గోళ్లు అందంగా...పొడవుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

అందమైన వేళ్లు..వాటికి పొడవాటి గోళ్లు పెంచుకోవడం ప్రతి అమ్మాయి కల. వాటిని అందంగా కనిపించేలా నెయిల్ పాలిష్ లతో, నెయిల్ ఆర్ట్ వేసి...ఇంకా ఆకర్షణీయంగా రెడీ చేస్తారు. గోళ్లను పొడవుగా అందంగా పెంచండం ఒకరోజుల్లో అయ్యేది కాదు. వాటికోసం అతివలు..నెలల తరబడి శ్రమిస్తుంటారు. విరగకుండా జాగ్రత్త వహిస్తుంటారు. అయినా కూడా కాస్త పొడవు పెరిగిన తర్వాత విరిగిపోతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

స్టైలీష్ హెయిర్‌ కట్, గ్లోయింగ్ స్కిన్‌, ఎట్రాక్ట్ చేసే గోళ్లతో ఇలా అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.  జుట్టు సంరక్షణ, స్కిన్‌ కేర్ వీటి గురించి పక్కన పెడితే.. గోళ్లు పెంచడం అంత సులభం కాదు.  మనం రోజులో 90 శాతం పనులు చేతితోనే చేస్తుంటాం. ఈ సమయంలో గోళ్లు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి అమ్మయిలకు అందమైన పొడవాటి గోళ్ల కల నెలవేరడం ఎలా?గోళ్లు పెంచడం గొప్ప విషయమేమీ కాదనుకోండి. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే అందమైన గోళ్లు పెంచడం చాలా సులభం. ఈ టిప్స్ ఫాలో అయితే...అందంగా, బలంగా మారుతాయి.

ఉప్పునీరు:

గోర్లు పెరగడానికి ఉప్పునీరు వాడటం గురించి వినే ఉంటారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఉప్పు నీరు నేరుగా గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించదు కానీ అది మీ గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ గోళ్ల పెరుగుదలకు ఇది మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. ఉప్పు మీ గోళ్ల ఆరోగ్యానికి దోహదపడుతుంది, తద్వారా మీ గోర్లు నిరంతరం పెరగడానికి సహాయపడుతుంది.

ఒక గోరు నెలలో ఎన్ని అంగుళాలు పెరుగుతుంది?

వేలుగోళ్లు నెలకు 0.14 అంగుళాలు, కాలిగోళ్లు 0.063 అంగుళాలు పెరుగుతాయి. వేలుగోళ్లు పూర్తిగా తిరిగి పెరగడానికి 3 నుండి 6 నెలల సమయం పడుతుంది, అయితే గోళ్ళకు 12 నుండి 18 నెలల సమయం పడుతుంది. గోరు పెరుగుదల ఆహారం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. వయస్సు, లింగం, జన్యుపరమైన అంశాలు ఇందులో పాత్ర పోషిస్తాయి.

గోళ్లపై పసుపు రంగును ఎలా తొలగించాలి?

మీ గోళ్ళపై మరకలను వదిలించుకోవడానికి మీరు బేకింగ్ సోడా, నిమ్మరసంతో ఉప్పు నీటిని ఉపయోగించవచ్చు.

ఒక గిన్నెలో 1.5 కప్పుల వెచ్చని నీరు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా , 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. కొద్దిగా పేస్ట్ చేసి, మిశ్రమాన్ని మీ గోళ్లపై అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత మృదువైన బ్రష్‌తో మీ గోళ్లను సున్నితంగా స్క్రబ్ చేయండి.  మీ చేతులు, గోళ్లను నీటితో శుభ్రం చేసుకోండి.