని విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖర్గే పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి ప్రచారం చేయడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూసిందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు, ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట. ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..
సిట్రస్ ఫ్రూట్స్..
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది. ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పైనాపిల్..
పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు, పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు.
జామకాయ..
జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట. ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది.
సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్..
సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
బొప్పాయి..
బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు.
నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు..
నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ, బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.
*రూపశ్రీ.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు.
ఈ వీడియోలోని ముఖ్య అంశాలు:
తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి?
నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి?
పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు.
నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి?
మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి.
మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నేటికాలంలో బాగా కారంగా ఉన్న ఆహారం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండు మిరపకాయల చట్నీ మొదలుకొని, ఆహారంలో కారం బాగా ఎక్కువ వేసుకుని తిడం చాలా మందికి ఇష్టంగా ఉంటోంది దాని రుచి వారికి బాగా నచ్చిందని చెబుతూ ఉంటారు. కారం తినడం చాలా గొప్ప అని చెప్పుకుంటూ కూడా ఉంటారు. కానీ నిజానికి కారం ఎక్కువ తినడం గొప్ప అనడానికి బదులుగా.. దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించమంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో సమస్యలు మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాల పై కూడా చాలా ప్రబావం చూపిస్తుందని అంటున్నారు.
గుండెల్లో మంట, ఎసిడిటీ..
కారం ఎక్కువ తినడం అంటే కేవలం కారం ఎక్కువ తినడం కాదు.. అందులో మసాలాలు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే.. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, త్రేనుపులు , గ్యాస్ రావచ్చు. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తినడం వల్ల ఎసిడిటీ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జీర్ణవ్యవస్థ..
అతిగా మసాలా, కారం ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. దీనివల్ల పేగుల్లో చికాకు, అజీర్ణం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా కలగవచ్చు. ఇప్పటికే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు.
నోరు, గొంతు సమస్యలు..
అతిగా మసాలా ఉండే ఆహారాలు నాలుక, చిగుళ్ళు , గొంతు లోపలి పొరను చికాకు పెడతాయి. దీనివల్ల చికాకు, బొబ్బలు , పుండ్లు, వాపు రావచ్చు. ఈ ఆహారాలను ఎప్పుడూ తీసుకోవడం వల్ల టేస్ట్ బడ్స్ బలహీనపడతాయి.
అల్సర్ల ప్రమాదం..
క్రమం తప్పకుండా మసాలా, ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతిని, గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాంతులు, , కొన్నిసార్లు రక్తస్రావం కూడా ఉండవచ్చు, ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది.
చర్మ సమస్యలు..
మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర వేడి పెరిగి, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు ఎరుపుదనం ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సర్వసాధారణం.
పైల్స్..
మసాలా పదార్థాలు తినడం వల్ల మలవిసర్జన సమయంలో మంట , నొప్పి పెరగవచ్చు. దీనివల్ల పాయువులో వాపు వచ్చి, మొలలు మరింత తీవ్రమవుతాయి. ముందు నుంచే మొలలు ఉన్న రోగులు ముఖ్యంగా మసాలా, కారం పదార్థాలకు దూరంగా ఉండాలి.
నిద్ర..
రాత్రిపూట మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, చికాకు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. తరచుగా మెలకువలు రావచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
మసాలా ఆహారాలు తినకూడదా?
మసాలా ఆహారం మంచిదే, కానీ దాని పరిమాణం పరిమితంగా ఉండాలి. సమతుల్య ఆహారం పాటించడం ద్వారా మాత్రమే కడుపు, చర్మం , మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.