మహిళల్లో అత్యంత ప్రాణాంతకర క్యాన్సర్ ఇదే.. దీని గురించి తప్పక తెలుసుకోవాలి!


ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  అన్ని రకాల క్యాన్సర్‌లతో ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తాయి.  గర్భాశయ క్యాన్సర్ అలాంటి తీవ్రమైన సమస్య.  2020లో గర్భాశయ క్యాన్సర్ 6.04 లక్షల కొత్త కేసులు,  3.42 లక్షల కంటే ఎక్కువ మరణాలు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్ .

ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే ఈ ఆరోగ్య   సమస్య గురించి ప్రజల్లో అవగాహన పెంచడం,  నివారణ, స్క్రీనింగ్,  చికిత్స గురించి మహిళలకు అవగాహన కల్పించే లక్ష్యంతో జనవరి నెలను 'సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ నెల'గా జరుపుకుంటారు.

సర్వైకల్ క్యాన్సర్..

సర్వైకల్ క్యాన్సర్  గర్భాశయంలో వచ్చే క్యాన్సర్. ఇది యోనితో అనుసంధానించబడిన గర్భాశయం యొక్క దిగువ భాగం. ఈ క్యాన్సర్ తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.  దీని లక్షణాలను గుర్తించడం కష్టం. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్  రావడానికి  అత్యధిక  కారణమవుతుంది. HPV అనేది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక సాధారణ అంటువ్యాది. శరీరం  రోగనిరోధక వ్యవస్థ HPV వైరస్‌ను నాశనం చేయగలిగినప్పటికీ తక్కువ శాతం మంది వ్యక్తులలో వైరస్ సంవత్సరాలు శరీరంలోనే ఉండి క్యాన్సర్‌కు కారణమవుతుంది.

గర్భాశయ క్యాన్సర్  లక్షణాలు..

సాధారణంగా గర్భాశయ క్యాన్సర్  ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు, అందుకే దాని ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి, వీటి గురించి  శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.

సంభోగం తర్వాత లేదా పీరియడ్స్ లేకపోయినా, లేదా  మెనోపాజ్ తర్వాత యోనిలో రక్తస్రావం.

భారీ ఋతు రక్తస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ కాలం ఉండటం.

యోని ద్వారం దుర్వాసన.

సంభోగం సమయంలో పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి.

ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుంది?

ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని పరిస్థితులు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

 ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నా. లైంగిక భాగస్వాములు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది కాకుండా చిన్న వయస్సులో సెక్స్ చేయడం కూడా HPV ప్రమాదాన్ని పెంచుతుంది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు) కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  రోగనిరోధక వ్యవస్థ మరొక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బలహీనపడి  HPV ఇన్ఫెక్షన్ వస్తే గర్భాశయ క్యాన్సర్‌ కు గురయ్యే అవకాశం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం చేసే  మహిళలకు HPV ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉండచ్చు.

గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించాలి?

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం HPV వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. HPV సంక్రమణను నివారించడానికి టీకాలు వేయడం గర్భాశయ క్యాన్సర్,  ఇతర HPV సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. HPV వ్యాక్సిన్  సరైనదా, కాదా అని  వైద్యుడిని అడగి తీసుకోవాలి.  ఇది కాకుండా డాక్టర్ సలహాపై రెగ్యులర్  పరీక్ష చేయించుకోవాలి. పాప్ పరీక్ష గర్భాశయంలో క్యాన్సర్ పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది.

                                                       *నిశ్శబ్ద.