ఈ టిప్ ఫాలో అయితే.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు సాఫ్ట్ గా మారతాయి..!
చలికాలం మొదలవగానే పాదాల మడమలు పగలడం మొదలవుతాయి, అలాంటి పరిస్థితుల్లో పాదాలకు నూనె రాసుకున్నా లేదా వేరే క్రీములు రాసుకున్నా పగిలిన మడమలు మానడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల చలికాలంలో చాలా రోజులు ఈ మడమల వల్ల ఏర్పడిన పగుళ్ల నొప్పితో బాధపడతారు. కానీ పగిలిన మడమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలుసా..? కింద చెప్పుకోబోయే చిట్కాను పాలో అయితే ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయమవుతాయి. ఇందుకోసం కేవలం రెండు పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడం ఎలాగో తెలుసుకంటే..
క్రాక్ క్రీమ్ కోసం కావలసిన పదార్థాలు..
కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు
గ్లిజరిన్ - 1 టీస్పూన్
విటమిన్ ఇ క్యాప్సూల్ - 1
(పై పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకుని క్రాక్ క్రీమ్ తయారు చేసుకుంటే క్రీమ్ ఎక్కువ తయారవుతుంది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు కూడా.)
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 చెంచాల కొబ్బరి నూనె, 1 చెంచా గ్లిజరిన్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి.
పగిలిన మడమలను నయం చేసి పాదాలను అందంగా మార్చే క్రీమ్ సిద్ధంగా ఉన్నట్టే. ఈ క్రీమ్ ను రాత్రిపూట ఉపయోగించాలి.
క్రాక్ క్రీమ్ ను ఉపయోగించే ముందు ఒక బకెట్‌లో వేడి నీళ్లు పోసి అందులో పాదాలను 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల సమయం ముగిసిన తర్వాత నీటి నుండి పాదాలను తీసి పొడ టవల్ తో శుభ్రంగా తుడవాలి.
పాదాలు పొడిగా మారిన తరువాత సిద్ధం చేసిన క్రీమ్‌ను అప్లై చేసి, ఆపై కాటన్ సాక్స్ వేసుకుని నిద్రిపోవాలి.
ఉదయానికల్లా పగుళ్లు ఏర్పడిన మడమల స్థానంలో మృదువుగా మారిన మడమలు ఉంటాయి. మొదటిసారే చాలా మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా వరుసగా ఒక మూడు నాలుగు రోజులు చేశారంటే పాదాలు కోమలంగా మారిపోతాయి. ఈ క్రాక్ క్రీమ్ ఇచ్చే ఫలితాలు చూసి పక్కాగా షాకవుతారు.
*రూపశ్రీ.