స్కిన్ టోన్ ప్రకారం ఫర్పెక్ట్ లిఫ్స్టిక్ ఇలా ఎంచుకోవచ్చు..!
లిప్స్టిక్.. నేటి కాలం అమ్మాయిలు తప్పక వాడుతున్న సౌందర్య ఉత్పత్తి. ఒకప్పుడు లిప్స్టిక్ ను శుభకార్యాలు, పార్టీలు, ప్రత్యేక రోజులో మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ మేకప్ లో లిప్స్టిక్ భాగం అయిపోయింది. అమ్మాయిలు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు కాజల్, పెదవులకు లిప్స్టిక్, ఫౌండేషన్ వంటివి తప్పక వేసుకుంటారు. అయితే చాలా మంది అమ్మాయిలకు చర్మ రంగుకు తగిన లిప్స్టిక్ ఎంచుకోవడం తెలియదు. చర్మ రంగుకు తగినట్టు ఫర్పెక్ట్ కలర్ ఎంచుకుంటే చాలా అందంగా కనిపించవచ్చు. ఇంతకీ చర్మ రంగుకు తగిన లిప్స్టిక్ ఎలా ఎంచుకోవాలంటే..
మేకప్.. రెగ్యులర్ గా అయినా, ప్రత్యేక సందర్భాలలో అయినా ఈ రోజులలో చాలా కామన్ అయిపోంది. మేకప్ గురించి తెలియని అమ్మాయిలు ఈ కాలంలో బహుశా లేరనే చెప్పవచ్చు. ఎంత మంచి మేకప్ వేసినా సరైన లిప్స్టిక్ పడకపోతే అందం మొత్తం పాడైనట్టే కనిపిస్తుంది. అయితే మార్కెట్లో చాలా రకాల లిప్స్టిక్ లు అందుబాటులో ఉంటాయి. ఒకే రంగులోనే బోలెడు షేడ్స్ ఉంటాయి.
డస్కీ స్కిన్ టోన్..
స్కిన్ టోన్ డస్కీగా ఉంటే అలాంటి వారు ప్రకాశవంతమైన రంగుల లిప్స్టిక్స్ ను ఎంచుకోవచ్చు. డస్కీ టోన్ ఉన్న మహిళలకు చాక్లెట్ బ్రౌన్ లేదా మెరూన్ షేడ్స్ బాగుంటాయి. ఈ లిప్స్టిక్స్ కూడా ముదురు రంగు దుస్తులతో ఇంకా అందంగా కనిపిస్తాయి.
ఫెయిర్ స్కిన్ టోన్..
ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలకు పాస్టెల్, లైట్ టోన్ షేడ్స్ తో కూడిన లిప్స్టిక్ లు చాలా బాగా నప్పుతాయి. అలాంటి షేడ్స్ లిప్స్టిక్స్ వాడితే అమ్మాయిల అందం ఇనుమడిస్తుంది. ఫెయిర్ రంగులో ఉన్న అమ్మాయిలు లేత గులాబీ, పింక్ న్యూడ్ కోరల్, క్లాసికల్ రెడ్ కలర్ లిప్స్టిక్ లు అప్లై చేయవచ్చు.
యావరేజ్ కలర్..
యావరేజ్ కలర్ లో ఉన్న అమ్మాయిలు మావ్, పించ్ కలర్ లేదా వార్మ్ బ్రౌన్ కలర్ లిప్స్టిక్ లను ట్రై చేయవచ్చు. ఇలాంటి షేడ్స్ చాలా మంచి లుక్ ఇవ్వడంలో బాగా సహాయపడతాయి. అదే సమయంలో లేత రంగు దుస్తులపై ఈ లిప్స్టిక్స్ ను వాడటం వల్ల మరింత హైలెట్ గా కనిపిస్తారు.
ముదురు చర్మం..
ముదురు చర్మం రంగు ఉన్నవారు కాపర్ బ్రౌన్, డార్క్ వైన్, పర్పుల్ షేడ్స్ లో ఉండే లిప్స్టిక్ ను ఎంచుకోవచ్చు. ఇవి ముదరుగా ఉన్నవారికి చాలా బాగా సెట్ అవుతాయి. మహిళల లుక్ క్లాసీగా చూపిస్తూనే బోల్డ్ గా కనిపించేలా చేస్తాయివి.
*రూపశ్రీ.
