కొబ్బరినూనెలో ఇవి రెండూ కలిపి తలకు రాస్తే చాలు.. మొండి చుండ్రు కూడా మటుమాయం!
జుట్టుకు సంబంధించిన సమస్యలలో చుండ్రు చాలా సాధారణమైన విషయం. తేలికపాటి చుండ్రు సమస్య ఉంటే అది పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కానీ చుండ్రు సమస్య ఎక్కువ ఉంటే మాత్రం అది అనుభవించేవారికి నరకాన్ని పరిచయం చేస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చుండ్రు కారణంగా జుట్టు బలహీనంగా మారడం, కాంతి కోల్పోవడం, రాలిపోవడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే కొబ్బరినూనెలో కేవలం రెండు పదార్థాలు కలిపి రాస్తే చాలు. మొండి చుండ్రు కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, ఉపయోగించే తీరు పూర్తీగా తెలుసుకుంటే..
చుండ్రు తగ్గించుకోవడానికి తలకు కర్పూరం, నిమ్మకాయ నూనె తయారుచేసుకోవాలి. దీన్ని వారంలో మూడు సార్లు ఉపయోగించాలి. ఈ నూనె తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే..
భీమసేని కర్పూరం..2,3
నిమ్మకాయ.. సగం
కొబ్బరినూనె.. ఒక కప్పు
మొదట భీమసేని కర్పూరాన్ని బాగా పొడిగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సగం నిమ్మకాయను పిండి రసం తీసి ఆ రసాన్ని కలపాలి. దీంట్లో వేడిచేసిన కొబ్బరినూనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారంలో మూడుసార్లు దీన్ని తలకు పట్టించి తలస్నానం చేస్తుంటే తలలో చుండ్రు చాలా సులువుగా తగ్గిపోతుంది. ఈ నూనెను ఎక్కువగా కాకుండా కొద్దిమొత్తంలో తయారుచేసుకుని అప్పటికప్పుడు వాడుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ నూనె ఎలా పనిచేస్తుందంటే..
వాస్తవానికి భీమసేని కర్పూరం యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగస్ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే స్కాల్ప్ కు చల్లదనాన్ని అందించడం ద్వారా చికాకును తగ్గించడంలో సహాయపడతుంది. దీన్ని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు కుదుళ్లను తెరవడంలో సహాయపడుతుంది, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే నిమ్మరసం దాని ఆమ్ల గుణాల కారణంగా జుట్టు pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి ఇది తయారు చేయడం సులభం, వాడటం కూడా సులువు మాత్రమే కాకుండా ప్రభావవంతంగా ఉంటుంది.
*నిశ్శబ్ద.