అలోవెరా జెల్.. ముఖానికి మంచే కాదు..చెడు కూడా చేస్తుంది..!
అలోవెరా జెల్.. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది. తాజా కలబంద మొక్కల పెంపకానికి, మార్కెట్లో అమ్మే కలబంద జెల్ అమ్మకాలు పెరగడానికి సౌందర్య ప్రపంచం మూలకారణంగా ఉంది. అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనిపించడం కోసం చాలా మంది కలబంద జెల్ ను ఉపయోగిస్తుంటారు. కలబంద జెల్ లో ఉండే పోషకాలు, సమ్మేళనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం మీద మచ్చలు, మొటిమలు తొలగించి చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. అందుకే ఈ మధ్య అలోవెరా జెల్ కొనుగోళ్లు, వాడకం పెరిగాయి. అయితే కలబంద జెల్ చర్మానికి మంచే కాదు చెడు కూడా చేస్తుంది. దీని గురించి తెలుసుకుంటే..
కొంతమందికి అలోవెరా అంటే అలెర్జీ ఉంటుంది. కానీ మార్కెట్లో లభించే ఉత్పత్తులు చూసినప్పుడు వాటిని వాడాలని అనిపిస్తుంది. మరికొంతమంది ఇతరులను చూసి ఒక్కసారికి వాడదాం అని అనుకుంటారు. కానీ ఈ అలెర్జీ కారణంగా చర్మం పైన దద్దుర్లు, దురదలు, వాపులు లేదా బొబ్బలు కూడా వ్చచ్చే అవకాశం ఉంటుంది.
చర్మం రంగును మార్చడం కోసం చాలామంది అలోవెరా జెల్ వాడుతుంటారు. కానీ కొంతమందికి తెలియదు ఇది చర్మాన్ని, చర్మం రంగును నల్లగా మారుస్తుంది. ఇది చర్మం పిహెచ్ స్థాయిలను అసమతుల్యం చేస్తుంది.
కలబంధ జెల్ ను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఇది పొరపాటున కళ్లకు అంటినా, కళ్లలోో పడినా చాలా చికాకు, ఇబ్బంది కలిగిస్తుంది.
మార్కెట్లో లభించే అలోవెరా జెల్ లో చాలా రసాయనాలు ఉంటాయి. ఈ జెల్ ను అప్లై చేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమల సమస్య పెరుగుతుంది.
*రూపశ్రీ.
