ఈ ఈజీ ట్రిక్స్ నేర్చుకుంటే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లను తలదన్నేలా రెఢీ అవ్వచ్చు..
అందంగా కనిపించడం అమ్మాయిల టార్గెట్. అందానికి ప్రతిరూపంగా అమ్మాయిలను పోల్చడం, పువ్వులతో సమానంగా అమ్మాయిలను ప్రస్తావించడం చూస్తుంటాం. ఇదంతా అందం మహిమే.. అయితే చాలామంది అందంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అనే ఆలోచనలో ఉంటారు. దీనికి తగినట్టే ఏ చిన్న ఈవెంట్ .. ఏ చిన్న పార్టీ ఉన్నా పార్లర్ కు వెళ్ళి వందలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని ఈజీ ట్రిక్స్ ఫాలో అయితే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లు చేసిన మేకప్ కూడా చిన్నబోతుంది. మేకప్ ను ఇష్టపడే ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన ఆ ట్రిక్స్ ఏంటంటే..
ఐ షాడో..
అమ్మాయిలను చూడగానే మొదటగా ఆకట్టుకునేవి కళ్లు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి సహజంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కళ్లను ఆకర్షణగా ఉంచుకునేవారు. అయితే ఇప్పట్లో కళ్లకు ఐ లైనర్, ఐ షాడో తో మెరుగులు దిద్దుతున్నారు. ఐ షాడో ఫర్పెక్ట్ గా పెడితే కళ్లను చూసి ఇతరులు కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా కనిపిస్తారు. అందుకే ఐ షాడో ను టేప్ సహాయంతో ఈజీగా అప్లై చేయడం నేర్చుకోవాలి.
ఐ లైనర్..
ఐ షాడో మాత్రమే కాదు.. ఐ లైనర్ వేసుకుంటూ ఉంటారు. రెండు కళ్లక వేర్వేరు ఐ లైనర్ వేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఐ లైనర్ ను ఈజీగా అప్లై చేసుకునే విధానం ఉంది. చూపుడు వేలిపై ఒక చుక్క ఐ లైనర్ ఉంచాలి. వేలిని కళ్ల మూలలో నుంచి చెవి వైపుకు నెమ్మదిగా ఒక గీతను గీసినట్టు అప్లై చేయాలి. అంతే.. కష్టం లేకుండా కేవలం సెకెన్ల వ్యవధిలో అందంగా ఐ లైనర్ అప్లై చేసుకున్నట్టే.
కలర్ ఫుల్ షాడో..
టేప్ సహాయంతో ఐ షాడో అప్లై చేయడం తెలుసుకున్నారు కదా.. ఇప్పుడు ఐ షాడోను మరింత ఆకర్షణగా మార్చడానికి ఇయర్ బడ్ తీసుకోవాలి. ఈ ఇయర్ బడ్ సహాయంతో కలర్ ఫుల్ షాడ్ ను అప్లై చేయాలి. ఇయర్ బడ్ తో రుద్దాలి. ఇలా చేస్తే మిక్స్డ్ కలర్ లో ఐ షాడో ఔరా అనిపిస్తుంది.
*రూపశ్రీ.
