కేవలం ఒక్క నెలలో జుట్టు స్వరూపాన్ని మార్చే ఆయిల్ ఇది.. దీన్నెలా చేయాలంటే..!

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఏ కొద్దిగా జుట్టు రాలుతున్నా చాలా ఆందోళన చెందుతారు. అయితే జుట్టు రాలకుండా ఉండటానికి పోషకాహారం తీసుకోవడంతో పాటు.. జుట్టు సంరక్షణ కూడా చాలా ముఖ్యం. జుట్టుకు ఎలాంటి నూనె పెడుతున్నారు? ఎలాంటి షాంపూ వాడుతున్నారు? ఎలా దువ్వుతున్నారు? జుట్టును జాగ్రత్తగా చూసుకునే విధానం ఎలా ఉంది? ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. ఇకపోతే.. ఇంట్లోనే తయారు చేసుకునే నూనె వల్ల జుట్టు చాలా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనె ఏంటి? దీన్ని తయారు చేయడానికి ఏ పదార్థాలు వినియోగించాలి? ఎలా తయారు చేయాలి? మొదలైన విషయాలన్నీ తెలుసుకుంటే..
నూనె తయారీకి కావలసిన పదార్థాలు..
కొబ్బరి నూనె
మెంతి గింజలు
కరివేపాకు
మందార పువ్వులు
ఉల్లిపాయ రసం
తయారీ విధానం..
ముందుగా మెంతుల గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన ఉంచేటప్పుడు, కరివేపాకు, మందార పువ్వులను కడిగి ఎండలో ఆరబెట్టాలి. దీని తరువాత, ఉల్లిపాయను తురుముకుని దాని రసాన్ని తీయాలి.
మొదటగా కొబ్బరి నూనెను ఇనుప పాన్‌లో వేడి చేయాలి. నూనె వేడెక్కడం ప్రారంభించినప్పుడు, పొడి పదార్థాలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. ముందుగా మెంతులు వేయండి. ఆ తర్వాత కరివేపాకు మరియు మందార పువ్వులను వేయాలి. అవి చిటపటలాడుతూ రంగు మారతాయి. ఇలా జరిగేటప్పుడు వాటిలో పోషకాలు నూనెలోకి చేరతాయి. ఇలా జరిగినప్పుడు ఉల్లిపాయ రసం వేసి మరిగించాలి. నూనెలో ఉల్లిపాయ రసం బాగా ఇగిరిపోయాక స్టౌ ఆఫ్ చేయాలి. నూనె పూర్తిగా చల్లబరచాలి. అది చల్లబడిన తర్వాత ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేయాలి.
ఎలా ఉపయోగించాలి..
ఈ నూనను రెగ్యులర్ గా కంటే వారంలో 2 లేదా 3 సార్లు ఉపయోగించడం మేలు. నూనెను జుట్టు మూలాల నుండి అప్లై చేయాలి. ఇలా అప్లే చేసిన తరువాత సున్నితంగా మసాజ్ చేయాలి. కనీసం 1 గంట లేదా రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. గంట తరువాత లేదా మరుసటిరోజు ఉదయం గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి.
వారంలో 2లేదా 3 సార్లు ఈ ప్రాసెస్ చేస్తుంటే జుట్టు చక్కగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ పాల్ అనేది కనిపించదు. ఈ నూనెలో ఉపయోగించిన ఏ పదార్థం ఎలా పనిచేస్తుందంటే..
మెంతులు: జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, చుండ్రును తొలగిస్తుంది.
కరివేపాకు: కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
మందార: జుట్టు పొడవు, సాంద్రతను పెంచుతుంది.
ఉల్లిపాయ రసం: జుట్టు కుదుళ్లను సక్రియం చేస్తుంది.
కొబ్బరి నూనె: తలకు బాగా పోషణ అందిస్తుంది.
*రూపశ్రీ.



