హెయిర్ కలర్ వేసే వారికి దిమ్మ తిరిగే షాకింగ్ నిజాలు..!

 ఫ్యాషన్ కోసం లేదా జుట్టు తెల్లబడిందనే కారణంతోనో చాలామంది జుట్టుకు రంగు వేస్తుంటారు. ఇప్పట్లో మార్కెట్లో జుట్టుకు వేసే రంగులు చాలా వచ్చేశాయి.  కొందరు జుట్టుకు  రోజులు, వారాల వ్యవధిలో రంగు వేస్తుంటారు.  ఇలా  కొన్ని రోజుల వ్యవధిలో  జుట్టుకు రంగు వేసే వారి కోసమే ఈ సమాచారం.  జుట్టుకు  రంగు వేయడం ఫ్యాషన్ అయిపోయింజి.  ట్రెండీ అండ్ న్యూ లుక్ కోసం ప్రతి ఒక్కరూ తమ జుట్టుకు పదేపదే రంగులు వేస్తారు. కానీ  జుట్టు రంగు కారణంగా కలిగే నష్టం గురించి ఎవరూ ఆలోచించి ఉండరు.  ఈ నష్టాల గురించి తెలిస్తే తప్పకుండా షాకవుతారు.

 జుట్టుకు తరచుగా రంగు వేయడం వల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు..

జుట్టు రాలడం పెరుగుతుంది..

ఎక్కువ  గ్యాప్ లేకుండా పదేపదే జుట్టుకు రంగులు వేస్తే జుట్టు రాలడం పెరుగుతుంది. హెయిర్ కలర్ వల్ల జుట్టుకు చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది జుట్టు  మూలాలను బలహీనపరుస్తుంది. హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. దీని కారణంగా  వెంటనే జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడాలి.

 దురద పెరుగుతుంది..

హెయిర్ కలర్ ను పదేపదే ఉపయోగించడం వల్ల నెత్తిమీద దురద పెరుగుతుంది. ఈ దురద చాలా తరచుగా అలెర్జీగా మారుతుంది.  చాలా చికాకు కలిగిస్తుంది. అందువల్ల నెత్తిమీద  ఏమాత్రం దురదగా అనిపించినా వెంటనే హెయిర్ కలర్ వాడటం మానేయాలి. లేకపోతే  సమస్య పెరుగుతుంది.

జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటుంది..

ఇప్పట్లో మార్కెట్లో అనేక హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్ని రకాల రసాయనాలు ఉంటాయి. జుట్టులో ఈ కెమికల్స్ ఎక్కువగా వాడితే జుట్టు పొడిబారి, నిర్జీవంగా, బలహీనంగా మారుతుంది. కాబట్టి  జుట్టు పొడిగా,  నిర్జీవంగా మారకూడదని  కోరుకుంటే, అమ్మోనియాతో కూడినమ హెయిర్ కలర్ ఉపయోగించడం మానుకోవాలి.

చుండ్రు సమస్య పెరుగుతుంది..

ఎక్కువ హెయిర్ కలర్ వాడటం వల్ల నెత్తిమీద తేమ లోపిస్తుంది. దీని వల్ల నెత్తిమీద చుండ్రు పేరుకుపోవడం చాలా సాధారణమైన సమస్యగా మారుతుంది.  కాబట్టి ఒకసారి రంగు మారిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. తద్వారా జుట్టు కూడా శుభ్రంగా ఉంటుంది.

                                    *రూపశ్రీ.