నల్లగా ఉన్న పాదాలు  తెల్లగా,  అందంగా మారలంటే ఇంట్లోనే ఇలా స్క్రబ్ చేయండి..!

 

 

పాదాలు చాలా వరకు మన శరీరంో నిర్లక్ష్యం చేసే అవయవాలు.  ఎండలోనూ, వానలోనూ తిరుగుతుంటాం.  మురికిగా ఉన్న ప్రదేశాలలో కూడా తిరగాల్సి వస్తుంది.  కానీ ఇంటికి రాగానే కాళ్లు అయితే కడుక్కుంటాం కానీ ఇప్పటి  కాలుష్యానికి కేవలం కాళ్లు కడుక్కుంటే తగ్గిపోయేది కాదు ఈ మురికి దాని తాలూకు రంగు. చాలా వరకు పాదాలు పగిలి  వికారంగా కనిపిస్తూ ఉంటే మరికొందరికి పాదాలకు ఇరువైపులా  నల్లగా మారి ఉంటుంది.  దీన్ని తొలగించడానికి పెడిక్యూర్ బానే పనిచేస్తుంది కానీ బ్యూటీ పార్లర్ కు వెళ్లి వందలు, వేలాది రూపాయలు ఖర్చు చేయడం అందరి వల్లా కాదు.  తక్కువ ఖర్చుతో ఇంట్లోనే స్ర్కబ్ తయారు చేసుకుని వాడవచ్చు.  దీని గురించిప తెలుసుకుంటే..


మన ముఖాన్ని శుభ్రం చేయడానికి స్క్రబ్ ఎంత అవసరమో, అలాగే మన పాదాలకు కూడా స్క్రబ్ అవసరం. పాదాల కోసం కింద చెప్పిన విధంగా స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.  ఇది పూర్తిగా సహజమైనది.  చర్మాన్ని లోతుగా  ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది.

ఫుట్ స్క్రబ్ కు కావలసిన పదార్థాలు..


వోట్మీల్ - 1 గిన్నె
తేనె - 5 స్పూన్లు
కాఫీ - 3 స్పూన్
కొబ్బరి నూనె - 1 టీస్పూన్
పెరుగు - 1 స్పూన్

తయారీ విధానం..

ముందుగా ఓట్ మీల్ ను మిక్సీలో వేసి దాని పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె లేదా గాలి చొరబడని కంటైనర్‌ను తీసుకుని అందులో గ్రైండ్ చేసిన  ఓట్ మీల్ పొడి, కాఫీ, తేనె, కొబ్బరి నూనె,  పెరుగు వేసి బాగా కలపాలి. కావాలంటే అందులో పెరుగు పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేయగానే పాదాలను అందంగా మార్చే స్క్రబ్ సిద్ధమైనట్టే.

 స్నానం చేసేటప్పుడు పాదాలను పూర్తిగా స్క్రబ్ చేసి తర్వాత వాటిని కడగాలి. ప్రతిరోజూ స్క్రబ్‌ని ఉపయోగించిన తర్వాత  పాదాలు శుభ్రంగా, నలుపు పోయి అందంగా  మెరిసేలా కనిపించడం స్పష్టంగా గమనించవచ్చు.  రెగ్యులర్ గా చేయలేకపోతే  వారానికి రెండు మూడు సార్లు  పాదాలను స్క్రబ్ చేయవచ్చు.


                                                     *రూపశ్రీ.