టీట్రీ ఆయిల్ వాడితే చర్మం మెరుస్తుందా...

టీట్రీ ఆయిల్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీన్ని చాలా రకాల బ్యూటీ ఉత్పత్తులలో వాడుతుంటారు. సాధారణంగా చర్మ రక్షణలో ఎసెంటియల్ ఆయిల్స్ వాడకం ఉంటుంది. ఈ ఆయిల్స్ ను క్యారియర్ ఆయిల్స్ లో కొన్ని చుక్కలు మిక్స్ చేసి ముఖానికి రాస్తుంటారు. ఇవి మంచి సువాసనతో ఉండటమే కాకుండా చర్మాన్ని చాలా బాగా రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా మొటిమలు, స్కిన్ రాషెస్, చర్మ సంబంధ సమస్యలకు టీట్రీ ఆయిల్ బాగా పని చేస్తుందని చెబుతారు. అయితే టీట్రీ ఆయిల్ వాడటం వల్ల చర్మం మెరుస్తుందని కూడా అంటుంటారు. ఇందులో నిజాలెంతో తెలుసుకుంటే..
టీట్రీ ఆయిల్..
టీట్రీ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
ప్రయోజనాలు..
టీట్రీ ఆయిల్ లోని యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షమాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమల మీద టీట్రీ ఆయిల్ ను కొద్దిగా రాస్తుంటే మొటిమలు మెల్లిగా మాయం అవుతాయి. నెమ్మదిగా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
వాపు..
టీట్రీ ఆయిల్ లో ఉండే టెప్పినెన్-4-ఓల్, ఆల్ఫా-టెర్పినోల్ వంటివి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు. ఈ సమ్మేళనాలు ముఖం పై మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
సొరియాసిస్..
టీట్రీ ఆయిల్ లో టెర్సినెన్-4-ఓల్ సమ్మేళనం ఉంటుంది. ఇది మంట, చికాకు, సోరియాసిస్ నుండి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. దీనిని మూలికా పేస్ట్ లు, మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు..
టీట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
జిడ్డు చర్మానికి..
టీట్రీ ఆయిల్ జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు గొప్ప వరం అని చెప్పవచ్చు. ఇది చర్మం పై అదనపు నూనెను తగ్గిస్తుంది. తద్వారా జిడ్డు చర్మాన్ని బాలెన్స్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల దీనిని ఫేస్ వాష్ లు, ఆయిల్ స్కిన్ కోసం తయారు చేసే ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.
చర్మ వ్యాధులకు..
టీట్రీ ఆయిల్ లో యాంటీ ఎగ్జిమా లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, పొలుసులు, మంట వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మవ్యాధులు ఉన్న వారు వైద్యుల సలహాతో టీట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు.
*రూపశ్రీ.



