సిజేరియన్ ప్రసవాన్ని ఎంచుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి..!

 

ప్రతి మహిళ గర్బం దాల్చడం,  ప్రసవించడం చాలా గొప్ప అనుభవం. వారికి ఒక కొత్త ప్రపంచాన్ని తెచ్చిపెడుతుంది ఈ దశ. అయితే ఈ రోజుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. నేటి మహిళలు త్వరగా సిజేరియన్ చేయించుకుని ప్రసవం చేసుకోవాలని కోరుకుంటున్నారు.  సాధారణ ప్రసవం శ్రమతో, నొప్పితో కూడుకున్నదని, అందుకే సిజేరియన్ చేయించుకోవడం మంచిదని అనుకునేవారు చాలా ఎక్కువ.  అయితే చాలామంది మహిళలకు తెలియని షాకింగ్ నిజాలను గైనకాలజిస్టులు తెలిపారు.  సిజేరియన్ బెస్ట్ అనుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలేంటో తెలుసుకుంటే..

గతంలో సాధారణ ప్రసవాలు ఎందుకు సమస్య లేకుండా జరిగాయి?

పాత కాలంలో మహిళలు ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారు. ఉదయం లేచిన తర్వాత ఇల్లు ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం, మెట్లు ఎక్కడం,  వంట చేయడం,  ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తినడం వంటివి జరిగేవి.   అప్పట్లో ఏది తిన్నా జీర్ణమయ్యేది. అందుకే బరువు పెరగలేదు.

ఇప్పట్లో బరువు పెరుగుదల..

ఇప్పటి కాలంలో మహిళలు కూడా నిశ్చలంగా ఉండే జీవనశైలిలో ఎక్కువ గడుపుతుంటారు. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు చూడటం, పుస్తకాలు చదవడం,  జంక్ ఫుడ్ లేదా చిప్స్ తినడం  చేస్తారు. శీతల పానీయాలు తాగడం కూడా సర్వసాధారణమైపోయింది. వీటికి తోడు వ్యాయామం లేకపోవడం కూడా బరువు పెరగడానకి దారి తీస్తుంది.

సమస్య ఇదే..

శారరీక వ్యాయామాన్ని జీవనశైలి లో భాగం చేసుకోకపోవడం వల్ల  బరువు పెరగడం జరుగుతోంది. దీని వల్ల రక్తపోటు,  , మధుమేహం,  థైరాయిడ్ సమస్యలు గతంలో కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా, గర్భం ధరించాక ప్రసవానికి దగ్గర పడే కొద్ది  మహిళలు మానసికంగా బలహీనంగా మారతారు.  అందుకే చాలా మంది మహిళలు ప్రసవానికి ముందు ధైర్యం కోల్పోయి సిజేరియన్ డెలివరీని ఎంచుకుంటారు.

మహిళల జీవనశైలి మారడం,  శారీరక శ్రమ లేకపోవడం సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. అందువల్ల, గర్భధారణ సమయంలో వీలైనంత చురుకుగా ఉండాలి.  శారీరకంగా చురుకుగా ఉండడం ద్వారా సి-సెక్షన్ కాకుండా సాధారణ డెలివరీ చాలా సులభంగా జరుగుతాయి.

                             *రూపశ్రీ.