50ఏళ్ళ వయసులో 20ఏళ్ళలా యవ్వనంగా కనబడటం సాధ్యమా!
50ఏళ్ళ వయసొచ్చినా 20ఏళ్ళ అమ్మాయిలా యవ్వనంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. అయితే జీవన శైలి, తీకుకునే ఆహారం, అలవాట్ల కారణంగా 30ఏళ్ళకే ముఖం మీద ముడుతలు మొదలై ఆంటీలా కనబడుతుంటారు. ముడుతలు కనబడకూడదని చాలామంది మేకప్ తో కవర్ చేస్తారు, మరికొందరు యవ్వనంగా ఉంచుతాయంటూ చూపెట్టే ప్రతీ సౌందర్య ఉత్పత్తిని వాడుతారు. కానీ వీటి వల్ల ధీర్ఘకాలిక ఫలితాలు ఉండవు. ముఖం మీద ముడుతలు తొందరగా రాకూడదన్నా, అవి తొలగిపోవాలన్నా కష్టమేమీ కాదు. దీనికోసం చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్క పదార్థం ఆహారంలో భాగం చేసుకోవడం. ఇంతకూ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేమిటి? దీన్నెలా తీసుకోవాలి అనే విషయం తెలుసుకంటే..
బ్యూటీ ఉత్పత్తులు ఎప్పుడు ముడుతలు తగ్గించడంలో సహాయపడవు. అవి చర్మం మీద ప్రభావం చూపించి తాత్కాలికంగా ముడుతలు కవర్ చేసినా ఆ తరువాత నష్టాన్ని పెంచుతాయి. కాబట్టి ముడుతలు పోవాలన్నా, రాకూడదన్నా తీసుకోవాల్సిన ముఖ్య పదార్థం విటమిన్-సి. విటమిన్-సి బాగా తీసుకుంటూ ఉంటే ముఖం మీద ముడుతల సమస్యలు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆహార, ఆరోగ్య నిపుణులే సెలవిచ్చారు. విటమిన్-సి లో సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ స్వభావాలుంటాయి. ఇది చర్మానికి సంబంధించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వయసుతో పాటు వచ్చే చర్మ సమస్యలను కూడా అధిగమిస్తుంది.
విటమిన్-సి ముడుతలను తగ్గిస్తుంది
కనీసం మూడు నెలల పాటు శరీరానికి సరిపడినంత విటమిన్-సి ను రోజువారీగా తీసుకుంటూ ఉంటే ముఖం, మెడ చర్మంలో ముడతలు, మచ్చలు, గీతలు మంత్రమేసినట్టు మాయమవుతాయి. చర్మం యవ్వనంగా మారడమే కాకుండా ముఖ ఆకృతిలో కూడా ఎంతో మార్పు కనిపిస్తుంది.విటమిన్-సిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో మాత్రమే కాకుండా చర్మసంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా సూర్యకాంతి వల్ల వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్-సి కలిసిన సన్‌స్క్రీన్ హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుందనే విషయం అధ్యయనాల్లో తేలింది. ఇది కేవలం బాహ్య రక్షణకోసం మాత్రమే ఉపయోగపడే మార్గం.
సప్లిమెంట్స్ కాదు, ఆహారంపై శ్రద్ధ వహించాలి..
విటమిన్-సి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అది రెగులర్ గా తీసుకోవాలనే ఆలోచనతో చాలామంది విటమిన్-సి సప్లిమెంట్లు తీసకోవడం మీద ఆసక్తి చూపిస్తారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు. విటమిన్-సి వల్ల ఆగోర్యకరమైన ప్రయోజనాలు, ఫలితాలు పొందాలి అంటే ఆహారం ద్వారా దాన్ని పొందడమే ఉత్తమం. విటమిన్-సి అనేక ఆహార పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది. నిమ్మ, నారింజ, పైనాపిల్, మామిడి వంటి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. సీజన్ పండ్లే కాకుండా స్ట్రాబెర్రీ, కివి లాంటి అన్నిరకాల పుల్లని పండ్లలో కూడా ఈ విటమిన్-సి పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిది. చర్మసమస్యలు ఏవైనా వచ్చినప్పుడు చర్మసంబంద వైద్యుడి సలహా లేకుండా ఎలాంటి ఉత్పత్తులు వాడకూడదు.
*నిశ్శబ్ద.